🌹 . శ్రీ శివ మహా పురాణము - 564 / Sri Siva Maha Purana - 564 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
🌻. పతివ్రతా ధర్మములు - 2 🌻
సావిత్రి లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి స్వధా, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు (11). సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహా అను వారలే గాక ఇంకనూ ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్ల నన్నిటిని విస్తరభీతిచే చెప్పుట లేదు (12). పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు (13).
కావున నీవు సర్వకాలముల యందు నీభర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను గ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు (14). పతివ్రతా ధర్మము చాల గొప్పది యని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్ఠత గల ధర్మము మరియొకటి లేదనుట నిశ్చతము (15).
పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతీ! భర్త నిలబడియున్న సమయమంతయూ పతివ్రత నిలబడియే ఉండవలెను (16). సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి, నిత్యము ఆతని కంటె ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వవిధములుగా భర్తకు హితమును చేయుచూ ఆతనికి ప్రియురాలు కావలెను (17).
ఓ పార్వతీ! భర్త యెదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థియై పొరుగూరు వెళ్లినచో ఆమె అలంకారములను ఆ సమయములో ధరించరాదు (18). పతివ్రత ఏ సమయము నందైననూ భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టిననూ, కొట్టిననూ తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను (19). భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో ఆతని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకవలెను (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 564 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴
🌻 Description of the duties of the chaste wife - 2 🌻
11-13. The chaste ladies—Sāvitrī, Lopāmudrā, Arundhatī, Śāṇḍilyā, Śatarūpā, Anasūyā, Lakṣmī, Svadhā, Satī, Saṃjña, Sumati, Śraddhā, Menā, Svāhā and several others whose names are not mentioned lest the list should be too detailed have attained adoration from all people by their virtue of chastity. They have been honoured by Brahmā, Viṣṇu, Śiva and great sages.
14. Lord Śiva, benefactor of the depressed, worthy of worship and the goal of the good shall be served by you always.
15. The duty of a chaste lady is very important and it has been mentioned in the Vedas and Smṛtis. No other duty is so admirable as this.
16. A chaste lady shall take food only after her husband has taken it. O Śivā, if he stands, the woman too shall remain standing.
17. When he sleeps she can also sleep. But she must intelligently wake up before him. She shall do what is beneficial to him. She shall love him without any sort of deception.
18. O Śivā, she shall never show herself unembellished to him. If for any important work he is on exile she shall never adorn herself.
19. A chaste lady shall never mention her husband’s name. If the husband scolds or rebukes her she shall not abuse him in return. Even when beaten by him she shall remain glad and say “I may even be killed, O lord. Be kind to me.”
20. When called by him she shall leave the work she is engaged in and approach him immediately. With palms joined in reverence and love she shall bow to him and say as follows.
Continues....
🌹🌹🌹🌹🌹
15 May 2022
No comments:
Post a Comment