కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 26

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 26 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 14 🌻

చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పర భిన్నమో - భిన్నము అంటే అర్ధం ఏమిటంటే ఒకటుంటే ఒకటుండదు. వెలుతురున్నప్పుడేమో చీకటుండదు. చీకటున్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు.

అట్లాగే అవివేకం వున్నప్పుడు వివేకం కలిగే అవకాశం లేదు. కారణమేమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం వుంటుంది. ఒక వడి వుంటుంది. అదొకసారి కలిగితే నిన్ను స్థిరంగా వుండనివ్వదు. ఉదాహరణ చెప్తాను.

మీఅందరిలో మీ అందరి జీవితాలలో తాజ్ మహల్ చూసినవాళ్ళు ఎవరు అంటే కొంతమంది చూశామని కొంతమంది చూడలేదని చెప్తారు. చూడకపోతే ఏమిటయ్యింది అన్న ప్రశ్న వేసుకున్నామనుకో తాజ్ మహల్ చూడకపోతే జీవితం వ్యర్ధం. అట్లాగే నేను కాలేజిలో చదివే కాలంలో మరోచరిత్ర సినిమా చూశావా అన్నారు.

నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. నేను చూడలేదు. అయితే నీ జీవితం సగం వృధా అనేవాళ్ళు. అంటే అర్ధం ఏమిటీ అంటే, ఈ ప్రేయోమార్గములో వున్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు.

ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖంవైపు మిడత వలే ఆకర్షించబడతాడు. ఆకర్షించబడి శలభం ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో దీపశిఖ మీద పడి, అట్లాగే దీపపు పురుగువలే అయిపోతాడనమాట. అర్ధమైందా? ఈ రకమైనటువంటి బంధకారణము ఈ ప్రేయోమార్గములో వుంది.

అందువలననే ఈ ప్రేయోమార్గమును అవిద్య అన్నారు. ఎందుకనిట అంటే ఈ అవిద్యకు మూలం లేదు. ఇది అనాది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment