శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 234 / Sri Lalitha Chaitanya Vijnanam - 234


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 234 / Sri Lalitha Chaitanya Vijnanam - 234 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥🍀

🌻 234. 'మహాత్రిపురసుందరీ' 🌻

త్రిపురములు, వాని తాదాత్మ్యతా సౌందర్యము గల సుందరి. త్రిపురములు సుందరములు. వాని తాదాత్మ్యత మహా సుందరములు. త్రిపురము లనగా మూడు పురములు. అవియే త్రిశక్తులు, త్రిగుణములు, త్రిమూర్తులు, త్రిలోకములు, త్రికాలములు.

ఇట్లు త్రికోణముగ సృష్టి నిర్మాణము జరుగుచుండును. ఇందు ప్రజ్ఞ, శక్తి, పదార్థము వినియోగ పడుచుండును. సృష్టి స్థితి లయము జరుగుచు నుండును. కర్త కర్మ క్రియ లేర్పడుచుండును. దేవతలు, దానవులు, మానవులు ఏర్పడుచుందురు. స్వర్గము, భూమి, నరకము ఏర్పడు చుండును. ఇట్టి త్రిగుణాత్మకమగు సృష్టిని త్రిపురము లందురు.

అందు పనిచేయు శక్తులు కూడ త్రిశక్తులే (ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు). తెలిసినవారికి త్రిపురములు అమితానందము కలిగించును. శ్రీదేవి సృష్టి నిర్మాణ చాతుర్యమును తాదాత్మ్యముతో అట్టివారు వర్ణించు చుందురు. నారద, తుంబురు లట్టివారే.

శ్రీమాత ప్రజ్ఞగను, కొలతగను, కొలుచు శక్తిగను తానే త్రిపుటి యగును. తానే త్రిపుటియై సమస్త సృష్టి కార్యమును నైపుణ్యముతో నిర్మించుటయే కాక సౌందర్యముగ కూడ సృష్టించును.

సృష్టి సౌందర్యము చూచుటకు సంస్కరింపబడిన కన్ను కలవాడై జీవు డుండవలెను. సృష్టియే ఇంత సుందరముగ నున్నప్పుడు సృష్టికి మూలమైన ఆమె ఎంత సౌందర్య వతియై యుండవలెను? ఆమె సౌందర్యము నుపాసించువారికి కలుగునది తాదాత్మ్యతయే. ఆమె సుందరి, త్రిపురసుందరి, మహా త్రిపుర సుందరి.

సుందరత్వమును దైవముగ ఆరాధించుట సూటియైన మార్గముగ పెద్దలు తెలుపుదురు. కృష్ణుని సౌందర్యము నారాధించి సరాసరి కృష్ణుని చేరిన గోప గోపీజను లట్టివారు. శ్రీ లలిత భక్తులు కూడ అట్లే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 234 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā-tripura-sundarī महा-त्रिपुर-सुन्दरी (234) 🌻

She is described as the most beautiful woman of the three worlds. The three worlds are vyāhṛti-s (bhūr, bhuvaḥ, svar) of Gāyatri mantra.

The significance of the Tripurasundari form is the stage of the sādhaka where the knowledge, the knower and known are merged together to form one single entity, the Brahman. She produces all things that are in a threefold state. This is called Self-realization.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2021

No comments:

Post a Comment