వివేక చూడామణి - 90 / Viveka Chudamani - 90


🌹. వివేక చూడామణి - 90 / Viveka Chudamani - 90🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 21. అహంభావము - 6 🍀


308. అహంకారము యొక్క పనులను అడ్డుకొని, అన్ని బంధనాలను తెంచుకొనుట ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ద్వంద్వాతీత స్థితిని చేరుకొని, ఆత్మానందమును పొంది, బ్రహ్మములో శాశ్వతముగా ఐక్యము కమ్ము. నీవు ఆ స్థితిని పొందియున్నావు.

309. భయంకరమైన అహంభావమును పూర్తిగా మూలముతో సహా నిర్మూలించినప్పటికి, మనస్సులో ఒక క్షణమైన జీవన సృతులు జ్ఞాపకమునకు వచ్చిన, వందలకొలది కష్టాలను కొనితెస్తుంది. ఎలానంటే వర్షాకాలంలో గాలి వేగానికి మబ్బులు చెదిరిపోయినట్లు.

310. అత్యంత శక్తితో అహంభావమనే శత్రువును ఓడించినప్పటికి ఒక్క క్షణము నీవు జ్ఞానేంద్రియాలకు అనుగుణముగా ఆలోచించినప్పటికి, ఆ కారణముగా తిరిగి నీవు సంసార జీవితములోనికి వచ్చినట్లు అవుతుంది. చిట్రాన్‌వృక్షము పూర్తిగా ఎండిపోయినప్పటికి అందులోంచి నీరు బయటకు వస్తుంది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 90 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 21. Ego Feeling - 6 🌻


308. Checking the activities of egoism etc., and giving up all attachment through the realisation of the Supreme Reality, be free from all duality through the enjoyment of the Bliss of Self, and remain quiet in Brahman, for thou hast attained thy infinite nature.

309. Even though completely rooted out, this terrible egoism, if revolved in the mind even for a moment, returns to life and creates hundreds of mischiefs, like a cloud ushered in by the wind during the rainy season.

310. Overpowering this enemy, egoism, not a moment’s respite should be given to it by thinking on the sense-objects. That is verily the cause of its coming back to life, like water to a citron tree that has almost dried up.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


20 Jun 2021

No comments:

Post a Comment