1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, గురువారం, అక్టోబరు 2022 బృహస్పతి వాసరే THURSDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 266 / Bhagavad-Gita -266 - 6వ అధ్యాయము 33 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 665 / Vishnu Sahasranama Contemplation - 665 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 627 / Sri Siva Maha Purana - 627 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 344 / DAILY WISDOM - 344 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 243 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹06, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పాపాంకుశ ఏకాదశి, Papankusha Ekadashi🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 12 🍀*
*12. అవ్యాకృతాద్వ్యాకృతవానసి త్వం నామాని రూపాణి చ యాని పూర్వం*
*శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నీకు ఈశ్వరునితో తత్త్వతః, స్వభావతః ఏకత్వమున్నది. తోటి మానవులతో ఏకాత్మత ఉన్నది. కనుక, మెలకువ పొంది, దివ్యత్వం వైపు పురోగమిస్తూ నీలోను, ఇతరులలోను గల ఈశ్వరుని కొరకు జీవించు' 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 09:41:33 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ధనిష్ట 19:42:55 వరకు
తదుపరి శతభిషం
యోగం: శూల 26:19:09 వరకు
తదుపరి దండ
కరణం: విష్టి 09:41:33 వరకు
వర్జ్యం: 01:00:20 - 02:30:04
మరియు 26:28:48 - 27:59:12
దుర్ముహూర్తం: 10:05:06 - 10:52:42
మరియు 14:50:43 - 15:38:19
రాహు కాలం: 13:33:22 - 15:02:37
గుళిక కాలం: 09:05:36 - 10:34:51
యమ గండం: 06:07:05 - 07:36:21
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 09:58:44 - 11:28:28
సూర్యోదయం: 06:07:05
సూర్యాస్తమయం: 18:01:07
చంద్రోదయం: 15:47:58
చంద్రాస్తమయం: 02:30:58
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 19:42:55 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 266 / Bhagavad-Gita - 266 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 33 🌴*
*33. అర్జున ఉవాచ*
*యోయం యోగస్త్వయా ప్రోక్త: సామ్యేన మధుసూదన |*
*ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||*
🌷. తాత్పర్యం :
*అర్జునుడు పలికెను : ఓ మధుసుదనా! మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది.*
🌷. భాష్యము :
“శుచౌదేశే” యను పదముతో ఆరంభమై “యోగీపరమ:” యను పదముతో సమాప్తి నొందెడి యోగపద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునునకు వివరించగా, దానికి తాను అశక్తుడననెడి భావనలో అతడు ఆ పద్ధతిని ఇచ్చట తిరస్కరించుచున్నాడు. కలియుగములో సాధారణమానవునకు గృహమును విడిచి కొండలలోనో, అడవులలోనో ఏకాంతస్థలమునకు పోయి యోగాభ్యాసము చేయుట సాధ్యము కానటువంటి విషయము. స్వల్పజీవితము కొరకు తీవ్రసంఘర్షణ యనునది ఈ యుగలక్షణమై యున్నది.
ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయమున శ్రద్ధారహితులై యున్నారు. సామాన్యములు మరియు ఆచరణయోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరన్నచో నియమితజీవనము, ప్రత్యేక ఆసనపద్ధతి, స్థాననిర్దేసము, విషయకర్మల నుండి మనోనిగ్రహము వంటి కఠినకార్యములు గల యోగపద్ధతిని అనుసరింపలేరనెడి విషయమును గూర్చి వేరుగా చెప్పపనిలేదు. పలు అనుకూలపరిస్థితులను కలిగియున్నప్పటికిని క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగము నాచరించుట తనకు సాధ్యము కాదని భావించెను. రాచవంశమునకు చెందిన అతడు పలుయోగ్యతల దృష్ట్యా అత్యంత ఉన్నతుడై యుండెను.
అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు గలవాడు మరియు అన్నింటికి మించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. ఐదువేల సంవత్సరములకు పూర్వము అర్జునుడు ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితుల కన్నను చక్కని అనుకూల పరిస్థితులను కలిగియున్నను ఈ యోగపద్ధతిని తిరస్కరించెను. అతడు యోగమును ఆచరించినట్లుగా మనకెటువంటి చారిత్రికాధారము లభింపదు. కనకనే ఈ యోగపద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది.
