భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 135


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 135 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 14 🌻


548. ఉన్నత చైతన్యము:- మానవుడు, ఉన్నతర చైతన్యము:- ఆధ్యాత్మిక మార్గము, మహోన్నత చైతన్యము:- భగవంతుడు, సర్వోన్నత చైతన్యము:- సద్గురువు లేక అవతార పురుషుడు.

549. సృష్ట రూపములలో ఉన్నత చైతన్యము:- మానవుడు, మానవులలో మహోన్నత చైతన్యము:- భగవంతుడు.

550. భగవదనుభూతి పరుడైన మానవుడు (జ్ఞానముతో, విశుద్ధ చైతన్యముతో కూడిన) సర్వశక్తిమంతుడు. సత్యస్థితి యందు జాగరూకుడై యుండును. అతడే జ్ఞానము-జ్ఞాని-జ్ఞేయము, ప్రేమ-ప్రేమికుడు-ప్రియతముడు.

ప్రతి జీవాత్మలో తానున్నాననియు, తనలో ప్రతి జీవాత్మ ఉన్నదనియు అతడెరుంగును. అతడే సమస్తమునకు ఆద్యంతములని కూడా ఎఱుంగును. తాను శాశ్వతముగా, ఆ.... సత్యసాగరునిగనే యుంటిననియు, ఉన్నాననియు, ఉందుననియు ఎరుంగును. కాని, సామాన్య మానవునకు తానెక్కడ నుండి వచ్చెనో, ఎక్కడికి పోవునో తెలియదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 Dec 2020

No comments:

Post a Comment