శ్రీ మదగ్ని మహాపురాణము - 66

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 27

🌻. దీక్షా విధి - 7 🌻

హోమేన శోధయేత్పశ్చాత్సంహార క్రమయోగతః | యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః. 63

శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్‌ | అగ్నౌ ప్రాకృతికే విష్ణౌ లయం నీత్వాధిదైవికే. 64

శుద్దం తత్త్వమశుద్ధేన పూర్ణాహుత్యా తు సాధయేత్‌ |

పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.

శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ధ్వా ప్రాకృతికాన్‌ గుణాన్‌. 65

మోచయే దధికారే వా నియుంజ్యాద్ధేశికః విశూన్‌ |

ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.

అథాన్యాం శక్తి దీక్షాం వా కుర్యాద్భావే స్థితో గురుః. 66

భక్త్యా సంప్రతిపన్నానాం యతీనాం నిర్ధనస్య పచ | సంపూజ్య స్థణ్డిలే విష్ణుం పార్శ్వస్థం స్థాప్య పుత్రకమ్‌. 67

దేవతాభిముఖః శిష్యస్తిర్యగాస్యః స్వయం స్థితః | అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్త్వెర్వికల్ఫతమ్‌. 68

శిష్యదేహే తథా దేవమాదిదైవిక యాజనమ్‌ | ధ్యానయోగేన సంచిన్త్య పూర్వవత్తాడనాదినా. 69

క్రమాత్తత్త్వాని సర్వాణి శోధయేత్థ్సణ్డిలే హరౌ |

లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను.

శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.

తాడనేన వియోజ్యాథ గృహీత్వాత్మని తత్పరః. 70

దేవే సంయోజ్య సంశోధ్య గృహీత్వా తత్స్వభావతః | ఆనీయ శుద్దభావేన సన్ధయిత్వా క్రమేణ తు. 71

శోధయేద్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా |

పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను.

శుద్ధేషు సర్వతత్త్వేషు ప్రధానే చేశ్వరే స్థితే. 72

దగ్ఠ్వా నిర్వాపయేచ్ఛిష్యాన్‌ పదే చైశే నియోజయేత్‌ | నినయేత్సిద్దిమార్సే వా సాధకం దేశికోత్తమః. 73

సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను.

ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతన్ద్రితః | ఆత్మానం శోధయంస్తిష్ఠే ద్యావద్రాగక్షయో భవేత్‌. 74

అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను.

క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్ధకిల్బిషః | ఆరోప్య పుత్రే శిష్యే వాహ్యధికారం తు సంయమీ. 75

దగ్ధ్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః | శరీరపాతమాకాజ్‌క్షన్నా సీతావ్యక్త లిఙ్గవాన్‌. 76

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశోధ్యాయః.

తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను.

అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment