విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 334, 335 / Vishnu Sahasranama Contemplation - 334, 335


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 334 / Vishnu Sahasranama Contemplation - 334 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ🌻


ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM Ādidevāya nam

ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

ఆదిర్హేతుస్స దేవశ్చ ద్యోతనాదిగుణీత్వతః ।
ఇత్యుచ్యతే విష్ణురాదిదేవ శబ్దేన పండితైః ॥

ఆదియు, ఆదికారణమును, మునుపటినామమునందు జెప్పినవిధమున ప్రకాశించుట మొదలగు లక్షణములకు ఆస్పదమయిన దేవుడును కావున పండితులు ఆ విష్ణుని - ఆదిదేవునిగా పిలుచుచుందురు.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::

త్వమాదిదేవః పురుషః పురాణ స్త్వమస్య పరం నిధానమ్ ।
వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనన్తరూప ॥ 38 ॥

అనంతరూపుడగు ఓ కృష్ణా! నీవు ఆదిదేవుడవు, సనాతపురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తము తెలిసికొనినవాడునూ, తెలియదగినవాడును, సర్వోత్తమస్థానమును అయియున్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 334🌹

📚. Prasad Bharadwaj

🌻334. Ādidevaḥ🌻


OM Ādidevāya nam

Ādirhetussa devaśca dyotanādiguṇītvataḥ,
Ityucyate viṣṇurādideva śabdena paṃḍitaiḥ.

आदिर्हेतुस्स देवश्च द्योतनादिगुणीत्वतः ।
इत्युच्यते विष्णुरादिदेव शब्देन पंडितैः ॥

Since Lord Viṣṇu is ādi or primal and as highlighted in the explanation of previous divine name, due to His illumining the universe He is deva or god. Hence the learned address Him as Ādidevaḥ or primal Deity.

Śrīmad Bhagavad Gīta - Chapter 11

Tvamādidevaḥ puruṣaḥ purāṇa stvamasya paraṃ nidhānam,
Vettā’si vedyaṃ ca paraṃ ca dhāma tvayā tataṃ viśvamanantarūpa. (38)


:: श्रीमद्भगवद्गीत विश्वरूपसंदर्शन योग ::

त्वमादिदेवः पुरुषः पुराण स्त्वमस्य परं निधानम् ।
वेत्ताऽसि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ॥ 38 ॥

You are the primal Deity, the ancient Person; You are the supreme Resort of this world. You are the knower as also the object of knowledge and the supreme Abode. O Kr̥ṣṇā! You of infinite forms, the Universe is pervaded by you!

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 335 / Vishnu Sahasranama Contemplation - 335🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻335. పురన్దరః, पुरन्दरः, Purandaraḥ🌻


ఓం పురన్దరాయ నమః | ॐ पुरन्दराय नमः | OM Purandarāya namaḥ

పురన్దరః, पुरन्दरः, Purandaraḥ

పురాణామ్ సురశత్రూణాం దారణాత్ స పురందరః దేవ శత్రువుల పురములను బ్రద్దలు చేయును.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::

సీ. తోయజ హిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు
కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ సంపుట లసన్మౌక్తికంబు
నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ కార విస్ఫురిత పంకరుహసఖుఁడు
దశరథేశ్వర కృతధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు
తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు
నగుచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు. (155)

చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమచందురుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యం. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 335🌹

📚. Prasad Bharadwaj

🌻335. Purandaraḥ🌻

OM Purandarāya namaḥ

Purāṇām suraśatrūṇāṃ dāraṇāt sa puraṃdaraḥ / पुराणाम् सुरशत्रूणां दारणात् स पुरंदरः He destroys the Purās or cities of the enemies of the gods.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 7

Yasmā adādudadhirūḍabhayāṅgavēpō mārgaṃ sapadyaripuraṃ haravaddidakṣōḥ,
Dūrē suhr̥inmathitarōṣasuśōṇadr̥iṣṭayā tātapyamānamakarōraganakracakraḥ. 24.


:: श्रीमद्भागवत - द्वितीयस्कनधे सप्तमोऽध्यायः ::

यस्मा अदादुदधिरूडभयाङ्गवेपो मार्गं सपद्यरिपुरं हरवद्दिदक्षोः ।
दूरे सुहृन्मथितरोषसुशोणदृष्टया तातप्यमानमकरोरगनक्रचक्रः ॥ २४ ॥


Lord Rāmacandra, being aggrieved for His distant intimate friend (Sīta), glanced over the city of the enemy Rāvaṇa with red-hot eyes like those of Hara. The great ocean, trembling in fear, gave Him His way because its family members, the aquatics like the sharks, snakes and crocodiles, were being burnt by the heat of the angry red-hot eyes of the Lord.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹


11 Mar 2021

No comments:

Post a Comment