🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 83 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 2 🌻
5. ధర్మాచరణ మనిషి యొక్క ప్రగతికి దోహదం చేసేటటువంటి మార్గం. యుగధర్మాలన్నీ మనుష్యుల శక్తినిబట్టి ఏర్పడ్డాయి. దాన్నే యుగధర్మం అంటున్నాం. ఈశ్వరాజ్ఞ తెలిసిన ఋషులు అలా నిర్ణయంచేసారు.
6. కృతయుగంలో మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతముడి ధర్మశాస్త్రం ఉండేవట, ద్వాపరయుగంలో శంఖలిఖితుల(స్మృతి)ధర్మమే ప్రవర్తించింది. కలిలో శంఖలిఖితుల ధర్మం పాటించగల శక్తిసామర్ధ్యాలు మనకు లేవుకాబట్టి కలిలో ‘పరాశరస్మృతి’ నిర్ణయించబడింది.
పరాశరుడు ఈ కాలానికి అనుగుణమైన కొన్ని నియమాలు చెప్పాడు. కాబట్టి ఈ యుగానికి ధర్మశాస్త్రకర్త పరాశరుడని తెలుసుకోవాలి.
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
7. అలా వ్యాసుడి స్మరణ చేస్తాము. ఆయన పైతరాలు – ఆయ్న తాత ఎవరు? తండ్రి ఎవరు? కొడుకు ఎవరు? ఇంతమందిని చెప్పారు శ్లోకంలో. వ్యాసుడుని నమస్కరించాలంటే, ఆయన ముత్తాత వసిష్ఠుడు; తాతయైన – అంటే వసిష్ఠుడి కొడుకైన శక్తి; తండ్రియైన పరాశరుడు; కొడుకైన శుకుడు – ఇంతమందిని స్మరించి, “…అట్టి వ్యాసుడికి నమస్కారం” అని చెప్పబడింది.
8. తండ్రి, తాత, ముత్తాత, ముగ్గురిపేర్లు చెప్పి ఆయన కొడుకు ఎవరో చెపితేనే, వారి వంశం ఎంత ఉత్తమమైనదో తెలుస్తుంది. వాళ్ళ శక్తిసామర్థ్యాలేమిటి? ఎలాంటివాళ్ళు వాళ్ళూ! వాళ్ళను స్మరించే అధికారమైనా మంకుందా అని ఆలోచన వస్తుంది! అంతటి ఉన్నతుల వారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment