🌹 02, JULY 2023 SATURDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 02, JULY 2023 SATURDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 02, JULY 2023 SATURDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 392 / Bhagavad-Gita - 392 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 20 / Chapter 10 - Vibhuti Yoga - 20 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 238 / Agni Maha Purana - 238 🌹 
🌻. స్నానతర్పణాది విధి కధనము - 4 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 104 / DAILY WISDOM - 104 🌹 
🌻 13. జ్ఞానం మరియు కార్యాచరణ విద్య యొక్క ఫలాలు / 13. Knowledge and Activity are the Fruits of Education 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 370 🌹*
6) 🌹. శివ సూత్రములు - 106 / Siva Sutras - 106 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 9 / 2-07. Mātrkā chakra sambodhah   - 9 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 02, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 13 🍀*

*25. అజితో విజితో జేతా జంగమస్థావరాత్మకః | జీవానందో నిత్యగామీ విజేతా విజయప్రదః*
*26. పర్జన్యోఽగ్నిః స్థితిః స్థేయః స్థవిరోఽథ నిరంజనః | ప్రద్యోతనో రథారూఢః సర్వలోకప్రకాశకః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కోశశుద్ధి ఆవశ్యకత - నీకు 'అనుభూతు' లనేవి కలుగ నారంభించడానికి ముందు, నీ ప్రాణకోశమూ హృదయకోశమూ విశుద్దమై అందుకు తగిన యోగ్యతను సంపాదించుకోడం అవసరం. కోశవిశుద్ధి లేకుండా పొందిన అనుభూతులు ప్రమాదకరములుగా పరిణమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 20:22:28 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: జ్యేష్ఠ 13:19:23 వరకు
తదుపరి మూల
యోగం: శుక్ల 19:26:52 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 09:46:10 వరకు
వర్జ్యం: 20:33:20 - 22:00:12
దుర్ముహూర్తం: 17:09:20 - 18:01:56
రాహు కాలం: 17:15:55 - 18:54:32
గుళిక కాలం: 15:37:17 - 17:15:55
యమ గండం: 12:20:01 - 13:58:39
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 05:09:52 - 06:38:48
మరియు 29:14:32 - 30:41:24
సూర్యోదయం: 05:45:30
సూర్యాస్తమయం: 18:54:32
చంద్రోదయం: 17:59:55
చంద్రాస్తమయం: 04:09:36
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: కాల యోగం - అవమానం
13:19:23 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 392 / Bhagavad-Gita - 392 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 20 🌴*

*20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత: |*
*అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ||*

🌷. తాత్పర్యం : 
*ఓ అర్జునా! నేను సర్వజీవ హృదయములందు వసించి యున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి యున్నాను.*

🌷. భాష్యము :
*ఈ శ్లోకమున అర్జునుడు గూడాకేశునిగా సంబోధింప బడినాడు. అనగా నిద్ర యనెడి అంధకారమును జయించినవాడని భావము. అజ్ఞానాంధకారమున నిద్రించువారికి ఏ విధముగా భగవానుడు భౌతిక, ఆధ్యాత్మికజగత్తులందు వివిధరీతుల ప్రకటితిమగునో అవగతము చేసికొనుట సాధ్యము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఆ విధముగా సంబోధించుట ప్రాముఖ్యమును సంతరించుకొన్నది. అర్జునుడు అంధకారమును ఆవలయుండుట వలననే శ్రీకృష్ణభగవానుడు అతనికి వివిధభూతులను వివరించుటకు అంగీకరించెను. తాను తన ప్రధానవిస్తారము ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనై యున్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలుపుచున్నాడు.*

*సృష్టికి పూర్వము శ్రీకృష్ణభగవానుడు తన ప్రధానాంశము ద్వారా పురుషావతారములను దాల్చగా అతనిని నుండియే సర్వము ఆరంభమయ్యెను. కనుక అతడే ఆత్మయై (విశ్వపు మూలతత్త్వమైన మహతత్త్వమునకు ఆత్మ) యున్నాడు. అనగా భౌతికశక్తి యనునది సృష్టికి కారణము కాదు. వాస్తవమునకు మహావిష్ణువు మహాతత్త్వమనెడి సంపూర్ణ భౌతికశక్తి యందు ప్రవేశించును. అతడే దానికి ఆత్మయై యున్నాడు. సృష్టింపబడిన విశ్వములలో ప్రవేశించు మహావిష్ణువు తిరిగి పరమాత్మగా ప్రతిజీవి యందును ప్రకటమగును. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండుననియు, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధినొందదనియు మనము అనుభవపుర్వకముగా నెరిగియున్నాము. అదే విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ప్రవేశించినంతనే భౌతికసృష్టియు వృద్ధినొందదు. కనుకనే “సర్వవిశ్వములందు భగవానుడు పరమాత్మ రూపున వసించియున్నాడు” అని సుబలోపనిషత్తు నందు తెలుపబడినది (ప్రకృత్యాదిసర్వభుతాంతర్యామీ సర్వశేషీ చ నారాయణ: ).*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 392 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 20 🌴*

*20. aham ātmā guḍākeśa sarva-bhūtāśaya-sthitaḥ*
*aham ādiś ca madhyaṁ ca bhūtānām anta eva ca*

🌷 Translation : 
*I am the Supersoul, O Arjuna, seated in the hearts of all living entities. I am the beginning, the middle and the end of all beings.*

🌹 Purport :
*In this verse Arjuna is addressed as Guḍākeśa, which means “one who has conquered the darkness of sleep.” For those who are sleeping in the darkness of ignorance, it is not possible to understand how the Supreme Personality of Godhead manifests Himself in various ways in the material and spiritual worlds. Thus this address by Kṛṣṇa to Arjuna is significant. Because Arjuna is above such darkness, the Personality of Godhead agrees to describe His various opulences. Kṛṣṇa first informs Arjuna that He is the soul of the entire cosmic manifestation by dint of His primary expansion. Before the material creation, the Supreme Lord, by His plenary expansion, accepts the puruṣa incarnation, and from Him everything begins.*

*Therefore He is ātmā, the soul of the mahat-tattva, the universal elements. The total material energy is not the cause of the creation; actually the Mahā-viṣṇu enters into the mahat-tattva, the total material energy. He is the soul. When Mahā-viṣṇu enters into the manifested universes, He again manifests Himself as the Supersoul in each and every entity. We have experience that the personal body of the living entity exists due to the presence of the spiritual spark. Without the existence of the spiritual spark, the body cannot develop. Similarly, the material manifestation cannot develop unless the Supreme Soul, Kṛṣṇa, enters. As stated in the Subāla Upaniṣad, prakṛty-ādi-sarva-bhūtāntar-yāmī sarva-śeṣī ca nārāyaṇaḥ: “The Supreme Personality of Godhead is existing as the Supersoul in all manifested universes.”*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 239 / Agni Maha Purana - 239 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*

*🌻. స్నానతర్పణాది విధి కధనము - 4 🌻*

*త్రినేత్రయై శిరస్సుపై అర్ధచంద్రముకుటముతో విరాజిల్లు చున్న ఆమె వృషభపీఠముపై కమలాసనమున కూర్చుండి యుండును. కుడిచేతులలో త్రిశూల - రుద్రాక్షమాలలతోను, ఎడమచేతులలో అభయముద్రా - శక్తులతోను ప్రకాశించుచుండును. ఈ సంధ్యలు కర్మసాక్షులు. సాధకుడు ఈ శక్తుల కాంతులు తనను అనుసరించి యున్నట్లు భావన చేయవలెను. ఇవి కాక మరొక సంధ్య నాల్గవది కూడ ఉన్నది. అది కేవలము జ్ఞానికి మాత్రమే. అర్ధ రాత్రి ప్రారంభమున, దాని బోధాత్మక సాక్షాత్కారము కలుగును. ఈ మూడు సంధ్యలును క్రమముగ, హృదయ - బిందు - బ్రహ్మరంధ్రములలో నుండును. నాల్గవ సంధ్యకు రూపముండదు. ఆ సంధ్య పరమశివునిలో ప్రకాశించుచుండును. ఈమె శివునికంటె అతీత మగుటచే 'పరాసంధ్య' అని పేరు.*

*తర్జనీ మూలము పితృతీర్థము. కనిష్ఠికామూలము ప్రజాపతి తీర్థము అంగుష్ఠ మూలము బ్రహ్మతీర్థము. హస్తాగ్రభాగము దేవతా తీర్థము. కుడి అరచేయి అగ్నితీర్థము. ఎడమ అరచెయ్యి సోమతీర్థము. అంగుళుల అన్ని పర్వములును, సంధులును ఋషితీర్థము. సంధ్యాధ్యానానంతరము, శివమంత్రములచే జలాశయమును శివస్వరూపము చేసి, ''ఆపోహిస్ఠా'' ఇత్యాది సంహితామంత్రములతో, ఆ జలముతో మార్జనము చేసికొనవలెను. ఎడమ చేతిలో తీర్థజలము పోసికొని కుడి చేతితో మంత్రపఠన పూర్వకముగ శిరస్సుపై ఆ నీరు చల్లుకొనుటకు మార్జన మని పేరు.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 239 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 72*
*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 4🌻*

28. The midday twilight should be contemplated as Vaiṣ-ṇavi, white (in complexion), seated with crossed-legs on the Garuḍa, holding conch and disc in the left arm and the mace and abhaya (mudrā) (hand showing protection) in the right hand.

29. Raudrī should be meditated upon as seated on the lotus and as riding the bull, possessing three eyes, decorated by the moon and holding trident and rosary in the right arm and the protective posture (abhaya) and mace in the left arm.

30. The twilight is the witness of deeds of men. The soul (should be known) as following its radiance. The fourth twilight is that of the learned and it is meditated upon in the night.

31. The supreme sandhyā is declared as that which remains. invisible in the cavities situated at the heart, and the upper end of the nose and which secures the realization of Śiva.

32. The root of the fore-finger (is known to be) the pitṛtīrtha and that of the little finger as that of Prajāpati. The root of the thumb (is known to be) that of Brahmā, while the forepart of the hand is held sacred for all gods.

33. It is the place of sacred fire on the palm of the left hand, and the soma on that of the right hand. All the tips and folds on the fingers (are sacred) for the sages.

34. After having got ready the sacred waters for Śiva with the mantras pertaining to Śiva, one should sprinkle that water with the saṃhitā mantras.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 104 / DAILY WISDOM - 104 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. జ్ఞానం మరియు కార్యాచరణ విద్య యొక్క ఫలాలు 🌻*

*మానవ ఉనికి మరియు కార్యాచరణలో సమస్య నిజంగా మానవ చైతన్యానికి సంబంధించిన సమస్య. లేదా, ఇంకా చెప్పాలంటే, సమస్య ఏమిటంటే, ఇది సమస్య అని మనిషి గ్రహించలేకపోవడం. జ్ఞానం మరియు కార్యాచరణ విద్య యొక్క ఫలాలు. కానీ జ్ఞానం లేదా కార్యాచరణలకు బయట ఉన్న వస్తువుతో సంబంధం లేదు. దీని అర్థం ఏమిటంటే బాహ్య విషయాలతో మన సంబంధమే మన జ్ఞానం యొక్క విలువను మరియు మన కార్యకలాపాల విలువను నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం.*

*వస్తువులతో మనకు ఉండే సంబంధమే మన విద్య యొక్క విలువను నిర్ణయిస్తుందని అర్థం. మొత్తం విషయం మరియు వస్తువుల మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటాయి. లక్ష్యంతో సంబంధం లేని జ్ఞానం లేదా కృషి వంటివి ఏవీ లేవు. ఈ లక్ష్యం తప్పిపోయినట్లయితే, ఉద్దేశ్యం అనేది మనస్సు నుండి తప్పుకుంటే, వస్తువు విషయం నుండి వేరు చేయబడితే, చైతన్య సారం చైతన్యం నుండి విడువడితే, ఫలితం ఏంటో అందరికీ తెలుసు. మన విద్యా పద్ధతులకు, ఈ రోజు మొత్తం విద్యా ప్రక్రియకు ఇదే జరిగింది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 104 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. Knowledge and Activity are the Fruits of Education 🌻*

*The problem of human existence and activity is really the problem of the human consciousness. Or, to put it more precisely, the problem is that man is not able to realise that this is the problem. Knowledge and activity are the fruits of education. But neither knowledge nor activity is unconcerned with an object outside. This would mean that our relationship with external things is the deciding factor in judging the worth of our knowledge and the value of our activities.*

*This, again, suggests that the worth and value of our education lies in the meaning attached to our relationship with the objects of our study. The whole question is one of subject-object relation. There is no such thing as either knowledge or effort unrelated to an aim or objective. If this aim is to be missed, if the purpose is to go out of one’s mind, if the object is to be separated from the subject, if the content of consciousness is to be cut off from consciousness, then the result is obvious. And this is exactly what has happened to our educational methods, to the entire process of education today.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 370 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలెన్నో మనకు అందుతున్నాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి. 🍀*

*ప్రతిదీ బహుమానమే. మనం దేనినీ సంపాదించలేదు. నిజానికి మనం దేనికీ అర్హులం కాం. అందమయిన సూర్యాస్తమయం గురించి ఆలోచించావా? మధురమయిన కోకిల గానాన్ని అది పిలిస్తే వచ్చిందనుకున్నావా? నదీ గమనం, చల్లగాలి, సముద్రం, నక్షత్రాలు, కాలం నీ తెలివి తేటల్తో వచ్చాయా? వాటి కోసం మనం ఎలాంటి పన్నులూ కట్టడం లేదు. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలివి. ఐనా అవి మనకు అందాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 106 / Siva Sutras - 106 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 9 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*అతని నిరాధారమైన భయాన్ని ఊనాత అని పిలుస్తారు. ఇది అక్షరం ఊ (ऊ) ద్వారా సూచించ బడుతుంది. ఊనాత అంటే చాలా తక్కువ. ఊనాత అతని ఆరవ ఉద్యమం. ఈ నిరాధారమైన భయాందోళనల ఫలితంగా మరియు అతని స్పృహ మరియు ఆనందాన్ని తిరిగి పొందేందుకు, అతను లోపల ఏకాగ్రత పెట్టడం ప్రారంభిస్తాడు. ఇది మరో నాలుగు కదలికల ద్వారా జరుగుతుంది. మొదటిది, అతను లోపల దృష్టి కేంద్రీకరించే ఉద్దేశ్యాన్ని అభివృద్ధి చేస్తాడు మరియు తదుపరి దశలో ఈ ఉద్దేశం ఉద్దేశ్యాన్ని ధృవీకరించడంగా మారుతుంది. ఈ రెండు దశలను ఋ (ऋ) మరియు ౠ (ॠ) అక్షరాలు సూచిస్తాయి. తరువాతి రెండు దశలు అతని స్పృహను అంతర్గతీకరించడానికి ఉద్దేశించ బడ్డాయి మరియు ఆ తర్వాత కదలిక ఈ ఉద్దేశ్యానికి ధృవీకరణ. మొదటి దశ ఉద్దేశం మరియు రెండవ దశ అమలు. ఈ రెండు దశలను లృ (ऌ + ऋ) మరియు లృూ (ॡ + ॠ) అక్షరాలు సూచిస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 106 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 9 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*His unfounded apprehension is known as ūnatā represented by the next letter ū (ऊ). Ūnatā means too little. Ūnatā is His sixth movement. As a result of this unfounded apprehension and in order to recoup His consciousness and bliss, He begins to concentrate within. This happens through four more movements. First, He develops intention to concentrate within and in the next stage this intention transforms into affirmation of intention. These two stages are represented by letters ṛ (ऋ) and ṝ (ॠ). The next two stages are intention to internalise His consciousness and the movement after that is an affirmation of this intention. The first stage is intention and the second stage is implementation. These two stages are represented by letters ḷṛi (ऌ + ऋ) and ḹṝī (ॡ + ॠ).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment