అష్టావక్ర గీత అధ్యాయము 9

అష్టావక్ర గీత  అధ్యాయము 9

అష్టావక్ర ఉవాచ

9.1
కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా*|
*ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరోఽవ్రతీ*||


చేసినది-చేయన్నది, అట్లే ఇతర జంటలు సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములు
ఎప్పుడైనను, ఎవనికైనను ఆగినవా? ఇది తెలిసి అన్నిటి ఎడ విరక్తుడవై, ‘వదులుకొనుట’ను
అభ్యసించుచు, దేనియందును పట్టుదల లేకుండా ఉండుము.

9.2
*కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్*|
*జీవితేచ్చా బుభుక్షా చ బుభుత్సోపశమం గతాః*||

నాయనా! ఒకానొక చాలా అరుదైన ధన్యునకే లోకము-పోకడ తెలియుటచే - జీవించు
కోరిక, విషయములను అనుభవించు కోరిక, తెలిసికొను కోరిక - ఆరిపోవుచ్చన్నవి.

9.3
*అనిత్యం సర్వమేవేద్ం తాపత్రితయదూషితమ్*|
*అసారం నిందితం హేయమితి నిశ్చత్య శామ్యతి*||


ఈ సర్వము నిలిచిఉండనిది, మూడు రకముల ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక
బాధలతో అసహ్యమైనది, సారము లేనిది, నిందించతగినది, వదలతగినది – ఇట్లు
నిశ్చయించుకొని జ్ఞాని ఆగిపోవుచున్నాడు.

9.4
*కోఽసౌ కాలో వయః కిం వా యత్ర ద్వంద్వాని నో నృణం*|
*తాన్యుపేక్ష్య యథాప్రాప్తవర్తీ సిద్దిమవాప్నుయాత్*||

జనులకు జంటలు సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములు లేకుండాపోయిన
సమయమేది? వయస్సేది? ఉండవు. కనుక వానిని పట్టించుకొనక - తమంతట
వచ్చినవానిని పరిస్థితులకు తగినట్లు చేయువాడు సఫలత పందుచున్నాడు.
9.5
*నానా మతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా*|
*దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః*||


మహర్షులు, అట్లే సాధువుల, యోగుల అభిప్రాయములు పలు రకములుగా ఉన్నవని చూచి
-ఏది చేయవలెనో తెలియక ఏ మానవుడు విసుగుచెంది ఊరకుండడు?

9.6
*కృత్వా మూర్తిపరిజ్ఞానం చైతన్యస్య న కిం గురుః*|
*నిర్వేదసమతాయుక్త్య యస్తారయతి సంసృతేః*||


వైరాగ్యము, సమత్వము, యుక్తి హేతువాదము వీటిచే చైతన్యము ఆత్మ యొక్క
చక్కటి జ్ఞానమును కలిగించి - జీవులను సంసార చక్రమునుండి తప్పించువాడు గురువే
కదా? మహర్షులు. సాధువులు, యోగుల అభిప్రాయములు కావు అని - క్రిందటి శ్లోకముతో
అన్వయము

9.7
*పశ్య భూతవికారాంస్త్వం భూతమాత్రాన్ యథార్థతః*|
*తత్ క్షణాద్బంధనిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి*||


నీవు భూతముల వికారముల మార్పుల నన్నిటిని  అవి వాస్తావముగా భూతములవి
మాత్రమే (ఆత్మవి కావు) - అని చూడుము. వెంటనే బంధములు పోయినవాడవై
స్వరూపమునందు ఉండకలవు.

9.8
*వాసనా ఏవ సంసార ఇతి సర్వా విముంచ తాః*|
*తత్యాగో వాసనాత్యాగాత్ స్థితిరద్య యథా తథా*||


వాసనలే కోరికలు, లోన దాగిఉన్న అభిప్రాయములు సంసారము - అని గుర్తించి
వానిని అన్నిటినీ పూర్తిగా విడువుము. వాసనలను త్యాగముచేసిన - దాని
సంసారముయొక్క త్యాగము చేసినట్లుగును. ఇక, ఉన్నదున్నట్లుగా ఊరక ఉండుటయే.

            9 వ అధ్యాయము సమాప్తం

No comments:

Post a Comment