🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జమదగ్నిమహర్షి-రేణుక - 2 🌻
06. తన దగ్గర ఎంత ఉంది, ఎంత ఇచ్చాడు అనే దన్నిబట్టి దానం యొక్క మహత్తు ఉంటుంది. అంతే కాని ఎంత ఇచ్చడు అనేదానినిబట్టికాదు. ఒక కోతీశ్వరుడు లక్షరూపాయలు దానం చేస్తూ యథాశక్తి అంటే, అది దోషం. “నా బుద్ధి చిన్నది. లక్షకంటే ఎక్కువ ఇవ్వటంలేదు. నేను ఇవ్వగలిగినవాడినే! యాభైలక్షలు ఇవ్వగలిగినవాడినే! కాని నాబుద్ధి చిన్నది. స్వీకరించి అనుగ్రహించండి” అని అనాలి.
07. “యథాశక్తి ఇస్తున్నాను. ఏకంగా లక్షరూపాయలు ఇస్తున్నాను. చాలా పెద్దమొత్తం ఇస్తున్నాను” అనుకోవటం వాడికి దానమే కాదు. తనశక్తికి సరిపడేటట్లు ఇస్తేనే అది దానం. ‘శక్త్యనుసారం’ – ‘యథాశక్తి’ అనరాదు, అలా అనకూడదు. ‘యథాబుద్ధి’ అనాలి. యథాశక్తి అంటే ‘యావఛ్ఛక్తి’ అనే అర్థం. దానికి అదే అర్థం. జ్ఞాపకం పెట్టుకోవాలి.
08. ఇవ్వగలిగితే లక్ష ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఒప్పుకోవాలి! అప్పుడు దోషం ఉండదు. ఎప్పుడూ కూడా ఆ మాట-యథాశక్తి అనేమాట-వాడకుండా ఉండటమే న్యాయం, క్షేమం. నిజానికి మనం దానం యథాశక్తిగా ఎప్పుడూ ఎందులోనూ చెయ్యటంలేదు. ఏదో యథాబుద్ధి చేస్తున్నాం. ఒకవేళ చేసినా, దానిని దానం అనే అంటారు. అంతే కాని అది త్యాగం అనిపించుకోదు. త్యాగం వేరు.
09. ఒకదాత, కోటి ఇవ్వకలిగినవాడు, లక్షే ఇస్తే, దానం చేసిన వాడవుతాడు. దానికుండే ప్రతిఫలం ఎదో ఉంటుంది. అది పుణ్యమే అవుతుంది. అయితే ఉన్నదంతా ఇవ్వగలిగిన వాడు త్యాగంచేసినవాడవుతాదు. దానంవల్ల పుణ్యంవస్తే, త్యాగంవల్ల మోక్షమేవస్తుంది.(‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ అని ఆర్యోక్తి).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Dec 2020
No comments:
Post a Comment