నిర్మల ధ్యానాలు - ఓషో - 24
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 24 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మెలకువగా వుండు. స్పృహలో లేకుంటే మన దైవత్వాన్ని మనం గ్రహించలేం. 🍀
అన్ని కాలాల్లోని అందరు గురువులూ ప్రతి మనిషీ దైవత్వంతోనే జన్మించాడని అన్నారు.
కానీ ఆ సంగతి పట్ల స్పృహతో వుండరని కూడా అన్నారు. మన లోపలి ప్రపంచం గురించి మనం స్పృహలో లేకుంటే మన దైవత్వాన్ని మనం గ్రహించలేం. ఆ లోపలి సామ్రాజ్యానికి దూరంగానే వుండి పోతాం. అది మన సామ్రాజ్యం. ఎప్పటికీ మనదే.
మనం అల్ప విషయాల పట్ల ఆకాంక్షతో వూంటాం. అల్పవిషయాల్ని బిచ్చమడుగుతాం. మనం బిచ్చగాళ్ళమని మనం కలగంటాం. ఒక సారి వ్యక్తి మేలుకుంటే ఆశ్చర్యనికి లోనవుతాడు. తను బిచ్చగాడు కాదని, తను చక్రవర్తి అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ధ్యాన విధాన క్రమమంటే అదే.
నీ సామ్రాజ్య స్పృహ నీకు కలిగించడమే. నీ అనంత శక్తికి చైతన్యం కలిగించడమే. ఒకసారి నువ్వు మేలుకుంటే నీ ప్రయాణమంత కష్టం కాదు. కొద్దిగా మెలుకువ వస్తే నిద్ర ఎగిరి పోతుంది. అప్పుడు విషయాలన్నీ తేలిక పడతాయి, సులభంగా అందుతాయి. ఐతే నువ్వు మేలుకోని పక్షంలో అది ఎప్పపటికీ నిజం కాలేదు. అది గ్రహించడంగా మారదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
31 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment