అష్టావక్రగీత - అధ్యాయము 8

అష్టావక్రగీత - అధ్యాయము 8

అష్టావక్ర ఉవాచ

8.1
*తదా బంధో యదా చిత్తం కించిత్ వాంఛతి శోచతి*|
*కించిన్ముంచతి గృహ్ణతి కించిత్ హృష్యతి కుప్యతి*||

చిత్తము ఎప్పడు కొంచెమైనను కోరునో, దుఃఖించునో, కొంచెమైనను విడుచునో, పట్టుకొనునో, కొంచెమైనను సంతోషించునో, కోపించునో – అప్పుడు బంధము.

8.2
*తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి*|
*న ముంచతి న గృహ్ణతి న హృష్యతి న కుప్యతి*||

చిత్తము ఎప్పుడు కొంచెమైనను కోరదో, దుఃఖించదో, కొంచెమైనను విడువదో,
పట్టుకొనదో, కొంచెమైనను సంతోషించదో, కోపించదో – అప్పుడు మోక్షము.

8.3
*తదా బంధో యదా చిత్తం సక్తం కాస్వపి దృష్టిషు*|
*తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు*||

చిత్తము ఎప్పుడు దృశ్యవిషయములందు తగులుకొనునో - అప్పుడు బంధము. చిత్తము
ఎప్పుడు సమస్త దృశ్యవిషయములను పట్టించుకొనక ఉండునో - అప్పుడు మోక్షము.

8.4
*యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా*|
మత్వేతి హేలయా కించిత్ మా గృహాణ విముంచ మా*||

అహంకారము లేనిచో - అప్పుడు మోక్షము. అహంకారము ఉన్నచో – అప్పుడు
బంధము. ఇది నిశ్చయించి – విలాసముగా - దేనిని పట్టుకొనక, వదలక ఉండుము.

                8వ అద్యయము సమాప్తం

No comments:

Post a Comment