అష్టావక్రగీత అధ్యయము 7
జనక ఉవాచ
7.1
*మయ్యనంతమహాంభోధౌ విశ్వపోత ఇతస్తతః*|
*భ్రమతి స్వాంతవాతేన న మమాస్త్యసహిష్ణుతా*||
‘నేను’ అను అనంత-మహా-సముద్రమునందు, విశ్వము అను పడవ - అంతఃకరణము
అను గాలి చేత - ఇట్ల-అట్ల ఊగుచున్నది. అందుచేత నాకేమియు అసహనము
లేదు.
7.2
*మయ్యనంతమహాంభోధౌ జగద్వీచిః స్వభావతః*|
*ఉదేతు వాస్తమాయాతు న మే వృద్దిర్న చ క్షతిః*||
‘నేను’ అను అంతులేని-మహా-సముద్రమునందు, జగత్తు అను అల స్వభావముగా
లేచుకాక! పడిపోవుకాక! నాకు పెరుగుట లేదు, తరుగుట లేదు.
7.3
*మయ్యనంతమహాంభోధౌ విశ్వం నామ వికల్పనా*|
*అతిశాంతో నిరాకార ఏతదేవాహమాస్దితః*||
‘నేను’ అను అంతులేని-మహా-సముద్రమునందు - విశ్వము అనునది ఒక ఊహాయే.
అతిశాంతము, నిరాకారము అయిన నేను - అట్టి భావమునందు స్దిరముగా ఉన్నాను.
7.4
*నాత్మా భావేషు నో భావః తత్రానంతే నిరంజనే*|
*ఇత్యసక్తోఽస్పుహః శాంతః ఏతదేవాహమాస్థితః*||
ఆత్మ భావముల యందు లేదు.
అనంతమైన, నిర్మలమైన ఆ స్వరూపమునందు వస్తువులు లేవు – అని తెలిసి నేను ఆసక్తి
కోరికలు వదలి, శాంతుడనై అట్టె స్థిరముగా ఉన్నాను.
7.5
*అహో చిన్మత్రమేవాహం ఇంద్రజాలోపమం జగత్*|
*అతో మమ కథం కుత్ర హేయోపాదేయకల్పనా*||
ఆహా! నేను చైతన్యము మాత్రమేను. జగత్తు గారడీ వంటిది. ఇక, నాకు విడువలసినది-
పూనతగినది అను భావము ఎట్లు, ఎక్కడ కలుగును?
7వ అధ్యాయము సమాప్తం
No comments:
Post a Comment