1) 🌹 శ్రీమద్భగవద్గీత - 573 / Bhagavad-Gita - 573🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 20 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 334, 335 / Vishnu Sahasranama Contemplation - 334, 335🌹
4) 🌹 Daily Wisdom - 81🌹
5) 🌹. వివేక చూడామణి - 44🌹
6) 🌹Viveka Chudamani - 44🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 55🌹
8) 🌹.స్వేచ్ఛ భాధ్యతా రాహిత్యమా? 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 234 / Sri Lalita Chaitanya Vijnanam - 234🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 573 / Bhagavad-Gita - 573 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 12 🌴*
12. అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ భరతశ్రేష్టా! ఏదేని ఒక భౌతికలాభము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణప్రధానమైనదని యెరుగుము.
🌷. భాష్యము :
కొన్నిమార్లు యజ్ఞములు మరియు ఆచారకర్మలు ఉన్నతలోక ప్రాప్తి కొరకు లేదా ఈ జగమున ఏదేని భౌతికలాభము కొరకు ఒనరించబడుచుండును. అట్టి యజ్ఞములు లేదా ఆచారకర్మలు రజోగుణ ప్రధానములైనవిగా భావింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 573 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 12 🌴*
12. abhisandhāya tu phalaṁ
dambhārtham api caiva yat
ijyate bharata-śreṣṭha
taṁ yajñaṁ viddhi rājasam
🌷 Translation :
But the sacrifice performed for some material benefit, or for the sake of pride, O chief of the Bhāratas, you should know to be in the mode of passion.
🌹 Purport :
Sometimes sacrifices and rituals are performed for elevation to the heavenly kingdom or for some material benefits in this world. Such sacrifices or ritualistic performances are considered to be in the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 020 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 20 🌻*
20
అథ వ్యవస్థితాన్ దృష్ట్యా
ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ: |
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాండవ: ||
హృషీకేశం తదా వాక్యమ్
ఇదమహ మహీపతే |
తాత్పర్యము :
ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా ! వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను.
భాష్యము :
యద్ధము మొదలు కానున్నది. పైన తెలిపిన శ్లోకాల ప్రకారము శ్రీ కృష్ణుని సూచనల మేరకు పాండవులు చేసిన సైన్యపు ఏర్పాట్లను చూసి ధృతరాష్ట్రుని పుత్రుల ఆశలు నీరుకారాయని అర్థమగుచున్నది. అంతే కాక అర్జునుని జెండాపై హనుమంతుని చిహ్నము ఉండెను. హనుమంతుడు యుద్ధ సమయంలో రాముని తరపున పోరాడెను. చివరకు రాముడు విజయము సాధించెను. ఇప్పుడు ఆ రాముడు కృష్ణుని రూపంలో ఈ హనుమంతుడు జెండా రూపములో అర్జునుని తరపున నిలబడి ఉన్నారు. అంతేకాక కృష్ణుడే స్వయంగా తగిన సూచనలను చేసి అర్జునుడిని నడిపిస్తూ ఉన్నాడు. శ్రీ కృష్ణుడు, తన శాశ్వత భక్తుడైన అర్జునునికి అన్ని రకాల శుభ సూచకాలను ఏర్పాటు చేయుట వలన విజయము సాధించుటకు పూర్తి అవకాశాలు ఉన్నవి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 334 / Vishnu Sahasranama Contemplation - 334🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ🌻*
*ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM
Ādidevāya nam*
ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ
ఆదిర్హేతుస్స దేవశ్చ ద్యోతనాదిగుణీత్వతః ।
ఇత్యుచ్యతే విష్ణురాదిదేవ శబ్దేన పండితైః ॥
ఆదియు, ఆదికారణమును, మునుపటినామమునందు జెప్పినవిధమున ప్రకాశించుట మొదలగు లక్షణములకు ఆస్పదమయిన దేవుడును కావున పండితులు ఆ విష్ణుని - ఆదిదేవునిగా పిలుచుచుందురు.
:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
త్వమాదిదేవః పురుషః పురాణ స్త్వమస్య పరం నిధానమ్ ।
వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనన్తరూప ॥ 38 ॥
అనంతరూపుడగు ఓ కృష్ణా! నీవు ఆదిదేవుడవు, సనాతపురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తము తెలిసికొనినవాడునూ, తెలియదగినవాడును, సర్వోత్తమస్థానమును అయియున్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 334🌹*
📚. Prasad Bharadwaj
*🌻334. Ādidevaḥ🌻*
*OM
Ādidevāya nam*
Ādirhetussa devaśca dyotanādiguṇītvataḥ,
Ityucyate viṣṇurādideva śabdena paṃḍitaiḥ.
आदिर्हेतुस्स देवश्च द्योतनादिगुणीत्वतः ।
इत्युच्यते विष्णुरादिदेव शब्देन पंडितैः ॥
Since Lord Viṣṇu is ādi or primal and as highlighted in the explanation of previous divine name, due to His illumining the universe He is deva or god. Hence the learned address Him as Ādidevaḥ or primal Deity.
Śrīmad Bhagavad Gīta - Chapter 11
Tvamādidevaḥ puruṣaḥ purāṇa stvamasya paraṃ nidhānam,
Vettā’si vedyaṃ ca paraṃ ca dhāma tvayā tataṃ viśvamanantarūpa. (38)
:: श्रीमद्भगवद्गीत विश्वरूपसंदर्शन योग ::
त्वमादिदेवः पुरुषः पुराण स्त्वमस्य परं निधानम् ।
वेत्ताऽसि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ॥ 38 ॥
You are the primal Deity, the ancient Person; You are the supreme Resort of this world. You are the knower as also the object of knowledge and the supreme Abode. O Kr̥ṣṇā! You of infinite forms, the Universe is pervaded by you!
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 335 / Vishnu Sahasranama Contemplation - 335🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻335. పురన్దరః, पुरन्दरः, Purandaraḥ🌻*
*ఓం పురన్దరాయ నమః | ॐ पुरन्दराय नमः | OM Purandarāya namaḥ*
పురన్దరః, पुरन्दरः, Purandaraḥ
పురాణామ్ సురశత్రూణాం దారణాత్ స పురందరః దేవ శత్రువుల పురములను బ్రద్దలు చేయును.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. తోయజ హిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు
కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ సంపుట లసన్మౌక్తికంబు
నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ కార విస్ఫురిత పంకరుహసఖుఁడు
దశరథేశ్వర కృతధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు
తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు
నగుచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు. (155)
చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమచందురుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యం. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 335🌹*
📚. Prasad Bharadwaj
*🌻335. Purandaraḥ🌻*
*OM Purandarāya namaḥ*
Purāṇām suraśatrūṇāṃ dāraṇāt sa puraṃdaraḥ / पुराणाम् सुरशत्रूणां दारणात् स पुरंदरः He destroys the Purās or cities of the enemies of the gods.
Śrīmad Bhāgavata - Canto 2, Chapter 7
Yasmā adādudadhirūḍabhayāṅgavēpō mārgaṃ sapadyaripuraṃ haravaddidakṣōḥ,
Dūrē suhr̥inmathitarōṣasuśōṇadr̥iṣṭayā tātapyamānamakarōraganakracakraḥ. 24.
:: श्रीमद्भागवत - द्वितीयस्कनधे सप्तमोऽध्यायः ::
यस्मा अदादुदधिरूडभयाङ्गवेपो मार्गं सपद्यरिपुरं हरवद्दिदक्षोः ।
दूरे सुहृन्मथितरोषसुशोणदृष्टया तातप्यमानमकरोरगनक्रचक्रः ॥ २४ ॥
Lord Rāmacandra, being aggrieved for His distant intimate friend (Sīta), glanced over the city of the enemy Rāvaṇa with red-hot eyes like those of Hara. The great ocean, trembling in fear, gave Him His way because its family members, the aquatics like the sharks, snakes and crocodiles, were being burnt by the heat of the angry red-hot eyes of the Lord.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 81 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 21. Though it is the 'Other', it is Also the Self 🌻*
It willed, or He willed: “May I have a second Self.” This is the origin of creation. The world, this creation, this universe is the second Self, as it were, of the Supreme Being. This ‘other’ Self, which is this vast creation, is animated by the Supreme Being Himself. It is ‘other’ in the sense that it had not all the characteristics of the Absolute. Yet, it is the Self.
Though it is the ‘other’, it is also the Self. It is called the ‘Other Self’, inasmuch as the Selfhood of the Absolute is transparently present in this creation. The Universal Atman is immanent in the whole universe, in all aspects of creation; and yet the universe is an ‘otherness’, as it were, of God, an object of God. It is as if the Universal ‘I’ is envisaging a universal object, including all that is visible or sensible—space, time and causal relation.
