2) 🌹 శ్రీమద్భగవద్గీత - 620 / Bhagavad-Gita - 620 - 18-31🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 426 427 / Vishnu Sahasranama Contemplation - 426, 427🌹
4) 🌹 Daily Wisdom - 128🌹
5) 🌹. వివేక చూడామణి - 90🌹
6) 🌹Viveka Chudamani - 90🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 90🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 33🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 281 / Sri Lalita Chaitanya Vijnanam - 281 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 52 / Bhagavad-Gita - 52 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 5 🌴*
5. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||
🌷. తాత్పర్యం :
గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును.
🌷. భాష్యము :
గురువు హేయమైన కార్యమును చేయుచు తన విచక్షణ కోల్పోయినపుడు త్యజింపదగినవాడని శాస్త్రనియమములు తెలుపుచున్నవి. దుర్యోధనుడు ఒసగిన ఆర్ధిక సహాయము కారణముగా భీష్ముడు లిరువురును అతని పక్షమును వహించియుండిరి.
కాని కేవలము ఆర్ధిక కారణముచే ఆతి స్థానమును స్వీకరించుట వారికి తగినట్లుగా లేదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికిని వారు పెద్దలుగనే నిలిచియుందురని అర్జునుడు భావించుచున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతికలాభముల ననుభవించుట యనగా రక్తపంకిలమైన వాటిని అనుభవించుట యనేయే భావము.
🌹🌹🌹🌹🌹
*🌹 Bhagavad-Gita as It is - 52 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
*🌴 Chapter 2 - Sankhya Yoga - 5 🌴*
5. gurūn ahatvā hi mahānubhāvān
śreyo bhoktuṁ bhaikṣyam apīha loke
hatvārtha-kāmāṁs tu gurūn ihaiva
bhuñjīya bhogān rudhira-pradigdhān
Translation :
It would be better to live in this world by begging than to live at the cost of the lives of great souls who are my teachers. Even though desiring worldly gain, they are superiors. If they are killed, everything we enjoy will be tainted with blood.
Purport :
According to scriptural codes, a teacher who engages in an abominable action and has lost his sense of discrimination is fit to be abandoned.
Bhīṣma and Droṇa were obliged to take the side of Duryodhana because of his financial assistance, although they should not have accepted such a position simply on financial considerations. Under the circumstances, they have lost the respectability of teachers. But Arjuna thinks that nevertheless they remain his superiors, and therefore to enjoy material profits after killing them would mean to enjoy spoils tainted with blood.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 620 / Bhagavad-Gita - 620 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 31 🌴*
31. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
ఆయథావత్ప్రజానాతి బుద్ధి: సా పార్థ రాజసీ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ధర్మము మరియు అధర్మము నడుమగల భేదమునుగాని, చేయవలసిన కార్యము మరియు చేయదగని కార్యము నడుమగల భేదమును గాని తెలియలేనటువంటి బుద్ధి రాజసికబుద్ధి యనబడును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 620 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 31 🌴*
31. yayā dharmam adharmaṁ ca
kāryaṁ cākāryam eva ca
ayathāvat prajānāti
buddhiḥ sā pārtha rājasī
🌷 Translation :
O son of Pṛthā, that understanding which cannot distinguish between religion and irreligion, between action that should be done and action that should not be done, is in the mode of passion.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 426 / Vishnu Sahasranama Contemplation - 426🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻426. విస్తారః, विस्तारः, Vistāraḥ🌻*
*ఓం విస్తారాయ నమః | ॐ विस्ताराय नमः | OM Vistārāya namaḥ*
విస్తీర్యంతే సమస్తాని జగంత్యస్మి జనార్దనే ।
ఇతి విస్తారశబ్దేన బోద్యతేఽయం హరిర్బుధైః ॥
ఈతనియందు సమస్త జగత్తులును విస్తారమందును. జగత్తులు ఈతనియందే బీజరూపమున అవ్యక్తముగానుండును. ఈతనియందే వ్యక్తతనంది స్థూల రూపమును ధరించును. అదియే విస్తారమందుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 426🌹*
📚. Prasad Bharadwaj
*🌻426. Vistāraḥ🌻*
*OM Vistārāya namaḥ*
Vistīryaṃte samastāni jagaṃtyasmi janārdane,
Iti vistāraśabdena bodyate’yaṃ harirbudhaiḥ.
