🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 1 🌻
వంశము: వసిష్ఠమహర్షి(తాత), శక్తి(తండ్రి)
భార్య(లు): సత్యవతి
కుమారులు/కుమార్తెలు: వ్యాసమహర్షి
కాలము: భౌగోళిక ప్రాంతములు: బదరికాశ్రమం
నదులు: యమున
బోధనలు/గ్రంధాలు: పరాశరస్మృతి, పరాశరగీత, వృద్ధపరాశరహోర
🌻. జ్ఞానం:
1. కలియుగంలో మనం అవలంబించిన స్మృతి ‘పరాశరస్మృతి’ అని నిర్ణయం జరిగింది. ఈ స్మృతికారకుడు పరాశరమహర్షి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి ఎందుకుండాలి అంటే, మనుష్యులయొక్క శక్తిసామర్థ్యాలు అన్ని యుగాలలోను ఒకేవిధంగా ఉండవు.
2. మనకు నేడు 80 ఏళ్ళు పూఋనాయుర్దాయం అనుకుంటే, 20 ఏళ్ళు యౌవనం ఉంటుంది. అప్పుడే మనిషికి సంసారతాపత్రయం మొదలు. సంసారం, పిల్లలను కనటం, ఇల్లు వాకిలి ఏర్పాటు మొదలైనవి. 60 ఏళ్ళకు వార్ధక్యం మొదలు.ఈ ధర్మాచరణ అనేది ఆయువునుబట్టి, ఆయుర్దాయకాలంలో ఉండే మనోబలం, శరీర దారుఢ్యం, జీర్ణశక్తి, ఆకలిని తట్టుకునేశక్తి వాటినిబట్టి నిర్నయించబడుతుంది. ధర్మాలు జీవనవిధానంలో భాగం కాబట్టి.
3. కాబట్టి ఈ శరీరమెంత శక్తిసామర్థ్యాలతో ఉండినా, మనకు మానసిక బలంకూడా అవసరం. ధ్యానశక్తిగాని, యోగశక్తిగాని, ఏకాగ్రతయొక్క శక్తి సామర్థ్యాలుగాని, మనస్సును ఒక వస్తువునందు లగ్నంచేయాలి అంటే – ఇవి అన్ని యుగాలలోనూ, అందరు మనుష్యులలోనూ ఒకేలా ఉండవు.
4. కాబట్టి ఆ యుగములనుబట్టి, వ్యక్తులనుబట్టి ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు, నిర్దేశించబడ్డాయి. మళ్ళీ అన్ని ధర్మాలకూ గమ్యస్థానంమాత్రం ఒక్కటే! ఏ మార్గంలో జీవిస్తే చిట్టచివరకు ఈ ప్రపంచ జీవనం మీద కొంత వైముఖ్యము, జ్ఞానలో అభివృద్ధి, వైరాగ్యము, జ్ఞానేఛ్ఛ – ఈట్లాంటివన్నీ ఎలా జీవిస్తే కలుగుతాయో, అట్లా జీవించడంకోసమే ధర్మం. అధర్మంలో ఉండేవాడికి ఎప్పుడూ ఆశలే! ఎప్పుడూ బాధలే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment