రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 3 🌻
శివగణా ఊచుః |
ముంచతైనం ద్విజం యామ్యా గణాః పరమధార్మకమ్ | దండ యోగ్యో న విప్రోsసౌ దగ్ద సర్వాఘ సంచయః || 24
ఇత్యాకర్ణ్య వచస్తే హి యమరాజగణాస్తతః | మహాదేవగణానాహుర్బ భూవశ్చకితా భృశమ్ || 25
శంభోర్గణానథాలోక్య భీతైసై#్తర్యమకింకరైః | అవాది ప్రణతైరిత్థం దుర్వృత్తోsయం గణా ద్విజః || 26
శివగణముల వారిట్లనిరి |
యమగణములారా! గొప్ప ధార్మికుడగు ఈద్విజుని విడువుడు. ఈ విప్రుడు శిక్షకు అర్హుడు కాడు. ఈతని పాపములన్నియూ నశించినవి (24).
ఈ మాటను విన్న యమగణముల వారు ఆశ్చర్యమగ్నులై మహాదేవగణముల వారతో ఇట్లు మాటలాడిరి (25).
శంభుగణములను చూచి భయపడిన యమగణముల వారు నమస్కరించి "ఓ గణములారా! ఈ ద్విజుడు దుర్మార్గుడు"అని పలికిరి (26)
యమగణా ఊచుః |
కులాచారం ప్రతీర్యైష పిత్రోర్వాక్యపరాఙ్ముఖః సత్యశౌచపరిభ్రష్టస్సంధ్యాస్నాన వివర్జితః || 27
అస్తాం దూరేస్య కర్మాన్యచ్ఛివనిర్మాల్యలంఘకః | ప్రత్యక్షతోsత్ర వీక్షధ్వ మస్పృశ్యోsయం భవాదృశామ్ || 28
శివనిర్మాల్య భోక్తారశ్శివ నిర్మాల్య లంఘకాః | శివనిర్మాల్య దాతార స్స్పర్శస్తేషాం హ్యపుణ్యకృత్ || 29
విషమాలోక్య వా పేయం శ్రేయో వా స్పర్శనం పరమ్ | సేవితవ్యం శివస్వం న ప్రాణౖః కంఠగతైరపి || 30
యమగణములిట్లు పలికిరి -
ఈతడు కులాచారము నుల్లఘించి తల్లిదండ్రుల మాటను జవదాటినాడు. సత్య శౌచములను, సంధ్యా స్నానములను పరిత్యజించినాడు (27).
ఇతని ఇతర పాపకర్మల నటుంచుడు. ఈతడు శివనిర్మాల్యమును అవమానించుటను మనము ప్రత్యక్షముగా చూచియుంటిమి. మీవంటి వారు స్పృశించుటకు ఈతడు దగడు (28).
శివనిర్మాల్యమును భుజించిన వారిని, అవమానించిన వారిని, మరియు ఇచ్చిన వారిని స్పృశించినచో పాపము కలుగును (29).
విషమను స్పృశించవచ్చును; లేదా, త్రాగవచ్చును. కాని ప్రాణములు పోవునప్పుడైననూ శివధనమును సేవించరాదు (30).
యూయం ప్రమాణం ధర్మేషు యథా న చతథా వయమ్ | అస్తి చేద్ధర్మలేశోsస్య గణాస్తం శృణుమో వయమ్ || 31
ఇత్థం తద్వక్యమాకర్ణ్య యామానాం శివకింకరాః | స్మృత్వా శివపదాంభోజం ప్రోచుః పారిషదాస్తు తాన్ || 32
ధర్మముల విషయములో మీరే ప్రమాణము. మేము కాదు. ఓ గణములారా! వీనియందు ధర్మలేశము ఉన్నచో, మేము వినగోరుచున్నాము (31).
శివకింకరులు యమకింకరుల ఈ మాటలను విని శివుని పాదపద్మమును స్మరించి వారితో నిట్లనిరి (32).
శివకింకరా ఊచుః |
కింకరా శ్శివధర్మా యే సూక్ష్మాస్తే తు భవాదృశైః | స్థూలలక్ష్యైః కథం లక్ష్యా లక్ష్యా యే సూక్ష్మదృష్టిభిః || 33
అనే నానేనసా కర్మ యత్కృతం శృణుతేహ తత్ | యజ్ఞదత్తాత్మజేనాథ సావధానతయా గుణా ః || 34
పతంతీ లింగశిరసి దీపచ్ఛాయా నివారితా | స్వచై లాంచలతోsనేన దత్త్వా దీపదశాం నిశి || 35
అపరోsపి పరో ధర్మో జాతస్తత్రాస్య కింకరాః | శృణ్వతశ్శివనామాని ప్రసంగాదపి గృహ్ణతామ్ || 36
శివకింకరులిట్లు పలికిరి -
ఓ కింకరులారా! శివధర్మములు సూక్ష్మమైనవి. సూక్ష్మదృష్టి గలవారు మాత్రమే దర్శించగల ఆ ధర్మములు స్థూల దృష్టి గల మీ వంటి వారికి ఎట్లు భాసించును ? (33)
అపాపియగు ఈ యజ్ఞదత్త కుమారుడు చేసిన కర్మను, ఓ గణములారా! సావధానముగా వినుడు (34).
ఈతడు నిన్న రాత్రి తన వస్త్రముతో వత్తిని చేసి దీపమును కాపాడి లింగశిరస్సుపై దీపపు నీడ పడకుండగా నివారించినాడు (35).
ఓ కింకరులారా! ప్రసంగవశాత్తు శివనామములను ఆతడు విని మరియొక గొప్ప ధర్మము నాచరించినాడు (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment