నారద భక్తి సూత్రాలు - 62

🌹. నారద భక్తి సూత్రాలు - 62 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రథమాధ్యాయం - సూత్రము - 36

🌻. 36. అవ్యావృత భజనాత్‌ ॥ - 2 🌻

చైతన్యప్రభు మతం ప్రకారం శ్రీకృష్ణ సంకీర్తనం వలన సర్వోత్కృష్టమైన ఆత్మానందం కలుగుతుంది. ఒక్కసారి ఆత్మానందానుభూతి కలిగితే

(1) అద్దం పై ధూళి తుడిచినట్లు చిత్త మాలిన్యం తుడిచి వేయబడుతుంది.

(2) ప్రాపంచిక విషయ భోగవాంఛలు చల్లారిపోతాయి.

(3) శుభప్రదమైన భక్తిపుష్ప వికసన జరిగి భగవదనుగ్రహం పొందుతాడు.

(4) భగవంతుడిని తెలుసుకొని భాగవతుడవుతాడు.

(5) ఆనంద సాగరంలో తేలియాడుతాడు.

(6) భక్తుడు పలికె ప్రతి పదం అమృతాన్ని పంచి పెడుతుంది.

(7) సకల జీవాత్మల శుద్ధి జరుగుతుంది.

(8) అది అద్వితీయ, నిరతిశయ ఆనందమే.

(9) సాధనయందు విజయాన్ని

చెకూరుస్తుంది. ఫలితంగా భక్తి ప్రతిష్టతమవుతుంది..

హృదయపూర్వక సంకిర్తనలో మైమరచిన వాడికి అలసట ఉండదు.

మానసికాన్ని దాటే వరకే ఆవృత భజన అవసరమవుతుంది. భక్తి సాధన ఏ ఒక్కటైనా సరె దానికది ఉత్తమ ఫలితాన్నిస్తుంది. అయితే చిత్త శుద్ధితో ప్రయత్నం చేస్తేనే అది ఫలిస్తుంది.

ఆ వృత్తిః అసకృ దుపదెశాత్‌
- బ్రహ్మ సూత్రం

అనగా సాధనను పదే పదే చేయమని బోధిస్తుంది. దీనినె భగవద్దీత అభ్యాస యోగం అంటుంది. పదె పదే చెసి అలవాటు చేసుకొని, సహజం చెసుకొంటే అదే అభ్యాస యోగమవుతుంది. అనగా భక్తిని శీలించడం అని కూడా అంటారు.

శ్రీమత్‌ భాగవతాన్ని పరీక్షిన్మహారాజు శ్రీశుకుని వద్ద నిరంతర శ్రవణం చేయడం వలన ముక్తుడయ్యాడు. నిరంతర భగవన్నామ సంకిర్తన వలన తుంబురుడు, తెంపులిని నారాయణ నామ స్మరణ వలన నారదుడు ముక్తులయ్యారు.. విడువకుండా విష్ణుపాద సేవనం వలన లక్ష్మిదేవి ఆయనతో సాయుజ్యం పొందింది..

పృథు చక్రవర్తి అర్చన చెస్తూ చేస్తూ శివైక్కత పొందాడు. నిరంతర వందనం వలన ఆక్రూరుడు, దాస్య భక్తివలన హనుమంతుడు, సఖ్యంచేత అర్జునుడు, ఉద్ధవుడు మోక్షమందిరి. వీరందరూ ఏదో ఒక సాధన నిర్విరామంగా జరపడం వలన సహజ భక్తులైరి. తుదకు ముక్తి పొందారు.

మనమైతే ఏదో ఒక సాధన చెసి తరించడం కష్టం గనుక అన్ని మార్తాలను ప్రయత్నం చెస్తూ కొన్నింటిని ఆవృతం చేసుకుంటే మంచిది. కించిత్‌ విరామం ఇస్తే అథోగతేనని ఈ సూత్రం హెచ్చరిస్తున్నది.

న్వాధ్యాయా ద్యోగమాసీత యోగా త్స్వాధ్యాయమావ సేత్‌
స్వాధ్యాయ యోగ సంపత్వా పరమాత్మ ప్రకాశతే |
-విష్టు పురాణం

తాః స్వాధ్యాయం, పవిత్ర గ్రంథాలను పఠించడం, యోగం, సమాధానం, ధ్యానం, మయొదలగునవి నిరంతరం చెస్తూ రాగా, పరమాత్మ దర్శనమౌతుంది..

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment