🌹. నారద భక్తి సూత్రాలు - 86 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 56
🌻 56. గౌణీ త్రిధా, గుణభేదాత్ ఆర్తిదిభేదా ద్వా ॥ - 1 🌻
ముఖ్యభక్తి లక్షణాన్ని చెప్పి, ఇప్పుడు గౌణభక్తి గురించి చెప్తున్నారు. ఈ గొణభక్తిని సత్వ రజస్సు తమస్సులుగా మూడు విధాలైన భక్తిగా తేడాలను వివరిస్తున్నారు.
మరొక పద్ధతిలో గౌణభక్తిని ఆర్హుడు, అర్జార్థుడు, జిజ్ఞాసువు అనే మూడు రకాలైన భక్తుల విషయంలోని తేడాలను వివరిస్తున్నారు. పై విధంగా భక్తుల స్వభావాన్ని బట్టిగాని, గుణాలను బట్టి గాని వారి ద్వారా ప్రకటితమయ్యె భక్తిని గౌణభక్తి అని అంటారు.
నిజానికి ఈ గుణాలు, తేడాలు భక్తిలో లేవు. భక్తి శుద్ధమే అయినప్పటికీ, సాధకుల గుణ కర్మ స్వభావాలను బట్టి ఈ తేడాలు సాధకులలో ఉంటాయి. అతడి భక్తిని బాహ్యానికి వ్యక్తికరించినప్పుడు ఈ గుణాలు మొదలైనవి ఆ భక్తుడిలో ఉన్నట్లు తెలుస్తుంది.
సంకల్ప భేదాన్ని బట్టి ఈ గౌణభక్తి ఆర్తితో గాని, అర్జార్ధితో గాని జిజ్ఞాసతో గాని కూడి ఉంటుంది.
వీరిలో క్లేశ పరిహారం కోరి చేసేవాడు ఆర్హుడు, పాప పరిహారం కోరి చెసెవాడు అర్దార్ధి, ప్రమాద పరిహారం కోరి చేసెవాడు జిజ్ఞాసువు. అందువలన వీరి సంకల్పాలననుసరించి గౌణభక్తి కూడా మూడు విధాలుగా అభివ్యక్తీకరించ బడుతుంది.
తామసిక భక్తుడు సాధన ఎలా చెయాలో అవగాహన లేకుండా చెసాడు. తన వారసత్వపు ఆచారాలను గ్రుడ్డిగా పాటిస్తాడు, అలవాటుగా చేస్తాడు. శాప్రీయ పద్ధతిని తెలుసుకోడు. పెద్దల మాట వినడు.
రాజసిక భక్తుడు స్వప్రయోజనాన్ని ఆళించి న్వార్ధపూరితంగా ఉంది కాయిక, వాచకంగా భక్తిని ప్రదర్శిస్తాడు. కోరిక తీరకపోతే భగవంతుడిని విస్మరిస్తాడు,
లేక నిందిస్తాడు. భక్తిని సాధనగా తీసుకోడు. ఎప్పుడైనా మానివెస్తాడు. అతడి భక్తి ఆరంభ శూరత్వం, చివరికి వదలివేయడం ఉంటుంది. ఆవేశం ఉన్నంతకాలం
భజనచేసి, చల్లారిపోగానే మానేసాడు.
సాత్విక భక్తిలో సాధనను, లక్ష్యాన్ని అవగాహన చేసుకుంటాడు. సాధనలలో మెలకువలు పాటిస్తాడు. శాస్త్రీయంగా సాధన చేస్తాడు. “భక్తి కోసమే భక్తిగా ఉంటుంది. నిర్మలమమైన భక్తిగా ఉంటుంది. భగప్రీతి కొరకు భక్తి సలుపుతాడు.
సాత్విక భక్తుడు ఆర్హుడైతే అతడి ఆర్తి తనకోసం కాదు. లోకంలోని పాప నివారణ కోసమై ఉంటుంది.
ఉదాహరణకు బుద్ధ భగవానుడు సాత్విక భక్తుడు.అర్ధార్ధియైతె అది లోక కళ్యాణార్ధమై ఉంటుంది. సాత్విక భక్తుడు జిజ్ఞాసులైతే ఆత్మ కల్యాణార్థమై ఉంటుంది.
జిజ్ఞాసువు సత్ పరంగాను, అర్జార్ధి చిత్ పరంగాను, ఆర్హుడు ఆనంద పరంగాను భక్తి సలుపుతాడు. భగవంతుడు ఏక లక్షణమైన సత్‌చిత్ ఆనంద రూపుడు. అందువలన ఈ మూడూ కలిపి ఒకే లక్షణంగా భక్తి సలిపితే అది జ్ఞానపరంగా ఉండి ముఖ్యభక్తికి దారి తీస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
05.Sep.2020
No comments:
Post a Comment