దేవాపి మహర్షి బోధనలు - 101
🌹. దేవాపి మహర్షి బోధనలు - 101 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 82. కలుపుగోలుతనము 🌻
నీచపు ఆలోచనలు విషపురుగుల వంటివి, త్రాచుపాముల వంటివి. వానిని పెంచి పోషించుట వినాశనము కొరకే. మానవునికి భావమే ప్రధానము. భావములందు సత్యము, ధర్మము, దయ, ప్రేమ పెంపొందినచో జీవుడూర్వగతి చెందగలడు. అరిషడ్వర్గములను పెంచి పోషించినచో జన్మల తరబడి అధోగతి చెందును. సత్పురుషులను, దైవమును దూషించుట, హింసించుట చేసినవారు అసుర జన్మలను కూడ నెత్తుదురు.
మీ భావములనుబట్టి మీ భవిష్యత్తు నిర్ణయమగు చున్నది. మీ భవిష్యత్తునకు మీరే నిర్ణేతలు. కావున మీ పరిస్థితుల కెవ్వరిని దూషింపవద్దు, మిమ్ములను కూడ మీరు దూషించుకొన వలదు. ఆత్మనింద పనికి రాదు, పరనింద అసలే పనికిరాదు.
తోటి మానవులను అవగాహన చేసుకొనుచు, అందరిని కలుపుకొనుచు, ముందుకు సాగుట మేము గుర్తించిన విలువ. కలుపుకొనుటలో విచక్షణ ముఖ్యము. కలుపుకొనుటకు ముందు ఏరుకొనుట ముఖ్యము. ఎన్నుకొనుట కూడ ముఖ్యమే. కనబడినవారి నందరిని కలుపుకొని నడచినచో మార్గము కల్లోలిత మగును. విచక్షణ నీ స్నేహితునిగ ఎప్పుడును ఉండవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
20 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment