✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 2 🌻
132. ఇప్పుడు సచేతన స్థితియందున్న ఆత్మ ఏ రూపము సహచరించి ఏరూపము ద్వారా సంస్కారాను భవం పొందుచున్నది.
133. సప్త ప్రధాన శ్రేణుల యొక్క అసంఖ్యాకమైన జాతి రూపాలను వినియోగించుకొని, విభిన్నమైన అసంఖ్యాక సంస్కారములను అసంఖ్యాక యుగము అనంతరము సామాన్యులు ఊహించలేని దుర్గాహ్యమగు 'గ్యాస్'వంటి వాయు రూపముల అనంతరము, శిల రూపముతో సహచరించి,ఆ శిలారూపముతో తాదాత్మ్యత చెందినది. మన వీలు కొఱకై, సృష్టి శిలా రూపములతో ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చు.
134. భగవంతుడు దేహధారిగా, సృష్టియందు 'సచేతనడగుటకును', సృష్టిని- 'తెలిసికొనుటకును' ప్రారంభించును.
135. ఆత్మ, తన యొక్క చైతన్యముతో సంస్కారములను వాటికి తగిన రూపము ద్వారా తత్సంబంధ లోకములలో అనుభవమును పొందుచుండును.
136. పరమాణు ప్రమాణమైన ఈ ఎఱుకయు ఈ తెలిసికొనుటయు, ఆత్మబిందువు మొట్టమొదటి రూపము నుండి వియోగమొందుటకు కారణమగు హెచ్చు సంస్కారములను సృష్టించుచున్నవి.
137. ఆత్మ కొంతకాలమునకు ఒక నిర్దిష్టమైన అనుభవమును పొందిన తరువాత,ఆ రూపమును విడిచిపెట్టుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
05.Sep.2020
No comments:
Post a Comment