2) 🌹. శివ మహా పురాణము - 406🌹
3) 🌹 Light On The Path - 153🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -34 🌹
5) 🌹 Osho Daily Meditations - 23🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Lalitha Sahasra Namavali - 83🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 83 / Sri Vishnu Sahasranama - 83🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -206 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 46, 47, Part 2
*🍀 45-2. యోగీభవ - యోగియందు తపస్సు, జ్ఞానము, యజ్ఞము, దానము అన్నియు ఇమిడి యుండును. కాలమును దేశమును బట్టి వానిని నిర్వర్తించుటేగాని, నిర్వర్తింపబడు విషయములయందు తగులు కొనడు. ఉత్తమోత్తమ కర్మలు చేయువారు కూడ ఆ కర్మల సాఫల్యమును బట్టి కీర్తిప్రతిష్ఠలు పొందుచు వాని పై మోహము కలిగి యుందురు. సద్గుణములు కలిగి, దానధర్మాది యజ్ఞములు చేయుచు ప్రపంచపు గుర్తింపునందు సంతృప్తి చెందుచు గుహ్య మగు జీవనము లేక బాహ్యమందలి మేళములకు అలవడి జీవింతురు. అట్టి వారికిని సమభావముండదు. 🍀*
శ్రీరాముడు అడవి మనుషులతోను, కోతులతోను, అసురులతోను, ఋషులలోను ఒకే విధమగు మైత్రీభావముతో మెలగెను. అట్టివారు యోగులు. ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబ అట్టి సమదర్శనమును నెరపి యోగ మన నేమో తెలిపిరి. కుమ్మరియందు, కమ్మరియందు, మాంసము అమ్ముకొని జీవించు వారి యందు, గృహిణుల యందు యోగులు గోచరింతురు. ఇట్టి యోగులు పై తెలిపిన జ్ఞానుల కన్న ఎక్కువగ హితము చేకూర్చ గలరు. అందువలన యోగు లధికులు.
ఉత్తమోత్తమ కర్మలు చేయువారు కూడ ఆ కర్మల సాఫల్యమును బట్టి కీర్తిప్రతిష్ఠలు పొందుచు వాని పై మోహము కలిగి యుందురు. సద్గుణములు కలిగి, దానధర్మాది యజ్ఞములు చేయుచు ప్రపంచపు గుర్తింపునందు సంతృప్తి చెందుచు గుహ్య మగు జీవనము లేక బాహ్యమందలి మేళములకు అలవడి జీవింతురు. అట్టి వారికిని సమభావముండదు. యోగియందు తపస్సు, జ్ఞానము, యజ్ఞము, దానము అన్నియు ఇమిడి యుండును. కాలమును దేశమును బట్టి వానిని నిర్వర్తించుటేగాని, నిర్వర్తింపబడు విషయములయందు తగులు కొనడు.
జ్ఞాన మతనియందు భాసించుటయే గాని, జ్ఞానమున కూడ తగులుకొనక తానుగ నుండును. జ్ఞాన ప్రదర్శన నెపుడును చేయడు. అట్లే తపస్సు వలన కలిగిన శక్తుల నాశ్రయింపక వర్తించునే గాని వానిని తనకై తానుగ వినియోగింపడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 406🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 22
*🌻. పార్వతీ తపోవర్ణనము - 2 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! ఆ సఖురాండ్రిద్దరు ఇట్లు పలికి మిన్నకుండిరి. కాని భేదమును పొందిన మనస్సుగల ఆ మేన వారి మాటను అంగీకరించలేదు (15). అపుడా పార్వతి వినయముతో నిండిన మనస్సు గలదై శివుని పాద పద్మములను స్మరించి, తల్లికి చేతులు జోడించి నమస్కరించి స్వయముగా నిట్లు చెప్పెను (16).
పార్వతి ఇట్లు పలికెను-
తల్లీ! నేను మహేశ్వరుని పొందగోరి తపస్సును చేయుటకై ఉదయమే వెళ్లబోవుచున్నాను. తపస్సు కొరకై తపోవనమునకు వెళ్లుటకు నాకిప్పుడు అనుమతినిమ్ము (17).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మేన కుమారై యొక్క ఈ మాటలను విని దుఃఖితురాలయ్యెను. ఆమె మనస్సు వికలమయ్యెను. ఆమె కుమారైను దగ్గరకు పిలిచి ఇట్లు పలికెను (18).
మేన ఇట్లు పలికెను-
హే శివే! పుత్రీ! పూర్వము తపస్సును చేసి దుఃఖమును పొందితివి. ఇపుడు ఇంటిలో నుండి తపస్సును చేయుము. పార్వతీ! బయటకు వెళ్లకుము (19).
నీవు తపస్సు చేయుట కొరకై ఎచటికి వెళ్లెదవు? నా ఇంటిలో దేవతలు గలరు. పుత్రీ! మొండితనమును వీడుము. బయటకు ఎచ్చటి కైననూ వెళ్లబనిలేదు. పూర్వము నీవు సాధించిన దేమి? భవిష్యత్తులో సాధించబోవునదేమి? ఇచటనే సర్వతీర్థములు, వివిధ క్షేత్రములు గలవు (20,21).
అమ్మాయీ! నీ శరీరము సుకుమారమైనది. తపస్సులో చాల క్లేశము గలదు. కావున నీవు ఇచటనే యుండి తపస్సును చేయుము. బయటకు వెళ్ళవద్దు (22). కోర్కెలను సిద్ధింపజేయుటకై స్త్రీలు తపోవనమునకు వెళ్లిరను మాటను ఇంతకుముందు విని యుండలేదు. ఓ పుత్రీ! కావున నీవు తపస్సు కొరకై వెళ్లు తలంపును చేయకుము (23).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ విధముగా ఆ తల్లి తన కుమారైను అనేక తెరంగుల వారించెను. ఆమె మహేశ్వరుని ఆరాధించని ఆ స్థితిలో లేశ##మైననూ సుఖమును పొందలేకపోయెను (24). మేన ఆమెను తపస్సు కొరకై వనమునకు వెళ్లవద్దని నిషేదించుటచే (ఉమా=అమ్మాయీ! వద్దు) పార్వతికి ఉమా అని పేరు స్థిరమయ్యేను (25).
ఓ మహర్షీ! హిమవంతుని భార్యయగు ఉమ తన కుమారైయగు శివాదేవి దుఃఖించి యుండుటను గాంచెను. అపుడామె పార్వతికి తపస్సును చేయుటకై అనుమతినిచ్చెను (26). ఓ మహర్షీ! గొప్ప నిష్ఠగల పార్వతి తల్లి అనుమతిని పొంది శంకరుని స్మరించి తన అంతరంగములో సుఖమును పొందెను (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 153 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 4 🌻*
565. Sometimes there are special links between egos which many lives later culminate in the close relationship of Master and pupil. There is the well-known case of our late Vice-President, Mr. Sinnett. Long ago he was a powerful nobleman in Egypt. His father had built and endowed a great temple; therefore he had a vast amount of influence, and was practically the controlling power of that temple. One of those who are now our Masters was a prisoner of war in Egypt at the time, and Mr. Sinnett and I were soliders in the army which captured Him.
He was a person of distinction in His own country, and consequently He was assigned to our care, because captives of high rank were very well treated in Egypt, and were entertained by people of rank corresponding with their own, so long as they did not try to escape. So He lived in the house of Mr. Sinnett for two years, and in the course of that time became keenly interested in the occult work of the Temple, and wished to take part in it.
Mr. Sinnett was able to give Him the desired introduction to occult study. He made the most astonishing progress in it, and in every life thereafter He continued the studies begun in ancient Khem. In a later life He became an Adept, while His benefactor of Egypt had by no means reached that level.
When in this incarnation He found that He wanted to spread Theosophical truths in the world, because the time was come when the world was ripe to receive them, He looked round for someone to do it, and saw His old friend and benefactor as the editor of a great daily newspaper, and well qualified to do this very piece of work. He discharged this old debt by giving him that opportunity.
We know how well and nobly he took it. That shows that one may have made a link far away in the past with one who has since become an Adept, and that His discharge of the debt naturally takes the form of giving help and information, and of drawing the man close to Him.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 34 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. భక్తిసాధనా రహస్యములు 🌻*
భక్తునకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే.
భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తులు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు గావలెను. వానికి రస స్పర్శకలుగును.
శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను.
ఎంతమంచిదయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను.
ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును.
భక్తి సాధనలో ప్రేమయే ప్రధానము. జ్ఞానమన్న స్వామికరుణయే.
భగవన్నామమును, గుణములను కీర్తించుచు పుణ్యక్షేత్ర దర్శనము గావించుట సాధనకు ఉపకరించును.
గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డుగా నిలుచును.
శివుడన, విష్ణువన, శక్తియన ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో దర్శింపనగును.
~~మనలోని స్వభావమే సర్వాంతర్యామికి సమర్పితమైనపుడు దివ్యమగును......
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 23 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 ESSENTIALS 🍀*
*🕉 Meditation means to be oneself, and love means to share one's being with somebody else. Meditation gives you the treasure, and love helps you to share it. These are the two most basic things, and all else is nonessential. 🕉*
There is an old anecdote about three travelers who go to Rome. They visit the minister, who asks of the first, "How long are you going to be here?" The man says, "For three months." The minister says, "Then you will be able to see much of Rome.
" In answer to how long he was going to stay, the second traveler replies that he can only stay for six weeks. The Minister says, "Then you will be able to see more than the first."The third traveler says he will only be in Rome for two weeks, to which the pope replies, "You are fortunate, because you will be able to see everything there is to see!"
The travelers were puzzled, because they didn't understand the mechanism of the mind. Just think, if you had a lifespan of a thousand years, you would miss many things, because you would go on postponing things. But because life is so short, one cannot afford to postpone. Yet people do postpone-and at their own cost.
Imagine if somebody were to tell you that you have only one day left to live. What will you do? Will you go on thinking about unnecessary things? No, you will forget all that. You will love and pray and meditate, because only twenty-four hours are left. The real things, the essential things, you will not postpone.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
🍀 379. ఓడ్యాణపీఠనిలయా -
ఓడ్యాణ పీఠమునందు ఉంది.
🍀 380. బిందుమండలవాసినీ -
బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
🍀 381. రహోయాగక్రమారాధ్యా -
ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
🍀 382. రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 83. oḍyāṇapīṭha-nilayā bindu-maṇḍalavāsinī |*
*rahoyāga-kramārādhyā rahastarpaṇa-tarpitā || 83 || 🌻*
🌻 379 ) Odyana peeda nilaya -
She who is on Odyana peetha or She who lives in orders
🌻 380 ) Bindu mandala vaasini -
She who lives in the dot in the center of Srichakra
🌻 381 ) Raho yoga kramaradhya -
She who can be worshipped by secret sacrificial rites
🌻 382 ) Rahas tarpana tarpitha -
She who is pleased of chants knowing its meaning
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 83 / Sri Vishnu Sahasra Namavali - 83 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం*
*🍀 83. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|*
*దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా|| 🍀*
🍀 773) సమావర్త: -
సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
🍀 774) అనివృత్తాత్మా -
అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
🍀 775) దుర్జయ: -
జయింప శక్యము గానివాడు.
🍀 776) దురతిక్రమ: -
అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
🍀 777) దుర్లభ: -
తేలికగా లభించనివాడు.
🍀 778) దుర్గమ: -
మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
🍀 779) దుర్గ: -
సులభముగా లభించనివాడు.
🍀 780) దురావాస: -
యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
🍀 781) దురారిహా: -
దుర్మార్గులను వధించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 83 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Utarashada 3rd Padam*
*🌻 samāvartō nivṛttātmā durjayō duratikramaḥ |*
*durlabhō durgamō durgō durāvāsō durārihā || 83 || 🌻*
🌻 773. Samāvartaḥ:
One who effectively whirls the wheel of Samsara.
🌻 774. Anivrutātmā:
One who is not Nivruta (separated from) anything or anywhere, because He is all-pervading.
🌻 775. Durjayaḥ:
One who cannot be conquered.
🌻 776. Duratikramaḥ:
One out of fear of whom, even heavenly objects like sun do not dare to oppose His command.
🌻 777. Durlabhaḥ:
One who can be attained by Bhakti, which is difficult for a person to be endowed with.
🌻 778. Durgamaḥ:
One whom it is difficult to attain.
🌻 779. Durgaḥ:
One the attainment of whom is rendered difficult by various obstructions.
🌻 780. Durāvāsaḥ:
He whom the Yogis with very great difficulty bring to reside in their hearts in Samadhi.
🌻 781. Durārihā:
One who destroys beings like Asuras.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment