🌹 . శ్రీ శివ మహా పురాణము - 195 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 2 🌻
పక్వాన్న గంధమాఘ్రామ యజ్ఞదత్తాత్మజో ద్విజః | పితృత్యక్తో మాతృహీనః క్షిధితస్స తమన్వ గాత్ || 12
ఇదమన్నం మయా గ్రాహ్యం శివాయోపకృతం నిశి | సుప్తే శైవజనే దైవాత్సర్వస్మిన్ వివిధం మహత్ || 13
ఇత్యాశామవలంబ్యాథ ద్వారి శంభోరుపావిశత్ |దదర్శ చ మహాపూజాం తేన భక్తేన నిర్మితామ్ || 14
విధాయ నృత్యగీతాది భక్తాస్సుప్తాః క్షణ యదా | నైవేద్యం సతదాదాతుం భర్గాగారం వివేశ హ || 15
తండ్రిచే విడువబడి, తల్లి లేక ఆకలి గొనియున్న ఆ యజ్ఞదత్తపుత్రుడగు బ్రాహ్మణుడు ఆహారపదార్ధముల గంధము నాఘ్రాణించి అతని వెనుకనే వెళ్లెను (12).
శివభక్తులు ఈ అన్నమును శివునకు నివేదన చేసి రాత్రి యందు నిద్రించగనే, నేను ఈ వివిధములగు దివ్యమైన వంటకములను పరిగ్రహించెదను (13). అతడీ తీరున ఆ శించిన శివసన్నిధిలో ద్వారము నందు కూర్చుండి, ఆ భక్తుడు చేసిన మహాపూజను దర్శించెను (14).
ఆ భక్తులు నాట్యములను చేసి, పాటలను పాడి నిద్రించగనే; ఆ నైవేద్యమును గ్రహించుటకు ఆతడు శివసన్నిధిలోనికి ప్రవేశించెను (15).
దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న వీక్షణాయ సః | నిజచైలాంచలాద్వర్తిం కృత్వా దీపం ప్రకాశ్య చ || 16
యజ్ఞదత్తత్మా జస్సోsథ శివనైవేద్యమాదరాత్ | జగ్రాహ సహసా ప్రీత్యా పక్వాన్నం బహుశస్తతః || 17
తతః పక్వాన్న మాదాయ త్వరితం గచ్ఛతో బహిః | తస్య పాదతలాఘాతాత్ర్పసుప్తః కోsప్యబుధ్యత|| 18
కోsయం కోsయం త్వరాపన్నో గృహ్యతాం గృహ్యతా మసౌ | ఇతి చుక్రోశ స జనో గిరా భయమహోచ్చయా || 19
యావద్భయాత్సమాగత్య తావత్స పురరక్షకైః | పలాయమానో నిహతః క్షణా దంధత్వ మాగతః || 20
ఆతడు ఆ వివిధ ఆహారపదార్థములను చూడబోగా దీపకాంతి తగినంత లేకుండెను. ఆతడు తన ఉత్తరీయము నుండి వస్త్ర శకలమును చింపి వత్తిని చేసి దీపమును ప్రకాశింపజేసెను (16).
ఆపుడా యజ్ఞదత్తుని పుత్రుడు వివిధములైన వంటకములుగల శివనైవేద్యమును ప్రీతితో ఆదరముతో స్వీకరించెను (17).
ఆతడు ఆహారమును తీసుకొని త్వరితముగా బయటకు వెళ్లుచుండగా కాలు తగిలి నిద్రపోవుచున్న వ్యక్తి యొకడు తెలివిని పొందెను (18).
ఎవరు వారు? ఎవరు వారు? వానిని తొందరగా పట్టుకొనుడు, పట్టుకొనుడు అని ఆతడు భయముతో పెద్ద స్వరముతో అరచెను (19).
గుణనిధి భయపడి పరుగెత్తుచుండగా రక్షక భటులు కొట్టిరి. అతడు పడిపోయెను. మరియు చూపును కోల్పోయెను (20).
అభక్షయచ్చ నైవేద్యం యజ్ఞదత్తాత్మజో మునే | శివానుగ్రహతో నూనం భావిపుణ్యబలాచ్చ సః || 21
అథ బద్ధ స్సమాగత్య పాశముద్గరపాణి భిః | నినీషు భి స్సంయమనీం యామ్యైస్స వికటెర్భటైః || 22
తావత్పారిషదాః ప్రాప్తాః కింకిణీ జలమాలినః | దివ్యం విమాన మాదాయ తం నేతుం శూల పాణయః || 23
ఓమహర్షీ! ఆ యజ్ఞదత్త కుమారుడు శివుని అనుగ్రహము వలన, మరియు లభించబోవు పుణ్యము యొక్క ప్రభావము వలన నైవేద్యమును భక్షించి మరణించెను (21).
అపుడు భయంకరాకారులు, పాశము ముద్గరము అను ఆయుధములను ధరించిన వారునగు యమభటులు అచటకు వచ్చి ఆతనిని బంధించి యమపురికి తీసుకొని పొవనుద్యమించిరి (22).
ఇంతలో చిరుగంటల మాలలను ధరించిన, చేతియందు శూలనముగల శివగణములు ఆతనిని తీసుకొని వెళ్లుటకై దివ్యవిమానమును తీసుకొనివచ్చిరి (23).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment