శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 281 / Sri Lalitha Chaitanya Vijnanam - 281


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 281 / Sri Lalitha Chaitanya Vijnanam - 281 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀


🌻 281. 'ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భువనావళి!! 🌻

మాత కన్నులు తెరచిన బ్రహ్మాండములు పుట్టునని, ఆమె కన్నులు మూసిన అవి నశించునని అర్థము. ఉన్మేషమనగా నేత్రముల కాంతి. ఉత్పన్న విపన్నములు, భువనావళులకు అనగా బ్రహ్మాండములు ఆమె నుండి కలుగు చుండును. శ్రీమాత అనిమిష అయినచో సృష్టి యుండును. నిమిష అయినచో సృష్టి లయ మగును. అనిమిష అనగా తెరచిన కన్నులు గలది. నిమిష అనగా మూసిన కన్నులు కలది. అనిమిషగ నున్నప్పుడు ఆమె నేత్రముల నుండి ప్రసరించు కాంతి సృష్టి కాధారమై సృష్టిని గావించి వృద్ధి పరచును. ఆమె నిమిషయై కన్నులు మూసినచో సృష్టి క్షణ కాలమున లయమగను.

సృష్టి కాలమందు శ్రీమాత అనిమేష అనగా రెప్పపాటులు లేనిది. ఈ కర్మములనే శ్రీమాతను, శ్రీమహా విష్ణువును పద్మముల వలె విచ్చుకొన్న ఆకర్షణీయమైన కన్నులు కలవారిగ ఆరాధింతురు. విచ్చుకొన్న కన్నులుగల మూర్తి నారాధించువారు క్రమముగ వికాసము పొందుదురు. మూసిన కన్నులు గల రూపమును ధ్యానించుట వలన ప్రయోజన మంతంత మాత్రమే. దేవి కన్నుల వర్ణన అనేక విధములుగ భక్తులు చేయుచు నుందురు. నేత్ర దర్శన మత్యంత ప్రధానము.

కలువరేకుల వలె విచ్చుకొన్న కాంతివంతమైన కన్నులను ధ్యానించు వారు కాంతివంతు లగుదురు. కాంతి ప్రభావము చేత అప్రమత్తులుగ ఉందురు. కాంతిగల పెద్ద కన్నులు జీవుల పరిణామమును కూడ సూచించును. కన్నులు తెరచుట, మూయుట శ్రీమాత ఇచ్ఛానుసార
ముండును. కావున సృష్టి ఆరంభమునకు అంతమునకు శ్రీదేవి ఇచ్ఛయే ఆధారము.

సంవత్సరమున ఫాల్గుణ మాసము (మీనరాశి) ఈ తత్త్వమును ప్రసరింపచేయును. ఈ మాసమునకు అధిదేవత మీనాక్షి. ఈ మాసమునందే సంవత్సర మంత మగుచుండును. ఈ మాసము నందే సూక్ష్మమగు ఆరంభము కూడ జరుగును. అంతము వలె తోచుట మరియొక ఆరంభమునకే. ఒక సృష్టి అంతమగుట మరియొక సృష్టి ఆరంభమునకే. చిన్నదైననూ, పెద్దదైననూ ఒక కార్యమంత మైనపుడు మరియొకటి ఆరంభమగునని తెలియవలెను. ఇవియే విపన్న ఉత్పన్నములు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 281 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀


🌻 Unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvānavalī ऊन्मेष-निमिषोत्पन्न-विपन्न-भुवानवली (281) 🌻

Unmeṣa means opening eye lids and nimiṣ means closing of eye lids.

The creation and dissolution of the universe happens at the wink of Her eyes. When She opens Her eyes, universe is created and when She closes Her eyes, universe is dissolved (vipanna). She does these crucial acts with great ease. This nāma actually highlights the ease with which the Brahman creates and dissolves this universe.

Saundarya Laharī (verse 55) also speaks on the same tone. “The sages have said that the world gets dissolved and created with the closing and opening of your eyes respectively. I suppose that your eyes have dispensed with winking in order to save from dissolution of this entire world which has had its through the opening of your eyes.”

This nāma conveys the subtle nature of the cosmic creation. Kashmiri texts interpret Unmeṣa as the externalising of icchā śakti, the commencement of world process. Unmeṣa also means the unfoldment of spiritual consciousness, which is attained by focussing on the inner consciousnss.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jun 2021

No comments:

Post a Comment