శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 371 -2. ‘వైఖరీ రూపా’🌻


ఆధునికము, నాగరికము అయిన జనులు అశ్లీలమగు పదములు ప్రయోగించుటకు జంకుట లేదు. విమర్శ కుటిలత్వము, మోసము, డంభము, రాగ ద్వేషములు, క్రోధము వైఖరి ద్వారా ప్రదర్శింపబడు చున్నది. వైఖరీ వాక్కులకు ప్రధాన సాధనము భాష, భాషా వినియోగము క్రమముగ పతనము చెందుచున్నదే గాని ఉత్తమ భాషణము గోచరించుట లేదు. అక్షరములు కూడ సరిగ పలుకలేని స్థితిలో మానవులున్నారు. భాషణమును సంస్కరించు కొనినచో మానవుడు తనకు తాను చాలమటుకు సంస్కారి కాగలడు. వైఖరి మారినచో దాని ప్రభావము క్రమముగ మధ్యమ పశ్యంతిపై కూడా ప్రసరించి సత్యగ్రహణము అవగాహనము పొందుటకు వీలగును.

“వాక్కు మూడు భాగములు గుహలో నుండగ, నాలుగవది యగు వైఖరి ప్రకటింపబడు చున్నది" అని ఋగ్వేదము పలుకుచున్నది. మనిషి మాటను బట్టి భావములు తెలియనగును. భావమును బట్టి అతని అవగాహనము తెలియనగును. అతని అవగాహనను బట్టి అతని స్థితి తెలియనగును. ఇట్లు వాక్కు ద్వారా జీవుని తెలియుట తెలిసినవారికి మాత్రమే సాధ్యపడును. వాక్కే సర్వస్వము. దానిని ఋగ్వేదమని కీర్తించినది. అట్టి వాక్కు పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అను నాలుగు స్థితులను పొందుచున్నది. పరా వాక్కునకు, పశ్యంతి వాక్కునకు నడుమ ప్రత్యక్చితీ రూపమున కూడ వాగ్దేవిని దర్శించ వచ్చును. ఇట్లు ఈ సహస్ర నామమునందు వాక్కు పంచముఖిగ పేర్కొనబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 371-2. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻


In fact the theory of evolution of speech purely depends upon the materialistic treatment of prāṇa or life energy. The whispering sound in the stage of madhyama fully transforms into speech and delivered in the form of vaikhari.

It is said that will (icchā) forms the basis of speech to finally merge with consciousness. Importance of consciousness is repeatedly emphasised.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

No comments:

Post a Comment