శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 272 / Sri Lalitha Chaitanya Vijnanam - 272
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 272 / Sri Lalitha Chaitanya Vijnanam - 272 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀
🌻 272. “సదాశివా' 🌻
విస్తారమగు సృష్టియం దంతట అన్నిట సత్త్వ ప్రధానముగ నిండియుండునది శ్రీమాత అని అర్థము. సృష్టి కతీతముగ శు సత్త్వరూపమున ఈశ్వరిగ నున్న శ్రీమాత సృష్టియందు అంతట అన్నిట సత్త్వగుణముతో భాసించును. సృష్టి కతీతముగ నున్న తత్త్వము ఈశ్వరి కాగా సృష్టియందిమిడియున్న శ్రీమాత సదాశివా అయి వున్నది.
శివపరముగ తెలిపినపుడు ఈశ్వరుడు సదాశివుడుగ జీవుల యందున్నాడందురు. విష్ణుపరముగ తెలిపినపుడు శ్రీ మహావిష్ణువు వాసుదేవ రూపమున జీవుల యందున్నా డందురు. వాసుదేవ, సదాశివ, సదాశివా అను పదములు పర్యాయ పదములు. భగవంతు డెచ్చటోనున్నాడని భావింప పనిలేదు. మనయందు, మన పరిసరముల యందు సత్త్వగుణముగ ప్రకాశించు చున్నాడు. మనయందు సత్త్వగుణమును పెంపొందించు కొనుట వలన భగవత్ సాన్నిధ్యము పెరుగును. మనయందలి సదాశివా లేక వాసుదేవ తత్త్వములను దర్శించుటకు సత్త్వగుణము నుపాసింపవలెను.
సత్త్వగుణమును ఇరువది యారు సద్గుణములుగ దైవాసుర సంపత్తి యోగము అను అధ్యాయమున భగవద్గీతలో తెలుపబడినది. వీనిని క్రమముగ నుపాసించుట యొక పద్ధతి. సత్త్వగుణ ప్రధానులగు సజ్జనులను ఆశ్రయించి వారి సాంగత్యముతో జీవించుట మరియొక పద్ధతి. దీని కొఱకే సద్గురు సమాశ్రయనము. వాసుదేవ సాన్నిధ్యము నకు ఇది యొక్కటియే మార్గమని భగవద్గీత, భాగవత పురాణము బోధించుచున్నవి.
సద్గుణముల ఉపాసన ద్వారా రజస్తమస్సులను సమన్వయించు కొని సత్త్వగుణమును చేరినవాడు తనయందలి దైవమునకు సమీపమగును. అటుపైన తనయందలి దైవమును చూచుట యుండును. ఆపైన ఆ దైవమును చేరుట యుండును. అందు క్రమముగ ఐక్యము చెందుట యుండును. ఇట్లు జీవుల ననుగ్రహించుటకే జీవుల యందు దైవము సదాశివాగా వెలసియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 272 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀
🌻 Sadāśivā सदाशिवा (272)🌻
Look at the beauty of placement of nāma-s. As deliberated earlier, the Brahman has got five duties to perform. The first four have been discussed in the previous nāma-s. In these nāma-s, first the action was referred followed by the form of the Brahman who looks after that particular action. For example take nāma-s 264 and 265. Nāma 264 is sṛṣṭi-kartrī, the act of creation and 265 is brahma-rūpā the form of god who performs the act of creation. It is the case with other three. While talking about the gracious re-creative aspect of the Brahman, the form of God is referred first, then the action. Possibly Vāc-Devi-s could have thought that merely uttering this nāma alone would give salvation.
She is in the form of Sadāśivā. Sadā means ever and Śiva means auspicious. The Sadāśivā form of the Brahman is the most auspicious form and She is said to be in that form. In the stage of Sadāśivā tattva, icca śakti or the will (to create) is predominant. The concept of “I am this” begins to dawn (this stage is not “I am That”), where perfect purity is not yet attained. In this stage universal consciousness is discovered. The individual consciousness has not yet merged with the universal consciousness. Śaktī is the intent of the Brahman to recreate. The power of will of the Brahman at this stage is to bless the universe for recreation and this act is being described in the next nāma.
The power of will of the Brahman has three distinct categories, śuddhavidyā, Īśvara and Sadāśiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
31 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment