శివగీత - 53 / ₮ⱧɆ ₴łV₳-₲ł₮₳ - 53


🌹.   శివగీత - 53 / The Siva-Gita - 53  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 7 🌻

స్థూలస్య సూక్ష్మ స్య జడస్య దేహ
ద్వయస్య శంభో ! న చితం వినాస్తి,
అట స్త్వదారో పణ మాత నోతి
శృతి: పురారే! సుఖదుఃఖయో స్సదా 36

నమ స్సచ్చిదంభో ధి హంసాయ తుభ్యం
నమః కాలకంటాయ కాలాత్మకాయ
నమస్తే నమస్తా షు సంహార కర్త్రే
నమస్తే మృపాచిత్త వృత్త్యేక భోక్త్రే 37

ఏవం ప్రణమ్య విశ్వేశం - పురుతః ప్రాంజలి స్స్థితః
విస్మితః పరమేశానం - జగదే రఘునందనః 38

ఉపసంహార విశ్వాత్మన్ - విశ్వరూప మిదం తవ,
ప్రతీతం జగాదైకాత్మ్యం - శంభో ! భవదను గ్రహాత్ 39

పశ్య రామ మహాభాహొ - మాటతో నాన్యోస్తి కశ్చన
ఇత్యుక్త్వైవో పసంజహ్రె - స్వదే హే దేవతాది కాన్ 40

ఓ త్రిపుర సంహారకా! స్థూలము - సూక్ష్మము - జడ రూపములకు నీకును ఇంచుక భేధము లేదు. కావుననే సుఖ దుఃఖములకు కారణ భూతుడవు నీవే యని వేదములు గోషించు చున్నవి.

ఓ దేవ దేవా! మహాదేవా! సచ్చిదానందమను సాగరములో హంసవైన నీకు నా ప్రణామంబు, నీలకంటుని కొరకు కాలత్ముని కొరకు, నిఖిల పాప సంహారుని కొరకు, విధ్యాభూతంబగు చిట్టా వ్యాపారములందును భోక్తవగు నీకు నమస్కారము.

సూతుడు చెప్పుచున్నాడు.

ఈ విధముగా నా పరమేశ్వరుని ముంగిట చేతులు జోడించి నతమస్తకుండై నిలచి విరాటరూప సందర్శనముతో నాశ్చర్యచకితుడై వక్ష్యమాణ ప్రకారముగా నీశ్వరుని గురించి

ఇట్లు చెప్పుచున్నాడు.

సర్వవ్యాప్తియగునో మహాదేవ! నీ విశ్వరూపమును ఉపసంహరింపును, నీ యనుగ్రహమువలన సమస్త జగదైక్యమును సందర్శించితిని.

శ్రీ భగవంతు డాదే శించుచున్నాడు :-

ఓయీ రామచంద్రా! బాగుగా నవలోకింపుము. నాకంటెను - మరోక్కడెవ్వడును లేడు సుమా! సూతుడు పలుకుచున్నాడు. శివుడీ విధముగా నాదేశించి తన విశ్వరూపమున నున్న దేవాదులను ఉపసంహరించు కొనెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  The Siva-Gita - 53  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 7
🌻

O lord who destroyed the three cities! There is not even the slightest difference between you and the gross (sthoola), Subtle(sookshma) and Causal(Karana) bodies of Jiva, that's the reason why Vedas proclaim that the cause of all happiness and sorrow is you alone.

O lord of the lords! O great lord! I offer my salutations to you who are a swan in the ocean called Satchidananda. My salutations to you

O Neelakantha, to you O Kalatmaka, to you O destroyer of sins, in the exportimport business of the three bodies which are untrue in reality you remain as the enjoyer of fruits of the karmas (as Jiva), thereby my salutations to you who is such!

Suta Said: In this manner with folded hands and bowed head Rama spoke addressing Eswara the cosmic being in this way:

O all pervading god Mahadeva! Kindly wind up your cosmic form. I have witnessed the oneness of the entire universe (with you) by your grace.

Sri Bhagavan said: O Ramachandra! See my cosmic form carefully! Mind you! There is none who exists other than me.

Suta said: After instructing Rama in this way, lord Shiva withdrew his cosmic form.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

05.Sep.2020

No comments:

Post a Comment