15 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES కూర్మ జయంతి విశిష్టత శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, ఆదివారం, మే 2022 భాను వాసరే 🌹
🌹కూర్మ జయంతి విశిష్టత - శుభాకాంక్షలు 🌹
🌹 కపిల గీత - 8 / Kapila Gita - 8🌹
2) 🌹. శివ మహా పురాణము - 564 / Siva Maha Purana - 564🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 183 / Osho Daily Meditations - 183🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కూర్మ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 15, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కూర్మ జయంతి, వృషభ సంక్రాంతి, Kurma Jayanti, Vrishabha Sankranti 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 5 🍀*

*6. ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం ప్రచణ్డమార్తాణ్డ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ*
*సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శుధ్ధ సాత్విక బలం చేత మాత్రమే మోక్ష మార్గములో ప్రయాణము చెయ్యగలరు. సత్వము- శాంతము- సమరసత్వము అనేవి సాధకుడు ముందుగా పొందగలగాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల చతుర్దశి 12:47:00 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: స్వాతి 15:35:12 వరకు
తదుపరి విశాఖ
యోగం: వ్యతీపాత 09:49:21 వరకు
తదుపరి వరియాన
కరణం: వణిజ 12:43:00 వరకు
వర్జ్యం: 20:39:02 - 22:05:54
దుర్ముహూర్తం: 16:57:16 - 17:49:03
రాహు కాలం: 17:03:45 - 18:40:50
గుళిక కాలం: 15:26:40 - 17:03:45
యమ గండం: 12:12:30 - 13:49:35
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 07:28:48 - 08:57:12
మరియు 29:20:14 - 30:47:06
సూర్యోదయం: 05:44:10
సూర్యాస్తమయం: 18:40:50
చంద్రోదయం: 17:57:43
చంద్రాస్తమయం: 04:51:26
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
లంబ యోగం - చికాకులు, అపశకునం
15:35:12 వరకు తదుపరి ఉత్పాద యోగం
- కష్టములు, ద్రవ్య నాశనం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కూర్మావతార విశిష్టత - కూర్మ జయంతి శుభాకాంక్షలు -🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే |*
*వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ ||*

*విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.*

*🍀. అవతార గాథ 🍀*

*ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.*

*🍀. కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి! 🍀*

*శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే.*

*కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.*

*దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 8 / Kapila Gita - 8🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-2 🌴*

*8. తస్య త్వం తమసోऽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్*
*సచ్చక్షుర్జన్మనామన్తే లబ్ధం మే త్వదనుగ్రహాత్*

*నాకు నేనుగా ఈ అజ్ఞ్యానాన్ని దాటలేను. అది దాటి తీరమును చేర్చే నిన్ను పొందాను. ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని నేత్రం దొరికింది. (చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను, చూడకూడని దన్ని చూపితే చెడ్డ కన్ను). ఇన్ని జన్మల తరువాత చక్కని నేత్రం లభించింది. నా గొప్పదనముతో కాదు. నీ అనుగ్రహం వలన. ఈ నేత్రము నీవే. నీవే ప్రసాదించావు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 8 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge -2 🌴*

*8. tasya tvam tamaso 'ndhasya dusparasyadya paragam*
*sac-caksur janmanam ante labdham me tvad-anugrahat*

*Your Lordship is my only means of getting out of this darkest region of ignorance because You are my transcendental eye, which, by Your mercy only, I have attained after many, many births.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 564 / Sri Siva Maha Purana - 564 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 2 🌻*

సావిత్రి లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి స్వధా, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు (11). సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహా అను వారలే గాక ఇంకనూ ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్ల నన్నిటిని విస్తరభీతిచే చెప్పుట లేదు (12). పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు (13). 

కావున నీవు సర్వకాలముల యందు నీభర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను గ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు (14). పతివ్రతా ధర్మము చాల గొప్పది యని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్ఠత గల ధర్మము మరియొకటి లేదనుట నిశ్చతము (15).

పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతీ! భర్త నిలబడియున్న సమయమంతయూ పతివ్రత నిలబడియే ఉండవలెను (16). సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి, నిత్యము ఆతని కంటె ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వవిధములుగా భర్తకు హితమును చేయుచూ ఆతనికి ప్రియురాలు కావలెను (17). 

ఓ పార్వతీ! భర్త యెదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థియై పొరుగూరు వెళ్లినచో ఆమె అలంకారములను ఆ సమయములో ధరించరాదు (18). పతివ్రత ఏ సమయము నందైననూ భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టిననూ, కొట్టిననూ తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను (19). భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో ఆతని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకవలెను (20). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 564 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 2 🌻*

11-13. The chaste ladies—Sāvitrī, Lopāmudrā, Arundhatī, Śāṇḍilyā, Śatarūpā, Anasūyā, Lakṣmī, Svadhā, Satī, Saṃjña, Sumati, Śraddhā, Menā, Svāhā and several others whose names are not mentioned lest the list should be too detailed have attained adoration from all people by their virtue of chastity. They have been honoured by Brahmā, Viṣṇu, Śiva and great sages.

14. Lord Śiva, benefactor of the depressed, worthy of worship and the goal of the good shall be served by you always.

15. The duty of a chaste lady is very important and it has been mentioned in the Vedas and Smṛtis. No other duty is so admirable as this.

16. A chaste lady shall take food only after her husband has taken it. O Śivā, if he stands, the woman too shall remain standing.

17. When he sleeps she can also sleep. But she must intelligently wake up before him. She shall do what is beneficial to him. She shall love him without any sort of deception.

18. O Śivā, she shall never show herself unembellished to him. If for any important work he is on exile she shall never adorn herself.

19. A chaste lady shall never mention her husband’s name. If the husband scolds or rebukes her she shall not abuse him in return. Even when beaten by him she shall remain glad and say “I may even be killed, O lord. Be kind to me.”

20. When called by him she shall leave the work she is engaged in and approach him immediately. With palms joined in reverence and love she shall bow to him and say as follows.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 18*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 2 🌻*

అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను. మునులందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను.

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 48 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 18*
*🌻 Genealogy of Svāyambhuva Manu - 2 🌻*

11. Sunīthā bore only Vena[11] from Aṅga. He, who was not a protector, and was delighted in doing sins was killed by the sages with their kuśa grass.

12. Then for the sake of progeny, the sages churned his. right hand. When the hand of Veṇa was churned King Pṛthu came into being.

13. Having seen him, the sages said, “This person will make the subjects happy and will attain great valour and fame.

14. He was born with a bow and an armour as if consuming (everything) by his lustre. Pṛthu, the son of Vena, the predecessor of the kṣatriyas, protected the subjects.

15. That lord of the earth is the first among those coronated. after the Rājasūya (sacrifice). From that (ceremony) were born the clever (singers) sūta and māgadha.

16-1 7. The two heroes praised him. He became a king by pleasing the people. For the sake of (getting) grains and for the existence of the subjects, the cow (earth) was milked by him along with the celestials, sages, gandharvas, nymphs, manes, demons, snakes, plants, mountains and people.

18. The earth being milked in their respective vessels gave milk as much as (they) wished. (All) sustained their lives with that.

19. Antardhāna and Pālita[12], the two righteous sons were born to Pṛthu. From Antardhāna, Sikhaṇḍinī begot Havirdhāna.

20. Dhiṣaṇā, of the family of Agni gave birth to the six sons—Prācīnabarhiṣ, Śukra, Gaya, Kṛṣṇa, Vraja and Ajina from Havirdhāna.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 183 / Osho Daily Meditations - 183 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 183. తత్వశాస్త్రం 🍀*

*🕉. మీరు అనుకున్నది ఏదైనా దొకరనప్పుడు దాని గురించి ఆలోచన ప్రారంభించడం, తరువాత దాని గురించి ఒక తత్వశాస్త్రం సృష్టించడం దాదాపు ఎల్లప్పుడూ జరుగుతుంది. 🕉*
 
*ప్రేమించని వారు ప్రేమ గురించి పుస్తకాలు రాస్తారని నా పరిశీలన; ఇది ఒక రకమైన ప్రత్యామ్నాయం. ప్రేమించలేని వారు కవిత్వం రాస్తారు, చాలా గొప్పగా ప్రేమ కవిత్వం రాస్తారు, కానీ వారికి ప్రేమ అనుభవం లేదు కాబట్టి వారి కవిత్వం అంతా ఊహాగానాలే.*

*వారు గొప్ప ఊహాశక్తిని కలిగి ఉండవచ్చు, కానీ దీనికి ప్రేమ యొక్క వాస్తవికతతో సంబంధం లేదు. ప్రేమ వాస్తవికత పూర్తిగా భిన్నమైనది; అది అనుభవించాలి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 183 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 183. PHILOSOPHY 🍀*

*🕉 It almost always happens that when you are missing something you start thinking about it, you start creating a philosophy about it. 🕉*
 
*It is my observation that people who have not loved write books about love; it is a kind of substitute. People who have not been able to love write poetry, they write very great love poetry, but they don't have any experience of love, so all their poetry is just speculation.*

*They may have great flights of imagination, but this has nothing to do with the reality of love. Love's reality is totally different; it has to be experienced.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 371 -2. ‘వైఖరీ రూపా’🌻* 

*ఆధునికము, నాగరికము అయిన జనులు అశ్లీలమగు పదములు ప్రయోగించుటకు జంకుట లేదు. విమర్శ కుటిలత్వము, మోసము, డంభము, రాగ ద్వేషములు, క్రోధము వైఖరి ద్వారా ప్రదర్శింపబడు చున్నది. వైఖరీ వాక్కులకు ప్రధాన సాధనము భాష, భాషా వినియోగము క్రమముగ పతనము చెందుచున్నదే గాని ఉత్తమ భాషణము గోచరించుట లేదు. అక్షరములు కూడ సరిగ పలుకలేని స్థితిలో మానవులున్నారు. భాషణమును సంస్కరించు కొనినచో మానవుడు తనకు తాను చాలమటుకు సంస్కారి కాగలడు. వైఖరి మారినచో దాని ప్రభావము క్రమముగ మధ్యమ పశ్యంతిపై కూడా ప్రసరించి సత్యగ్రహణము అవగాహనము పొందుటకు వీలగును.*

*“వాక్కు మూడు భాగములు గుహలో నుండగ, నాలుగవది యగు వైఖరి ప్రకటింపబడు చున్నది" అని ఋగ్వేదము పలుకుచున్నది. మనిషి మాటను బట్టి భావములు తెలియనగును. భావమును బట్టి అతని అవగాహనము తెలియనగును. అతని అవగాహనను బట్టి అతని స్థితి తెలియనగును. ఇట్లు వాక్కు ద్వారా జీవుని తెలియుట తెలిసినవారికి మాత్రమే సాధ్యపడును. వాక్కే సర్వస్వము. దానిని ఋగ్వేదమని కీర్తించినది. అట్టి వాక్కు పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అను నాలుగు స్థితులను పొందుచున్నది. పరా వాక్కునకు, పశ్యంతి వాక్కునకు నడుమ ప్రత్యక్చితీ రూపమున కూడ వాగ్దేవిని దర్శించ వచ్చును. ఇట్లు ఈ సహస్ర నామమునందు వాక్కు పంచముఖిగ పేర్కొనబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 371-2. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻*

*In fact the theory of evolution of speech purely depends upon the materialistic treatment of prāṇa or life energy. The whispering sound in the stage of madhyama fully transforms into speech and delivered in the form of vaikhari.*

*It is said that will (icchā) forms the basis of speech to finally merge with consciousness. Importance of consciousness is repeatedly emphasised.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment