🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్దా ధ్యాయము
🌻. శివ ప్రాదుర్భావము - 6 🌻
దక్షిణే మూషకా రూడం - గణేశం సర్వతో పమమ్,
మయూర వాహనా రూడ - ముత్తరే షణ్ముఖం తధా 44
మహా కాలంచ చండీశం -పార్శ్వ యోర్భీ షనాకృతిమ్,
కాలాగ్ని రుద్రం దూరస్థం - జ్వలద్దావాగ్ని సన్నిభమ్ 45
త్రిపాదం కుటిలాకారం - నట ద్బ్రుం గిరిటం పురః,
నానా వికార వదనా - న్కోటిశః ప్రమదాదిపాన్ 46
దక్షిణపు దిక్కున పర్వతో పమానం బైన మూషిక వాహనారూడుండైన విఘ్నేశ్వరుని, ఉత్తరపు దిక్కున మయూర వాహనా రూడుం డైన షణ్ముఖ స్వామిని, ఇరు పార్శ్వముల యందు భీషణా కారములు గల మహాకాలుని , చండీశ్వరుని, మరియు బడబాగ్ని ని వలె దూరమున నున్న కాలాగ్ని రుద్రుని, అగ్రభాగమున మూడు పాదములు కలిగి వంకలు దిరిగిన యాకృతి కలిగి నాట్యము చేయుచున్న బృంగీశ్వరుని నానా ప్రకారము లైన ముఖములు కల అసంఖ్యాక ప్రమధ గణాది పతులను చూచెను.
నానావాహన సంయుక్తం - పరితో.మాతృ మండలమ్,
పంచాక్షరీ జపా సక్తాన్ - సిద్ద విద్యాధ రాదికాన్ . 47
దివ్య రుద్ర కగీతాని - గాయత్కిన్నరబృందక మ్,
తత్ర త్రైయంబకం మంత్ర - జపద్ద్విజ కదంబకమ్ 48
గాయంతం వీణయా గీతం - నృత్యం తం నారదం దివి,
నృత్యతో నాట్య నృత్యేన - రంభా దీన ప్సారో గణాన్ 49
గాయచ్చిత్ర రధా దీనాం- గంధర్వాణాం కదంబకమ్,
కంబళాశ్వత రౌశంభు - కర్ణ కుండల తాం గతౌ 50
గయంతౌ పన్నగౌ గీతం - కపాలం కంబలం తధా,
ఏవం దేవ సభాం దృష్ట్యా - కృతార్దో రఘు నందనః 51
హర్ష గద్గద యావాచా -స్తువ న్దేవం మహేశ్వరమ్,
దివ్య నామ సహస్రేణ - పరణ నామ పునః పునః 52
ఇతి శ్రీ పద్మ పురానే శివ గీతాయా చతుర్దో ధ్యాయః
సర్వత్ర వాహనము తోడ నున్న మాతృ సమూహమును పంచాక్షరీ మహా మంత్రమును పటించు సిద్ద విధ్యాధరాదులను , రుద్ర గీతాలను గానము చేయుచున్న కిన్నరులను త్ర్యంబకాది మంత్రములను పటించు ద్విజాతి సమూహమున, నృత్యము చేయుచున్న రంభాదులను వీణలు మీటుతూ గీతముల నాలపించు ఆకాశములో నాట్యము చేయుచున్న నారదుని చూచెను. సంగీతము నాలపించు చున్న చిత్ర రధాది గంధర్వులను, శివునకు గర్నా లంకారము లైన కంబళాశ్వతరులను శివ గీతాలను గానం చేయు కపాల కంబలు లను మహా నాగములను, ఇట్లే అచట నున్న దేవ సభను గాంచి శ్రీరాముడు క్రుతార్దుడై పెల్లుబికిన సంతోషము తోడ గద్గద స్వరముతో వేద సార సహస్రనామముల నుచ్చరించుచు మహాదేవుని స్తోత్రము చేయుచు మాటి మాటికి బ్రణామంబుల గావించెను.
ఇతి వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతంబైన శివ గీతలో నాలుగవ అధ్యాయము పరి సమాప్తము
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝒯𝒽𝑒 𝒮𝒾𝓋𝒶-𝒢𝒾𝓉𝒶 - 𝟥𝟢 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ 𝓐𝔂𝓪𝓵𝓪𝓼𝓸𝓶𝓪𝔂𝓪𝓳𝓾𝓵𝓪.
📚. 𝓟𝓻𝓪𝓼𝓪𝓭 𝓑𝓱𝓪𝓻𝓪𝓭𝔀𝓪𝓳
Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 6 🌻
Towards the southern direction of Mahadeva, was seated Lord Vighneshwara on his mouse and was as huge as a mountain. Towards the northern direction was seen the six faced Lord Skanda.
Further, towards the left and right sides of Parameshwara, was seen Mahakala and Chandeeshwara and at sone distance was sighted the great blazing deity of dissolution viz. Kalagni Rudra.
In the front side was beheld the three legged Bringi dancing along with other ganas of diversely looking faces.
All around many divine mothers were seen seated on their respective vehicles, divine beings were seen chanting Panchakshari maha Mantra, Kinnaras were seen singing songs of Rudra, divine Brahmanas were seen chanting Triyambaka mantras, Rambha et al were seen dancing, Narada was seen playing his Veena (musical instrument) and dancing in the sky, Gandharvas and their king Chitraradha was seen singing classical music, and all other gods of heaven, heavenly snakes and other deities were seen all around blissfully singing songs of Shiva.
Seeing this beautiful scene, there was no limits to Sri Rama's ecstasy.
And with a wet throat filled with boundless happiness he started chanting Shiva Sahasranama and eulogized Mahadeva with numerous salutations.
Here ends the fourth chapter of Shiva Gita present in Uttara Khanda of Padma Purana
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment