వివేక చూడామణి - 44 / Viveka Chudamani - 44
🌹. వివేక చూడామణి - 44 / Viveka Chudamani - 44 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. 14. శరీరము - 2 🍀
157. ఆత్మ నిజమైన సత్యము కావున అవి శరీరము కంటే వేరైనది. దాని గుణాలు, దాని పనులు, దాని స్థితులు అనేవి దాని సాక్షి స్థితికి ఉదాహరణ.
158. ఈ శరీరము ఎములు, మాంసము మరియు వ్యర్ధములతో నిండి పూర్తిగా అపవిత్రమైనది. కాని స్వయం స్థితమైన ఆత్మ అన్ని తానే అయి ఈ శరీరము కంటే భిన్నమైనది.
159. మూర్ఖుడైన మనిషి తాను శరీరముగానే భావించి, చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు మరియు కల్మషాలతో నిండి ఉన్నాడు. కాని మంచి, చెడుల భేదముల గ్రహించిన వ్యక్తి తాను శరీరము కాదు ఆత్మనని తెలుసుకొని, కేవలము తానే సత్యమని ఈ శరీరమునకు వేరుగా ఉన్నానని తెలుసుకొనును.
160. మూర్ఖుడైన వ్యక్తి తాను శరీరమని తలచగా, పుస్తక జ్ఞానము కలిగిన వాడు తాను శరీరము మరియు ఆత్మ యొక్క సంమ్మేళనమని భావించగా, యోగి తాను మంచి, చెడులకు భేదములను తెలుసుకొని పరమాత్మయే తానని గ్రహించి తనను తాను బ్రహ్మముగా భావించును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 44 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Body - 2 🌻
157. That the Atman as the abiding Reality is different from the body, its characteristics, its activities, its states, etc., of which It is the witness, is self-evident.
158. How can the body, being a pack of bones, covered with flesh, full of filth and highly impure, be the self-existent Atman, the Knower, which is ever distinct from it ?
159. It is the foolish man who identifies himself with a mass of skin, flesh, fat, bones and filth, while the man of discrimination knows his own Self, the only Reality that there is, as distinct from the body.
160. The stupid man thinks he is the body, the book-learned man identifies himself with the mixture of body and soul, while the sage possessed of realisation due to discrimination looks upon the eternal Atman as his Self, and thinks, "I am Brahman".
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
11 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment