విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 5-10-2022


🌹. విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 🌹. 5-10-2022

ప్రసాద్ భరద్వాజ

🌻. దశపాప హర దశమి - దసరా అంతరార్ధం 🌻

దేవి ప్రసీద, పరిపాలయ, నోరి భీతేః నిత్యం, యదా సుర వధా దధునైవ , సద్యః
పాపాని సర్వ జగతాం ప్రశమం నయాశు - ఉత్పాతపాక జనితారిశ్చ,మహోప సర్గాన్

ఓ దేవి ! రాక్షసులను చంపి నువ్వు మమ్మల్ని ఎలా కాపాడావో, అలాగే మమ్మల్ని ఎప్పుడూ శత్రు భయం నుంచి కాపాడు. అన్ని కాలాల్లోని పాపాలను, ఉత్పాతాల ద్వారా సూచింపబడి, అతి ఘోరంగా మారే ఉత్పాతాల విపత్తులను త్వరగా శమింప జేయి.


🍀. దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా . 🍀


🔱. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ఈ రోజును దశపాప హర దశమి అని కూడా అంటారు. అవి పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకుంటూ అందరికి దసరా - దశపాప హర దశమి శుభాకాంక్షలు. 🔱


🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే

మధుకైటభ విద్రావ విధాత్రి వరదే నమః

రూపం దేహి జయం దేహిం యధోదేహి ద్విషో జహి

మహిషాసుర సంహారీ విధాత్రీ వరదే నమః

రూపం దేహి జయం దేహిం యదోదేహి ద్విషో జహి

ధూమ్రలోచన దర్పఘ్నీ విధాత్రీ వరదే నమః

రక్తబీజ కులచ్చేత్రి చణ్ణముణ్ణ విమర్దినీ

నిశుంభ శంభమదినీ తదా దూమ్రాక్షమర్దినీ

వందితాజ్ఞ్రియుగేదే వైర్దేవీ సౌభాగ్య దాయనీ

అచిన్త్యరూప చరితే సర్వశత్రు వినాశినీ

సతేభ్యస్సర్వదా భక్త్వా చణ్ణకే దురితావహే

స్తువర్భో భక్తి పూర్వంత్వాం చణ్ణకే వ్యాధినాశినీ

చణ్ణకే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకై

దేహిమే దేవి కళ్యాణం దేహిమే విపులాం శ్రియమ్

సురా సురశిరోరత్న నిఘ్నుష్టచర్ణామ్బుజే

ప్రచణ్ణదైత్య దర్పఘ్నీ చణ్ణికే ప్రణతాయ మే

విద్యావవంత యశస్వంతం లక్ష్మీవంతంచమాంకురు


చతుర్భుజ చతుర్వక్త్వంస్తుతే పరమేశ్వరీ

ఇంద్రాణీపతి సధ్బావన పూజితే పరమేశ్వరీ

దేవీ ప్రచండరణ్ణ దైత్యదర్ప వినాశినీ


దేవీ భక్తజనోద్దామా దత్తానన్దోదయాన్వితే

పుత్త్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహిమే


రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి

సత్నీం మనోరమాందేహి మనోవిత్తాను సారిణీమ్


తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్

ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః

స తు సప్తశతీ సజ్జ్యావర మాప్నోతి సంపదః

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment