✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 37. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 11 -1 🌻
పరమగురువులతో మనకేర్పడిన పరిచయము గూర్చికాని, వ్యక్తిగతమైన అనుభూతుల గూర్చి కానీ యితరులకు తెలుపుట బాధ్యతా రహితమైన పని.
అత్యంత బాధ్యతాయుతముగ సంఘము నకు శ్రేయస్సు గలుగు కార్యములను నిర్వర్తించుటయేగాని, వారి నామములను బహిరంగముగా గాని, ఆత్మీయులనుకొను వారితో గాని, ముచ్చటించ గూడదనునది నేనెఱిగిన ఒక ముఖ్యసాధనా సూత్రము. న్యూయార్కునగరమున 'నొబిలిటీ క్లబ్' అను ఒక క్లబ్ వున్నది.
రష్యాకు చెందిన 'జార్ చక్రవర్తుల' వంశీయులలోని ఒక రాజు ఆ క్లబ్ లో ప్రసంగించనున్నాడని, నేను తప్పక ఆ ప్రసంగము వినుటకు హాజరు కావలయునని, నా మిత్రురాలు ఒకామె నాకు గట్టిగ తెలిపినది. నేను సమావేశమునకు హాజరైతిని.
ఎందరో ధనికులు, రాజవంశము వారు, పెద్ద పెద్ద అధికారులు సమావేశమున నుండిరి. అలెగ్జాండర్ అను పేరుగల జార్ రాజు సభలో ప్రవేశించు చుండగా అప్రయత్నముగ సభయంతయూ లేచి నిలబడి, ఆయన ఉన్నతాసనము నధిష్ఠించు వరకూ ఎవరునూ వారి వారి స్థానము లందు ఆసీనులు కాలేదు.
ఇట్టి సాంప్రదాయము బ్రిటిష్ మరియు ఏషియన్ నాగరికతలో కలదుగాని, అమెరికా వారికి లేదు. ప్రసంగము ప్రారంభించుచూ అలెగ్జాండర్ ఇట్లనిరి. “కొంత సేపు నేను రష్యాదేశపు రాజవంశీయుడనని మీరందరూ మీ మనస్సుల నుండి తొలగించండి.
ఒక జీవునిగ యితర జీవులతో ప్రసంగించుటకు నేను వచ్చితిని. ఈ సమావేశమున మన స్థితిగతులు అప్రస్తుతము.” పై వాక్యములు విని శరీరమంతయూ గగుర్పొడిచి నేను నిఠారుగా కూర్చొంటిని.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Mar 2021
No comments:
Post a Comment