विस्तीर्यंते समस्तानि जगंत्यस्मि जनार्दने ।
इति विस्तारशब्देन बोद्यतेऽयं हरिर्बुधैः ॥
He in whom all worlds are expanded. The worlds are contained in Him in the concealed form of seed. From Him, the worlds emanate and manifest. This is Vistāraḥ or expansion.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥
విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥
Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 427 / Vishnu Sahasranama Contemplation - 427🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻427. స్థావర స్థాణుః, स्थावर स्थाणुः, Sthāvara sthāṇuḥ🌻*
*ఓం స్థావర స్థణవే నమః | ॐ स्थावर स्थणवे नमः | OM Sthāvara sthaṇave namaḥ*
స్థావరస్థితిశిలత్వాత్ స్థితిశీలాని తాని హి ।
పృథివ్యాదీని తిష్ఠంతి భూతాన్యస్మిన్ జనార్దనే ।
ఇతి స్థాణుశ్చ భగవాన్ స్థావరస్థాణురుచ్యతే ॥
స్థిరముగా నిలిచి ఉండు శీలము లేదా స్వభావము అలవాటుగా కలవాడు కావున స్థావరః. చెడక నిలిచియుండుటయే తమ స్వభావముగాను, అలవాటుగాను కల పృథివి మొదలగునవి ఈతనియందు నిలిచియుండును. ఈతడు పై జెప్పిన నిర్వచనములననుసరించి స్థావరుడు, స్థాణుడును కావున 'స్థావరస్థాణుః' అనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 427🌹*
📚. Prasad Bharadwaj
*🌻427. Sthāvara sthāṇuḥ🌻*
*OM Sthāvara sthaṇave namaḥ*
Sthāvarasthitiśilatvāt sthitiśīlāni tāni hi,
Pr̥thivyādīni tiṣṭhaṃti bhūtānyasmin janārdane,
Iti sthāṇuśca bhagavān sthāvarasthāṇurucyate.
स्थावरस्थितिशिलत्वात् स्थितिशीलानि तानि हि ।
पृथिव्यादीनि तिष्ठंति भूतान्यस्मिन् जनार्दने ।
इति स्थाणुश्च भगवान् स्थावरस्थाणुरुच्यते ॥
One who is firmly established is Sthāvaraḥ. Firm and long lasting entities like the earth etc., are established in Him. So, Sthāṇuḥ (motionless). He is Sthāvara and sthāṇuḥ, firm and motionless. So He is Sthāvarasthāṇuḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् ।अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥
విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥
Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam ।Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 127 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. The World is Based on the Absolute 🌻*
Philosophy soars above empiricality, though it takes the help of empirical concepts and categories for the sake of proclaiming to the world the truths declared by intuition. It speaks to the world in the language of the world, for the language of intuition is unintelligible to the world of experience.
The form and shape of philosophy has necessarily to depend on the stuff out of which the world of experience is made, on account of its having to perform the function of transmitting the knowledge of the super-mundane ideal to the realm of mundane values. It has always within itself a living undercurrent of significance and implication which gives a vivid picture of the nature of the ultimate end to the understanding mind. Philosophy stands on the shoulders of the senses, but looks beyond them. Intuition is the soul of philosophy, and reason is its body.
By intuition, again, we do not mean the sensory intuition of certain Western philosophers, but the integral intuition of Consciousness, which is non-different from the Absolute. The world is based on the Absolute; it is a manifestation of the Absolute. It is the Absolute flowing and moving that appears to the senses as the world.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 90 / Viveka Chudamani - 90🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 21. అహంభావము - 6 🍀*
308. అహంకారము యొక్క పనులను అడ్డుకొని, అన్ని బంధనాలను తెంచుకొనుట ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ద్వంద్వాతీత స్థితిని చేరుకొని, ఆత్మానందమును పొంది, బ్రహ్మములో శాశ్వతముగా ఐక్యము కమ్ము. నీవు ఆ స్థితిని పొందియున్నావు.
309. భయంకరమైన అహంభావమును పూర్తిగా మూలముతో సహా నిర్మూలించినప్పటికి, మనస్సులో ఒక క్షణమైన జీవన సృతులు జ్ఞాపకమునకు వచ్చిన, వందలకొలది కష్టాలను కొనితెస్తుంది. ఎలానంటే వర్షాకాలంలో గాలి వేగానికి మబ్బులు చెదిరిపోయినట్లు.
310. అత్యంత శక్తితో అహంభావమనే శత్రువును ఓడించినప్పటికి ఒక్క క్షణము నీవు జ్ఞానేంద్రియాలకు అనుగుణముగా ఆలోచించినప్పటికి, ఆ కారణముగా తిరిగి నీవు సంసార జీవితములోనికి వచ్చినట్లు అవుతుంది. చిట్రాన్‌వృక్షము పూర్తిగా ఎండిపోయినప్పటికి అందులోంచి నీరు బయటకు వస్తుంది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 90 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 21. Ego Feeling - 6 🌻*
308. Checking the activities of egoism etc., and giving up all attachment through the realisation of the Supreme Reality, be free from all duality through the enjoyment of the Bliss of Self, and remain quiet in Brahman, for thou hast attained thy infinite nature.
309. Even though completely rooted out, this terrible egoism, if revolved in the mind even for a moment, returns to life and creates hundreds of mischiefs, like a cloud ushered in by the wind during the rainy season.
310. Overpowering this enemy, egoism, not a moment’s respite should be given to it by thinking on the sense-objects. That is verily the cause of its coming back to life, like water to a citron tree that has almost dried up.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 101 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 82. కలుపుగోలుతనము 🌻*
నీచపు ఆలోచనలు విషపురుగుల వంటివి, త్రాచుపాముల వంటివి. వానిని పెంచి పోషించుట వినాశనము కొరకే. మానవునికి భావమే ప్రధానము. భావములందు సత్యము, ధర్మము, దయ, ప్రేమ పెంపొందినచో జీవుడూర్వగతి చెందగలడు. అరిషడ్వర్గములను పెంచి పోషించినచో జన్మల తరబడి అధోగతి చెందును. సత్పురుషులను, దైవమును దూషించుట, హింసించుట చేసినవారు అసుర జన్మలను కూడ నెత్తుదురు.
మీ భావములనుబట్టి మీ భవిష్యత్తు నిర్ణయమగు చున్నది. మీ భవిష్యత్తునకు మీరే నిర్ణేతలు. కావున మీ పరిస్థితుల కెవ్వరిని దూషింపవద్దు, మిమ్ములను కూడ మీరు దూషించుకొన వలదు. ఆత్మనింద పనికి రాదు, పరనింద అసలే పనికిరాదు.
తోటి మానవులను అవగాహన చేసుకొనుచు, అందరిని కలుపుకొనుచు, ముందుకు సాగుట మేము గుర్తించిన విలువ. కలుపుకొనుటలో విచక్షణ ముఖ్యము. కలుపుకొనుటకు ముందు ఏరుకొనుట ముఖ్యము. ఎన్నుకొనుట కూడ ముఖ్యమే. కనబడినవారి నందరిని కలుపుకొని నడచినచో మార్గము కల్లోలిత మగును. విచక్షణ నీ స్నేహితునిగ ఎప్పుడును ఉండవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 33 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. ప్రతిదీ ఉనికి మనకు యిచ్చిన బహుమతే. మనకు దేనికి అర్హత లేదు. 🍀*
ప్రతిదీ వునికి మనకు యిచ్చిన బహుమతే. మనకు దేనికి అర్హత లేదు. మనకు దేనికీ సామర్థ్యం లేదు. అస్తిత్వం మనకు జీవితాన్ని యిచ్చింది. ప్రేమించే సామర్థాన్ని అనుభూతి చెందే స్పందనని యిచ్చింది. సత్యాన్ని సందర్శించగలిగే సహృదయతని యిచ్చింది. మనం అర్హులమని కాదు, మనం తగిన వాళ్ళమని కాదు. దాని దగ్గర అనంతంగా వుండడం వల్ల యిస్తోంది.
దట్టంగా వర్షిస్తున్న మేఘంలాంటిదది. అది నీటితో నిండింది. వర్షించక తప్పదు. అందువల్ల మనం స్వీకరించాలి. అది పువ్వులాంటిది. వికసించిన పువ్వులాంటిది. దాని గాఢ పరిమళాన్ని అది ప్రసరిస్తోంది. గాలితో కలిసి పరిమళం వీస్తోంది. అది కాంతిలాంటిది. ఆద్యంతాలు లేనిది. ఆరంభం లేనిది. అంతం లేనిది. అది పంచుకునేది. లేకుంటే అది యిబ్బంది పడుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 281 / Sri Lalitha Chaitanya Vijnanam - 281 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।*
*సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀*
*🌻 281. 'ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భువనావళి!! 🌻*
మాత కన్నులు తెరచిన బ్రహ్మాండములు పుట్టునని, ఆమె కన్నులు మూసిన అవి నశించునని అర్థము. ఉన్మేషమనగా నేత్రముల కాంతి. ఉత్పన్న విపన్నములు, భువనావళులకు అనగా బ్రహ్మాండములు ఆమె నుండి కలుగు చుండును. శ్రీమాత అనిమిష అయినచో సృష్టి యుండును. నిమిష అయినచో సృష్టి లయ మగును. అనిమిష అనగా తెరచిన కన్నులు గలది. నిమిష అనగా మూసిన కన్నులు కలది. అనిమిషగ నున్నప్పుడు ఆమె నేత్రముల నుండి ప్రసరించు కాంతి సృష్టి కాధారమై సృష్టిని గావించి వృద్ధి పరచును. ఆమె నిమిషయై కన్నులు మూసినచో సృష్టి
క్షణ కాలమున లయమగను.
సృష్టి కాలమందు శ్రీమాత అనిమేష అనగా రెప్పపాటులు లేనిది. ఈ కర్మములనే శ్రీమాతను, శ్రీమహా విష్ణువును పద్మముల వలె విచ్చుకొన్న ఆకర్షణీయమైన కన్నులు కలవారిగ ఆరాధింతురు. విచ్చుకొన్న కన్నులుగల మూర్తి నారాధించువారు క్రమముగ వికాసము పొందుదురు. మూసిన కన్నులు గల రూపమును ధ్యానించుట వలన ప్రయోజన మంతంత మాత్రమే. దేవి కన్నుల వర్ణన అనేక విధములుగ భక్తులు చేయుచు నుందురు. నేత్ర దర్శన మత్యంత ప్రధానము.
కలువరేకుల వలె విచ్చుకొన్న కాంతివంతమైన కన్నులను ధ్యానించు వారు కాంతివంతు లగుదురు. కాంతి ప్రభావము చేత అప్రమత్తులుగ ఉందురు. కాంతిగల పెద్ద కన్నులు జీవుల పరిణామమును కూడ సూచించును. కన్నులు తెరచుట, మూయుట శ్రీమాత ఇచ్ఛానుసార
ముండును. కావున సృష్టి ఆరంభమునకు అంతమునకు శ్రీదేవి ఇచ్ఛయే ఆధారము.
సంవత్సరమున ఫాల్గుణ మాసము (మీనరాశి) ఈ తత్త్వమును ప్రసరింపచేయును. ఈ మాసమునకు అధిదేవత మీనాక్షి. ఈ మాసమునందే సంవత్సర మంత మగుచుండును. ఈ మాసము నందే సూక్ష్మమగు ఆరంభము కూడ జరుగును. అంతము వలె తోచుట మరియొక ఆరంభమునకే. ఒక సృష్టి అంతమగుట మరియొక సృష్టి ఆరంభమునకే. చిన్నదైననూ, పెద్దదైననూ ఒక కార్యమంత మైనపుడు మరియొకటి ఆరంభమగునని తెలియవలెను. ఇవియే విపన్న ఉత్పన్నములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 281 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |*
*sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀*
*🌻 Unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvānavalī ऊन्मेष-निमिषोत्पन्न-विपन्न-भुवानवली (281) 🌻*
Unmeṣa means opening eye lids and nimiṣ means closing of eye lids.
The creation and dissolution of the universe happens at the wink of Her eyes. When She opens Her eyes, universe is created and when She closes Her eyes, universe is dissolved (vipanna). She does these crucial acts with great ease. This nāma actually highlights the ease with which the Brahman creates and dissolves this universe.
Saundarya Laharī (verse 55) also speaks on the same tone. “The sages have said that the world gets dissolved and created with the closing and opening of your eyes respectively. I suppose that your eyes have dispensed with winking in order to save from dissolution of this entire world which has had its through the opening of your eyes.”
This nāma conveys the subtle nature of the cosmic creation. Kashmiri texts interpret Unmeṣa as the externalising of icchā śakti, the commencement of world process. Unmeṣa also means the unfoldment of spiritual consciousness, which is attained by focussing on the inner consciousnss.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment