✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 46, 47, Part 2
🍀 45-2. యోగీభవ - యోగియందు తపస్సు, జ్ఞానము, యజ్ఞము, దానము అన్నియు ఇమిడి యుండును. కాలమును దేశమును బట్టి వానిని నిర్వర్తించుటేగాని, నిర్వర్తింపబడు విషయములయందు తగులు కొనడు. ఉత్తమోత్తమ కర్మలు చేయువారు కూడ ఆ కర్మల సాఫల్యమును బట్టి కీర్తిప్రతిష్ఠలు పొందుచు వాని పై మోహము కలిగి యుందురు. సద్గుణములు కలిగి, దానధర్మాది యజ్ఞములు చేయుచు ప్రపంచపు గుర్తింపునందు సంతృప్తి చెందుచు గుహ్య మగు జీవనము లేక బాహ్యమందలి మేళములకు అలవడి జీవింతురు. అట్టి వారికిని సమభావముండదు. 🍀
శ్రీరాముడు అడవి మనుషులతోను, కోతులతోను, అసురులతోను, ఋషులలోను ఒకే విధమగు మైత్రీభావముతో మెలగెను. అట్టివారు యోగులు. ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబ అట్టి సమదర్శనమును నెరపి యోగ మన నేమో తెలిపిరి. కుమ్మరియందు, కమ్మరియందు, మాంసము అమ్ముకొని జీవించు వారి యందు, గృహిణుల యందు యోగులు గోచరింతురు. ఇట్టి యోగులు పై తెలిపిన జ్ఞానుల కన్న ఎక్కువగ హితము చేకూర్చ గలరు. అందువలన యోగు లధికులు.
ఉత్తమోత్తమ కర్మలు చేయువారు కూడ ఆ కర్మల సాఫల్యమును బట్టి కీర్తిప్రతిష్ఠలు పొందుచు వాని పై మోహము కలిగి యుందురు. సద్గుణములు కలిగి, దానధర్మాది యజ్ఞములు చేయుచు ప్రపంచపు గుర్తింపునందు సంతృప్తి చెందుచు గుహ్య మగు జీవనము లేక బాహ్యమందలి మేళములకు అలవడి జీవింతురు. అట్టి వారికిని సమభావముండదు. యోగియందు తపస్సు, జ్ఞానము, యజ్ఞము, దానము అన్నియు ఇమిడి యుండును. కాలమును దేశమును బట్టి వానిని నిర్వర్తించుటేగాని, నిర్వర్తింపబడు విషయములయందు తగులు కొనడు.
జ్ఞాన మతనియందు భాసించుటయే గాని, జ్ఞానమున కూడ తగులుకొనక తానుగ నుండును. జ్ఞాన ప్రదర్శన నెపుడును చేయడు. అట్లే తపస్సు వలన కలిగిన శక్తుల నాశ్రయింపక వర్తించునే గాని వానిని తనకై తానుగ వినియోగింపడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Jun 2021
No comments:
Post a Comment