ఒకవేళ ఏ కొద్దిమందికో (అసాధారణ పురుషులు) సాధ్యపడినను జనసామాన్యమునకు మాత్రము ఇది మిగుల అసాధ్యము. ఐదువేల సంవత్సరముల క్రిందటే దీని విషయమిట్లుండ ఇక నేటి పరిస్థితి యేమిటి? నామమాత్ర యోగశాలల యందు మరియు సంఘములందు ఈ యోగవిధానము అనుకరింప యత్నించువారు తమను తాము కృతార్థులుగా భావించును, నిక్కముగా కాలమును వృథాపరచునట్టివారే యగుచున్నారు. వాంఛితమగు లక్ష్యమును గూర్చిన విషయమున వారు సంపూర్ణముగా అజ్ఞానులై యున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 266 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 33 🌴*
*33. arjuna uvāca*
*yo ’yaṁ yogas tvayā proktaḥ sāmyena madhusūdana*
*etasyāhaṁ na paśyāmi cañcalatvāt sthitiṁ sthirām*
🌷 Translation :
*Arjuna said: O Madhusūdana, the system of yoga which You have summarized appears impractical and unendurable to me, for the mind is restless and unsteady.*
🌹 Purport :
The system of mysticism described by Lord Kṛṣṇa to Arjuna beginning with the words śucau deśe and ending with yogī paramaḥ is here being rejected by Arjuna out of a feeling of inability. It is not possible for an ordinary man to leave home and go to a secluded place in the mountains or jungles to practice yoga in this Age of Kali. The present age is characterized by a bitter struggle for a life of short duration. People are not serious about self-realization even by simple, practical means, and what to speak of this difficult yoga system, which regulates the mode of living, the manner of sitting, selection of place, and detachment of the mind from material engagements. As a practical man, Arjuna thought it was impossible to follow this system of yoga, even though he was favorably endowed in many ways.
He belonged to the royal family and was highly elevated in terms of numerous qualities; he was a great warrior, he had great longevity, and, above all, he was the most intimate friend of Lord Kṛṣṇa, the Supreme Personality of Godhead. Five thousand years ago, Arjuna had much better facilities than we do now, yet he refused to accept this system of yoga. In fact, we do not find any record in history of his practicing it at any time. Therefore this system must be considered generally impossible in this Age of Kali. Of course it may be possible for some very few, rare men, but for the people in general it is an impossible proposal.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 665 / Vishnu Sahasranama Contemplation - 665🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌻665. బ్రహ్మ వివర్ధనః, ब्रह्म विवर्धनः, Brahma vivardhanaḥ🌻*
*ఓం బ్రహ్మవివర్ధనాయ నమః | ॐ ब्रह्मविवर्धनाय नमः | OM Brahmavivardhanāya namaḥ*
*బ్రహ్మణాం తప ఆదీనా మనేకానాం వివర్ధనాత్ ।*
*బ్రహ్మవివర్ధన ఇతి ప్రభురేవాభి ధీయతే ॥*
*బ్రహ్మ సంజ్ఞ గల తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానములను అనేకమలుగా వృద్ధినొందించువాడుగనుక ఆ విష్ణు ప్రభువునకు బ్రహ్మ వివర్ధనః అను నామము గలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 665🌹*
*🌻665. Brahma vivardhanaḥ🌻*
*OM Brahmavivardhanāya namaḥ*
ब्रह्मणां तप आदीना मनेकानां विवर्धनात् । ब्रह्मविवर्धन इति प्रभुरेवाभि धीयते ॥
*Brahmaṇāṃ tapa ādīnā manekānāṃ vivardhanāt,*
*Brahmavivardhana iti prabhurevābhi dhīyate.*
*As the Lord promotes austerity, the Vedas, sages and wisdom that are indicated by the word Brahma, He is called Brahma vivardhanaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 627 / Sri Siva Maha Purana - 627 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴*
*🌻. తారకాసుర వధ - 4 🌻*
అపుడు దేవతలు, గణములు, మునులు, సిద్ధులు, చారణులు అందరు మిక్కిలి సంతోషముతో నున్న గిరిజను, శంకరపుత్రుని, శంభుని స్తుతించిరి (45). అపుడు ఉపదేవతలు గొప్ప పుష్ప వృష్టిని కురిపించిరి. గంధర్వరాజులు పాడిరి. అప్సరసల గణములు నాట్యమాడిరి (46).
అపుడు వాద్యములు అధికముగా మ్రోగినవి. అనేక పర్యాయములు జయధ్వానములు, నమశ్శబ్దములు బిగ్గరగా బయల్వెడలినవి (47). అపుడు నేను, మరియు విష్ణువు మిక్కిలి సంతసించి పార్వతీ పరమేశ్వరులను ఆదరముతో స్తుతించితిమి (48). బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు, మహర్షలు మరియు ఇతరులు కుమారుని ఎదుట నుంచుకొని ప్రీతితో వారికి నీరాజనము నిచ్చిరి (49). అపుడు గీతములు, వాద్యములు, వేదపఠనము మొదలగు వాటి శబ్దము అధికముగా నుండెను. గొప్ప ఉత్సవము జరిగెను. భగవానుని మహిమలను కీర్తించిరి (50).
మిక్కిలి ప్రసన్నులైన దేవతలు, గణములు అందరు చేతులు జోడించి గీత వాద్యములతో జగన్నాథుడగు శివుని స్తుతించిరి. ఓ మునీ! (51) అపుడా భగవానుడు రుద్రుడు జగన్మాతయగు భవానితో కూడి అందరిచే స్తుతింపబడుచూ తన గణములతో కూడిన వాడైకైలాసమునకు వెళ్లెను (52).
శ్రీ శివమహాపురాణములోని రుద్ర సాంహితయందు కుమార ఖండలో తారకాసురవధ అను పదవ అధ్యాయము ముగిసినది (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 627🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴*
*🌻 Jubilation of the gods at the death of Tāraka - 5 🌻*
45. The delighted gods, Gaṇas and sages, Siddhas and Cāraṇas eulogised Pārvatī, Śiva and the son of Śiva.
46. The secondary gods poured a great shower of flowers. The chiefs of Gandharvas sang. The celestial damsels danced.
47. The musical instruments were played sweetly then. Frequent loud shouts of “Victory” and “Obeisance” were raised.
48. Viṣṇu too in my company was very glad. He respectfully eulogised Śiva, Pārvatī and Kumāra.
49. Keeping Kumāra in front, Brahmā, Indra and other gods performed the rite of Nirājana lovingly. Other sages too did likewise.
50. Then there was great jubilation with vocal and instrumental music and chantings of the Vedas. Hymns too were sung.
51. The lord of the universe was eulogised, O sage, by the delighted gods and Gaṇas by means of vocal and instrumental music.
52. Then eulogised by all, lord Śiva along with Pārvatī the mother of the universe, went to his mountain surrounded by the Gaṇas.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 344 / DAILY WISDOM - 344 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ*
*🌻9. భౌతిక ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది🌻*
*అనుభవంలో రెండు అంశాలు ఉన్నాయి - వాస్తవికం మరియు అవాస్తవం; మరియు ప్రతిదానిని రెండు శిబిరాలుగా విభజించవచ్చు - ఇది నిజంగా ఉన్నది మరియు కనిపించేది. వాస్తవిక లక్షణాలతో లేని దానిని ప్రదర్శన అంటారు. తత్త్వవేత్తలు వాస్తవికతను మూడు కాలాల్లోనూ, గతంలో ఉన్నదీ, వర్తమానంలో ఉన్నదీ, భవిష్యత్తులో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగేదిగా నిర్వచించారు. కానీ, మా కళ్లకు అలాంటిదేమీ కనిపించలేదు. నాశనం చేయలేని, మార్పులేని మరియు శాశ్వతమైన ఈ రకమైన పరీక్షను నిలబెట్టేది ప్రపంచంలో ఏదీ లేదు.*
*అంతేగాక, అటువంటి వాస్తవికత ఉందనకునే మనిషి సహజమైన భావన, మానవ సమస్యకు పరిష్కారం కనుగొనాలనే కోరికతో పాటు, వాస్తవికత కోసం అన్వేషణను ప్రేరేపిస్తుంది. ఇది చాలా సహజంగా మరియు అర్థమయ్యేలా, ప్రపంచ విశ్లేషణతో ప్రారంభమవుతుంది అందుబాటులో ఉన్న మానవ అనుభవం కారణంగా. మనకి సహజంగా భౌతిక ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది మరియు సాధారణంగా ఇది వాస్తవికతగా పరిగణించబడుతుంది. ప్రపంచం అనేది మనిషి ముందు ఉన్న వాస్తవికత - ఐదు మూలకాల యొక్క భౌతిక ప్రపంచం: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. తాత్విక మరియు శాస్త్రీయ మనస్సులు ఈ ఐదు మూలకాల మౌళిక ఉనికిని అనేక భాగాలుగా విశ్లేషిస్తాయి. వీటిని రసాయన సమ్మేళనాలు అని పిలుస్తాము.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 344 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻9. Only the Material World is Seen🌻*
*There are two aspects of experience—the real and the unreal; and everything can be divided into two camps—that which really is, and that which is an appearance. That which does not partake of the characteristics of reality is called appearance. One of the philosophers has defined reality as that which persists in the three periods of time, that which existed in the past, that which exists in the present, and that which shall exist in the future also, without any change. But, with our eyes, we have not seen any such thing. There is nothing in the world which will stand this kind of a test of indestructibility, unchangeability, and permanence.*
*All the same, the inherent instinctive feeling of man that there exists such a reality, along with the urge to find a solution to the human predicament, motivates the search for reality, which, quite naturally and understandably, starts with the analysis of the immediately available human experience, which is the world. There is only the material world seen, and generally this is regarded as the reality. The world is the reality before man—the physical world of the five elements: earth, water, fire, air and ether. The philosophical and scientific minds analyse this fivefold elemental existence into several bits of components, which may be called chemical compounds.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 243 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నిజమైన ధ్యాని నిజమైన సంగీతకారుడు. అతను పాడవచ్చు. పాడకపోవచ్చు. కానీ అతనికి సమస్త అస్తిత్వంలో ఒక సంగీతం దాగి వుందనే రహస్యం తెలుసు. ధ్యానం సంగీతం. అది అంతిమ గానం. నిశ్శబ్ద సంగీతం. 🍀*
*సంగీతం గాఢమయిన ధ్యానం నించీ పుడుతుంది. సంగీతం నీ లోపలి గాఢమయిన ధ్యానాన్ని బయటకు కూడా ప్రసరిస్తుంది. కాబట్టి నిజమైన ధ్యాని నిజమైన సంగీతకారుడు. అతను పాడవచ్చు. పాడకపోవచ్చు. అతను స్వరపరచవచ్చు. లేక పోవచ్చు. కానీ అతనికి ఒక రహస్యం తెలుసు. అతని దగ్గర బంగారు తాళం చెవి వుంది. సమస్త అస్తిత్వంలో ఒక సంగీతం దాగి వుంది. అందుకనే సంగీతాన్ని ఒకానొక గొప్ప దైవిక చర్యగా అర్థం చేసుకోండి.*
*ధ్యానం సంగీతం. అది అంతిమ గానం. శబ్దం లేని సంగీతం. నిశ్శబ్ద సంగీతం. అది మరింత సంపన్నమైనది. అది మరింత గాఢమయింది. మనం సృష్టించే సంగీతం శబ్దాన్ని ఆధారం చేసుకున్నది. శబ్దం అల్లరి చేస్తుంది. మనం శబ్దాన్ని మధురంగా మార్చవచ్చు. అయినా అది ఆటంకమే. నిశ్శబ్ద మంటే నిరాటంకం. ఏదీ కదలదు. కానీ అక్కడ గొప్ప సంగీతముంది. పదాలు లేని సమశృతి అక్కడ వుంది. అది శబ్దాలు లేని స్థితి. ధ్యానం నిశ్శబ్ద స్థితికి చేరుస్తుంది. దాని పేరే దైవం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment