సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻164. ' నిర్మమా '🌻
“ఇది నాది”, అను బుద్ధి లేనిది శ్రీమాత.
నేను అను భావము అహంకారము. నాది అను భావము మమకారము. నాది అను భావమున్న చోట బంధమున్నది. నాది అని భావించు వస్తువుపైన, ప్రాణముపైన మమకారము అను జిగురు
ప్రసరించి, జీవుడు వానికి అతుకుకొని బద్ధుడగుచుండును. నాది అను వస్తువు కోల్పోయినపుడు బాధపడును. నిజమున కేదియూ తనది కాదు.
తన దగ్గర చేర్చబడినవే యుండును కానీ, తనవి అని ఏమియూ ఉండవు. తన శరీరము తన చుట్టునూ దేవతలచే అల్లబడినది. అందు వర్తించువారు కూడా దేవతలే. శరీరము దేవతలిచ్చినది. కానీ, తనది కాదు. అది దైవదత్తము. అట్లే భార్య, భర్త, బిడ్డలు, మువ్వురునూ దైవవశమున చేరినవారే కాని, తనవారు కాదు. వారియందు కర్తవ్యమే యున్నది కాని, అధికారము లేదు.
అట్లే బంధువులు, స్నేహితులు, ఆస్తులు, పాస్తులు. ఇవి యన్నియూ తన చుట్టునూ చేరుట, విడిపోవుట కాలక్రమమున తప్పనిసరి. వచ్చినవెల్ల పోవునవే. శరీరముతో సహా సర్వమునూ పోవునవే కాని తనతో నుండునవి కావు.
ధర్మమూ, కర్మమూ మాత్రమే తనతో నడచి వచ్చును. అవియునూ మోక్షమార్గమున సడలును. తానొకడే సత్యము. తాను సనాతనుడు, భేద సనాతనులైన ఉమామహేశ్వరుల తనయుడు. అట్టి జీవుడు ఐక్యము చెందిననూ, తన అస్తిత్వము కూడ భగవదనుగ్రహముగ కలిగి యుండును.
సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. వారునూ బుద్ధి లేక, స్వలాభ రహితులై శ్రీమాత అనుచరులుగ జీవులకు జ్ఞాన సంతర్పణము చేయుచున్నారు. మమకారమున్నంత కాలము బంధముండును. బంధ మున్నంత కాలము బాధ యుండును. తన చుట్టును చేరినవి తనవి అనుకొనక దైవమునవి అనుకొనుట అభ్యసించవలెను.
తాను, తన పరసరముల చేరినవి, అన్నియునూ దైవమునకు చెందినవే కాని తనకు చెందినవి కావు. వానియందు మమకారము దుఃఖము కలిగించును. కావున ఈ భావము దాటిన వారికే ప్రశాంత యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 164 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirmamā निर्ममा (164) 🌻
She does not have self concern. If there is self concern, one identifies himself as different from the Brahman. This is called dualism and should not be pursued. If one looks at this nāma from the point of view of the first nāma Śrī Mātā, as the Supreme Mother she does not care for Herself.
Her concern is only about Her children, all the living beings in this universe. From the point of view of the Brahman, self-concern is yet another quality that is being negated here.
It is interesting to note that commencing from nāma 164 one nāma says that She does not have that quality and the next nāma says that She destroys such qualities in Her devotees. For example nāma 166 is niṣpāpā (without sins) and the next namā 167 is pāpa-naśinī (destroys sins of Her devotees).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Dec 2020
No comments:
Post a Comment