A single Subject encountering a single Object is the state which is described in this passage, a Cosmic Consciousness becoming aware of a Cosmic Object in a peculiar manner, not in the way in which the ordinary individual is aware of an object outside. The way in which God is conscious of the universe, is different from the way in which an ordinary jiva, or individual, is conscious of an object.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 44 / Viveka Chudamani - 44🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*🍀. 14. శరీరము - 2 🍀*
157. ఆత్మ నిజమైన సత్యము కావున అవి శరీరము కంటే వేరైనది. దాని గుణాలు, దాని పనులు, దాని స్థితులు అనేవి దాని సాక్షి స్థితికి ఉదాహరణ.
158. ఈ శరీరము ఎములు, మాంసము మరియు వ్యర్ధములతో నిండి పూర్తిగా అపవిత్రమైనది. కాని స్వయం స్థితమైన ఆత్మ అన్ని తానే అయి ఈ శరీరము కంటే భిన్నమైనది.
159. మూర్ఖుడైన మనిషి తాను శరీరముగానే భావించి, చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు మరియు కల్మషాలతో నిండి ఉన్నాడు. కాని మంచి, చెడుల భేదముల గ్రహించిన వ్యక్తి తాను శరీరము కాదు ఆత్మనని తెలుసుకొని, కేవలము తానే సత్యమని ఈ శరీరమునకు వేరుగా ఉన్నానని తెలుసుకొనును.
160. మూర్ఖుడైన వ్యక్తి తాను శరీరమని తలచగా, పుస్తక జ్ఞానము కలిగిన వాడు తాను శరీరము మరియు ఆత్మ యొక్క సంమ్మేళనమని భావించగా, యోగి తాను మంచి, చెడులకు భేదములను తెలుసుకొని పరమాత్మయే తానని గ్రహించి తనను తాను బ్రహ్మముగా భావించును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 44 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 The Body - 2 🌻*
157. That the Atman as the abiding Reality is different from the body, its characteristics, its activities, its states, etc., of which It is the witness, is self-evident.
158. How can the body, being a pack of bones, covered with flesh, full of filth and highly impure, be the self-existent Atman, the Knower, which is ever distinct from it ?
159. It is the foolish man who identifies himself with a mass of skin, flesh, fat, bones and filth, while the man of discrimination knows his own Self, the only Reality that there is, as distinct from the body.
160. The stupid man thinks he is the body, the book-learned man identifies himself with the mixture of body and soul, while the sage possessed of realisation due to discrimination looks upon the eternal Atman as his Self, and thinks, "I am Brahman".
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 55 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 37. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 11 -1 🌻*
పరమగురువులతో మనకేర్పడిన పరిచయము గూర్చికాని, వ్యక్తిగతమైన అనుభూతుల గూర్చి కానీ యితరులకు తెలుపుట బాధ్యతా రహితమైన పని.
అత్యంత బాధ్యతాయుతముగ సంఘము
నకు శ్రేయస్సు గలుగు కార్యములను నిర్వర్తించుటయేగాని, వారి నామములను బహిరంగముగా గాని, ఆత్మీయులనుకొను వారితో గాని, ముచ్చటించ గూడదనునది నేనెఱిగిన ఒక ముఖ్యసాధనా సూత్రము. న్యూయార్కునగరమున 'నొబిలిటీ క్లబ్' అను ఒక క్లబ్ వున్నది.
రష్యాకు చెందిన 'జార్ చక్రవర్తుల' వంశీయులలోని ఒక రాజు ఆ క్లబ్ లో ప్రసంగించనున్నాడని, నేను తప్పక ఆ ప్రసంగము వినుటకు హాజరు కావలయునని, నా మిత్రురాలు ఒకామె నాకు గట్టిగ తెలిపినది. నేను సమావేశమునకు హాజరైతిని.
ఎందరో ధనికులు, రాజవంశము వారు, పెద్ద పెద్ద అధికారులు సమావేశమున నుండిరి. అలెగ్జాండర్ అను పేరుగల జార్ రాజు సభలో ప్రవేశించు చుండగా అప్రయత్నముగ సభయంతయూ లేచి నిలబడి, ఆయన ఉన్నతాసనము నధిష్ఠించు వరకూ ఎవరునూ వారి వారి స్థానము లందు ఆసీనులు కాలేదు.
ఇట్టి సాంప్రదాయము బ్రిటిష్ మరియు ఏషియన్ నాగరికతలో కలదుగాని, అమెరికా వారికి లేదు. ప్రసంగము ప్రారంభించుచూ అలెగ్జాండర్ ఇట్లనిరి. “కొంత సేపు నేను రష్యాదేశపు రాజవంశీయుడనని మీరందరూ మీ మనస్సుల నుండి తొలగించండి.
ఒక జీవునిగ యితర జీవులతో ప్రసంగించుటకు నేను వచ్చితిని. ఈ సమావేశమున మన స్థితిగతులు అప్రస్తుతము.” పై వాక్యములు విని శరీరమంతయూ గగుర్పొడిచి నేను నిఠారుగా కూర్చొంటిని.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా? 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛ కాదు. ఆ ‘నుంచి’ అనేది మీరు గతంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. అందువల్ల ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ అసలైన స్వేచ్ఛ కాదు.
**
అడ్డంకులను అధిగమించే సోపానాలు
సామాజిక, రాజకీయ, ఆర్థిక-ఇలా అనేక రకాల స్వేచ్ఛలున్నాయి. కానీ, అవన్నీ పైపైవి మాత్రమే. అసలైన స్వేచ్ఛకు పూర్తి భిన్నమైన పార్శ్వముంటుంది. అది ఏమాత్రం బయట ప్రపంచానికి సంబంధించినది కాదు. అది మీలో ఉదయిస్తుంది. అన్నిరకాల నిబద్ధీకరణలు, ధార్మిక సిద్ధాంతాలు, రాజకీయ వేదాంతాలనుంచి బయటపడేదే అసలైన ‘స్వేచ్ఛ.’
ఇతరులు మీపై విధించినవన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మిక బానిసత్వంలో బంధించేందుకు వేసిన సంకెళ్ళే. వాటినుంచి విముక్తి కలిగించి మిమ్మల్ని స్వేచ్ఛావిహారిగా చేసేదే ధ్యానం. అప్పుడే మీరు మళ్ళీ అస్తిత్వపు నీడలో, నక్షత్రాల వాడలో హాయిగా విహరించగలరు.
ఎప్పుడైతే మీరు అస్తిత్వానికి అందుబాటులో ఉంటారో అప్పుడు అస్తిత్వం మీకు అందుబాటులోకి వస్తుంది. మీ ఇద్దరి కలయికే పరమానందానికి పరాకాష్ట. అది కేవలం స్వేచ్ఛలో మాత్రమే జరుగుతుంది. అందుకే స్వేచ్ఛ అత్యంత విలువైనది. అంతకన్నా విలువైనది ఏదీ లేదు.
***
🌷. ‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’ 🌷
చెయ్యాలనుకున్నది చేసేటంత పూర్తి స్వేచ్ఛ మనకు ఉండాలని ఒకపక్క మీరు సూచిస్తూనే, దాని బాధ్యతను కూడా మనం స్వీకరించాలని మీరంటున్నారు. బాధ్యతను స్వీకరించే పక్షంలో కోరుకున్నంత స్వేచ్ఛగా నేనుండలేను. మీరు చెప్పేది అర్థమైనప్పుడు మాత్రం నాలో మీపట్ల కృతజ్ఞతా భావం కలుగుతోంది. కానీ, చాలావరకు నేను స్వేచ్ఛను విచ్చలవిడి తనానికిచ్చిన అనుమతి పత్రంగానే భావిస్తున్నాననిపిస్తోంది.
‘‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’- తరతరాలుగా మానవాళిని వెంటాడుతున్న శాశ్వతమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ‘‘బాధ్యత లేకపోవడమే స్వేచ్ఛ’’అని మీరు అనుకుంటున్నారు.
ఒక శతాబ్దం క్రితం ఫ్రెడరిక్ నీషే ‘‘దేవుడు మరణించాడు, మనిషి స్వేచ్ఛ పొందాడు’’అంటూనే ‘‘ ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యొచ్చు. ఎలాంటి బాధ్యత లేదు’’ అని కూడా అన్నాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. దేవుడే లేనప్పుడు మొత్తం బాధ్యత మీపై పడుతుంది.
ఒకవేళ దేవుడు ఉన్నట్లైతే ‘ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. పాప చింతనలు, అవినీతి విత్తనాలు మొదటినుంచి నువ్వే నాలో నాటావు. నువ్వే నన్ను అలా తయారుచేశావు. కాబట్టి, అన్నింటికీ బాధ్యత నీదేకానీ, నాది కాదు. నేనొక చిన్న జీవాన్ని. నువ్వు సృష్టికర్తవు. కాబట్టి, బాధ్యత నాదెలా అవుతుంది?’’ అంటూ మీ బాధ్యతను ఆయనపైకి నెట్టేస్తారు.
నిజంగా దేవుడు ఉన్నట్లైతే మీరన్నట్లు మీ బాధ్యతను ఆయన పంచుకోక తప్పదు. ఒకవేళ ఆయన లేకపోతే ఎవరు చేసే పనులకు వారే బాధ్యులవుతారు. ఎందుకంటే, మీ బాధ్యతలను మరొకరిపై వేసేందుకు వేరే దారిలేదు.
మీరు స్వేచ్ఛగా ఉండండని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరు చేసే పని పట్ల బాధ్యతాయుతంగా ఉండండి’’ అని. ఎందుకంటే, ఆ పని చేసేది మీరే కాబట్టి, దాని బాధ్యత కూడా మీదే అవుతుంది. అంతేకానీ, ఆ బాధ్యతను మీరు ఇతరులపై వెయ్యలేరు.
మీరు ఏ పనిచేసినా దాని బాధ్యత కూడా మీదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా మీచేత ఆ పని చేయించారని మీరు చెప్పలేరు. ఎందుకంటే, మీరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో, వద్దో నిర్ణయించేది మీరే.
స్వేచ్ఛతోపాటే బాధ్యతకూడా వస్తుంది. నిజానికి, స్వేచ్ఛే బాధ్యత. కానీ, మనసు మహామోసకారి. అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది కానీ, సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 234 / Sri Lalitha Chaitanya Vijnanam - 234 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।*
*మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥🍀*
*🌻 234. 'మహాత్రిపురసుందరీ' 🌻*
త్రిపురములు, వాని తాదాత్మ్యతా సౌందర్యము గల సుందరి. త్రిపురములు సుందరములు. వాని తాదాత్మ్యత మహా సుందరములు. త్రిపురము లనగా మూడు పురములు. అవియే త్రిశక్తులు, త్రిగుణములు, త్రిమూర్తులు, త్రిలోకములు, త్రికాలములు.
ఇట్లు త్రికోణముగ సృష్టి నిర్మాణము జరుగుచుండును. ఇందు ప్రజ్ఞ, శక్తి, పదార్థము వినియోగ పడుచుండును. సృష్టి స్థితి లయము జరుగుచు నుండును. కర్త కర్మ క్రియ లేర్పడుచుండును. దేవతలు, దానవులు, మానవులు ఏర్పడుచుందురు. స్వర్గము, భూమి, నరకము ఏర్పడు చుండును. ఇట్టి త్రిగుణాత్మకమగు సృష్టిని త్రిపురము లందురు.
అందు పనిచేయు శక్తులు కూడ త్రిశక్తులే (ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు). తెలిసినవారికి త్రిపురములు అమితానందము కలిగించును. శ్రీదేవి సృష్టి నిర్మాణ చాతుర్యమును తాదాత్మ్యముతో అట్టివారు వర్ణించు చుందురు. నారద, తుంబురు లట్టివారే.
శ్రీమాత ప్రజ్ఞగను, కొలతగను, కొలుచు శక్తిగను తానే త్రిపుటి యగును. తానే త్రిపుటియై సమస్త సృష్టి కార్యమును నైపుణ్యముతో నిర్మించుటయే కాక సౌందర్యముగ కూడ సృష్టించును.
సృష్టి సౌందర్యము చూచుటకు సంస్కరింపబడిన కన్ను కలవాడై జీవు డుండవలెను. సృష్టియే ఇంత సుందరముగ నున్నప్పుడు సృష్టికి మూలమైన ఆమె ఎంత సౌందర్య వతియై యుండవలెను? ఆమె సౌందర్యము నుపాసించువారికి కలుగునది తాదాత్మ్యతయే. ఆమె సుందరి, త్రిపురసుందరి, మహా త్రిపుర సుందరి.
సుందరత్వమును దైవముగ ఆరాధించుట సూటియైన మార్గముగ పెద్దలు తెలుపుదురు. కృష్ణుని సౌందర్యము నారాధించి సరాసరి కృష్ణుని చేరిన గోప గోపీజను లట్టివారు. శ్రీ లలిత భక్తులు
కూడ అట్లే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 234 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Mahā-tripura-sundarī महा-त्रिपुर-सुन्दरी (234) 🌻*
She is described as the most beautiful woman of the three worlds. The three worlds are vyāhṛti-s (bhūr, bhuvaḥ, svar) of Gāyatri mantra.
The significance of the Tripurasundari form is the stage of the sādhaka where the knowledge, the knower and known are merged together to form one single entity, the Brahman. She produces all things that are in a threefold state. This is called Self-realization.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment