శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 2 🌻


అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను. మునులందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను.

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 48 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 2 🌻


11. Sunīthā bore only Vena[11] from Aṅga. He, who was not a protector, and was delighted in doing sins was killed by the sages with their kuśa grass.

12. Then for the sake of progeny, the sages churned his. right hand. When the hand of Veṇa was churned King Pṛthu came into being.

13. Having seen him, the sages said, “This person will make the subjects happy and will attain great valour and fame.

14. He was born with a bow and an armour as if consuming (everything) by his lustre. Pṛthu, the son of Vena, the predecessor of the kṣatriyas, protected the subjects.

15. That lord of the earth is the first among those coronated. after the Rājasūya (sacrifice). From that (ceremony) were born the clever (singers) sūta and māgadha.

16-1 7. The two heroes praised him. He became a king by pleasing the people. For the sake of (getting) grains and for the existence of the subjects, the cow (earth) was milked by him along with the celestials, sages, gandharvas, nymphs, manes, demons, snakes, plants, mountains and people.

18. The earth being milked in their respective vessels gave milk as much as (they) wished. (All) sustained their lives with that.

19. Antardhāna and Pālita[12], the two righteous sons were born to Pṛthu. From Antardhāna, Sikhaṇḍinī begot Havirdhāna.

20. Dhiṣaṇā, of the family of Agni gave birth to the six sons—Prācīnabarhiṣ, Śukra, Gaya, Kṛṣṇa, Vraja and Ajina from Havirdhāna.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

No comments:

Post a Comment