🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 21 🍀
కాళ్ వేళ్ నామ్ ఉచ్చారితా నాహీ!
దోస్తీపక్షి పాహీ ఉద్ధరతీ!!
రామకృష్ణ నామ సర్వదోషా హరణ్!
జడజీవా తారణ్ హరి ఏక్!!
హరి నామ సార్ జిన్హా యా నామాచీ!
ఉపమా త్యా దైవాచీ కోణ్ వానీ!!
జ్ఞానదేవా సాంగ్ ఝాలా హరిపార్!
పూర్వజా వైకుండ్ మార్గ్ సోపా!!
భావము:
నామోచ్ఛారణ చేయడానికి కాల వేళాదుల నియమము ఏమీ లేదు. నామ స్మరణ చేయువారి ఇరు పక్షాలు ఉద్దరించి పోతాయి.
రామకృష్ణ నామము సర్వ దోషాలను హరించి వేయును. ఒక్క హరి నామమే జడ జీవులను తరించి వేయగలదు. హరినామ సారము యొక్క రుచి మరిగిన నాలుక దైవమును వర్ణించి
చెప్పడము ఎవ్వరికి సాధ్యము కాదు.
హరిపాఠమును పఠించి హృదయస్థము చేసుకున్న వారి పూర్వజులకు కూడ వైకుంఠ మార్గము సులభము కాగలదని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -21 🌻
లేదు కాల వేళాదుల నియమము
ఉచ్ఛరించుటకు హరి నామము
ఇరు పక్షముల పరివారము
అయిపోవుదురు ఉద్గారము
రామకృష్ణ మధుర నామము
సర్వదోషహరణ కారణము
జడజీవులను తరించడము
హరి ఒకడికే ఇది సాధ్యము
హరినామము వేద సారము
నామ రుచి మరిగిన నాలుక భాగ్యము;
వర్ణింపనెవరి వైఖరి తరము
ఆ భక్త జనుల దైవ వైభవము
జ్ఞానదేవుని నామకీర్తనము
అయిపోయినది పరిపూర్ణము
పూర్వజులకు వైకుంఠ మార్గము
సులభముగా అయినది సాధ్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Dec 2020
No comments:
Post a Comment