🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 27 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 15 🌻
మరి శ్రేయోమార్గమో. అది విద్య. జ్ఞానం. అదీ అనాదే. ఆ జ్ఞానము కూడా అనాదే. కాబట్టి శరీరాన్ని మార్చిన ప్రతిసారీ నీతో వచ్చేవేమిటయ్యా అంటే ఈ జ్ఞానాజ్ఞానములే నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు మార్పు చెందేటప్పుడు వచ్చేటటువంటి వారసత్వ సంపద.
దీనినే మనం ఇప్పుడు లేటెస్ట్ [latest] గా నూతనమైన విజ్ఞాన పధంలో జీన్ థియరీ [gene theory] ని డెవెలప్ [develop] చేశాం మనం. అధ్యయనం చేశాం. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాజ్ఞాములు రెండూ ప్రాప్తిస్తున్నాయి. మరి ఏం చెయ్యాలండీ? ప్రయత్నం చేసి దీనిని మార్చవచ్చు. దీనిని మ్యుటేట్ [mutate] చెయ్యవచ్చు అని నిరూపించారు.
ఏ రకమైనటువంటి స్వభావంతో కూడినటువంటి వ్యక్తైనా ప్రయత్నశీలుడై, శ్రద్ధాభక్తి కలిగి, విశ్వాసం కలిగి తపస్సు చేసినట్లయితే దాని కొరకు, లక్ష్యము కొరకై తపించుట. తపస్సు అనగా ఇంద్రియములను ఇంద్రియార్ధములందు ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే వుంచుటకు తపించుట.
మీరది చెట్టు క్రిందే చేస్తారో, ఇంట్లోనే చేస్తారో, సంధ్యాసమయంలోనే చేస్తారో, నిద్రాసమయంలోనే చేస్తారో, జీవితకాలం అంతా చేస్తారో, ఒక్క క్షణమే చేస్తారో ఇదంతా మీ శక్తిసామర్ధ్యములను బట్టి ఆధారపడి వుంటుంది. కాబట్టి నీవు ఆ తపింపజేసేటటువంటి లక్షణం గనుక నీలో లేకపోయినట్లయితే , ఆ తహ నీలో లేకపోయినట్లయితే , ఆ శ్రద్ధాభక్తులు లేకపోయినట్లయితే , ఆ దైవీ సంపద లేకపోయినట్లయితే నీవు అవివేకియై మోక్షమునకు దూరమై ప్రేయోమార్గమున పడిపోతావు. ఎప్పటికప్పుడు జగద్ వ్యాపారమునకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభపెడతాయి. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ #సద్గురువిద్యాసాగర్
No comments:
Post a Comment