🌹 *ఈ ప్రపంచంలో మనకు కష్టాలను కలిగించేవి, మనలో ఉన్న గుణాలే.* 🌹
*నీవు కనక సత్వ గుణాన్ని ఎంచుకుంటే భగవంతుని దారిలో ముందుకు వెళ్ళగలవు. అలా కాకుండా రజో గుణాన్ని ఎంచుకుంటే కామ, క్రోధాలు మొదలయినవి ఎల్లకాలం నీలోనే ఉండి నిన్ను ఈప్రపంచంలోనే క్రిందకి లాగి కష్టాలను కలిగిస్తాయి. తమో గుణం కలిగినవాడు ఎల్లపుడూ జూదరిగా లేక త్రాగుబోతుగా బ్రతకవలసినదె.*
*“మన మనస్సుని స్థిరంగా ఉంచుకోలేక పోయినట్లయితే ఈ ప్రపంచంలో నిర్లిప్తతతో జీవించడం సాధ్యం కాని విషయం. మనం మోక్షాన్ని పొందాలంటే మన శరీరం, మన మనస్సు స్వాధీనంలో ఉండరాదు. (అనగా మన మనస్సు మనలని నియంత్రించరాదు) మనం మన మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఇది భగవదనుగ్రహం వల్లనే సాధ్యపడుతుంది. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలంటే మనలోనున్న విషయ వాసనలన్నిటినీ తొలగించేయాలి.*
*మన నిజ స్వబావమేమిటో మనం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. మనకు కావలసినది ‘ఆనందం’.*
*“ఆనందం బ్రహ్మేతి..” అనగా అది దేనిని సూచిస్తుంది? మనం చూసేవన్నీ అనుభవించేవి అన్నీకూడా ఆనదంనుంచే పుట్టి ఆనందంలోనే చేరతాయి. మనలో ప్రతి ఒక్కరం ‘నేనే పరబ్రహ్మను” అనే భావంతో ఉండాలి. మనమందరం ఆ భగవంతునిలోనే ఉన్నాము. “నేను భగవంతునిలో ఉన్నాను” అని మనం భావించుకోవాలి.*
*వాస్తవంగా చెప్పాలంటె నువ్వు ఒక పులిలాంటివాడివి. అటువంటపుడు నీ వాస్తవ పరిస్థితిని గ్రహించుకోకుండా గొఱ్ఱె పిల్లలాగ అరిస్తే లాభమేమిటీ? ఈ విశ్వమంతా మనమే, మనదే అనే భావంతో ఉండాలి.*
*“ఏకం ఏవద్వితీయం బ్రహ్మ” ఇది మీరు వినే ఉంటారు. అనగా బ్రహ్మ ఒక్కడే. అందుచేత ‘నేనే బ్రహ్మ’ అని మీరు ఎందుకనుకోరాదు? ఆ విధంగా మనకు మనమే స్వయం ప్రేరితంగా సూచనలు యిచ్చుకోవడం ద్వారా క్రమక్రమంగా మనకు మనమే ‘పరబ్రహ్మ’ అనే యదార్ధమయిన సత్యం మనకు బోధ పడుతుంది.*
*‘ఓ భగవాన్ నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను’ అనే భావాన్ని అలవరచుకోండి. ఆవిధంగా భావించుకుంటే చాలు. ఇక ఏవిధమయిన వాదోపవాదాలకు తావు లేదు.*
*భగవంతుని చరణాల వద్ద మనం సర్వశ్య శరణాగతి చేయాలి. భక్తి మార్గంలో ఇది ముఖ్యమయిన పునాది.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*
No comments:
Post a Comment