నిర్మల ధ్యానాలు - ఓషో - 33
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 33 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతిదీ ఉనికి మనకు యిచ్చిన బహుమతే. మనకు దేనికి అర్హత లేదు. 🍀
ప్రతిదీ వునికి మనకు యిచ్చిన బహుమతే. మనకు దేనికి అర్హత లేదు. మనకు దేనికీ సామర్థ్యం లేదు. అస్తిత్వం మనకు జీవితాన్ని యిచ్చింది. ప్రేమించే సామర్థాన్ని అనుభూతి చెందే స్పందనని యిచ్చింది. సత్యాన్ని సందర్శించగలిగే సహృదయతని యిచ్చింది. మనం అర్హులమని కాదు, మనం తగిన వాళ్ళమని కాదు. దాని దగ్గర అనంతంగా వుండడం వల్ల యిస్తోంది.
దట్టంగా వర్షిస్తున్న మేఘంలాంటిదది. అది నీటితో నిండింది. వర్షించక తప్పదు. అందువల్ల మనం స్వీకరించాలి. అది పువ్వులాంటిది. వికసించిన పువ్వులాంటిది. దాని గాఢ పరిమళాన్ని అది ప్రసరిస్తోంది. గాలితో కలిసి పరిమళం వీస్తోంది. అది కాంతిలాంటిది. ఆద్యంతాలు లేనిది. ఆరంభం లేనిది. అంతం లేనిది. అది పంచుకునేది. లేకుంటే అది యిబ్బంది పడుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment