🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పిప్పలాద మహర్షి - 5 🌻
27. సంవత్సరానికి అయిదే ఋతువులున్నాయని చెప్పాడు. అంటే ఇక్కడ హేమంత శిశిర ఋతువులు రెండూ ఒకే ఋతువు అని ఆయన్ ఉద్దేశ్యం కావచ్చు. మాసము ప్రజాపతిస్వరూపము. మాసంలో శుక్లపక్షం ప్రాణస్వరూపము. మాసము అంటే బ్రహ్మ అనే అర్థం. ప్రజాపతి అంటే, ఎక్కడ ఆ మాట వచ్చినప్పటికీ కూడా, దానికి బ్రహ్మదేవుడు అని అర్థం.
28. “ఓం భూర్భువస్సువః స్వాహా… ప్రజాపతయ ఇదం న మమ” అనే మంత్రంలో ఉన్న ప్రజాపతి, బ్రహ్మశబ్దవాచకం. అన్నము ప్రజాపతిస్వరూపంగా భావించబడింది. పగటి కాలం అంతా ప్రాణస్వరూపము, ఇదే శ్రేష్ఠమైనది అని ఈ ప్రకారంగా ఆయన అనేక విషయాలు చెప్పాడు.
29. అనేకమంది ఋషులు కాస్త తేడాతో చాలా మహత్తుతో చెప్పిన మాటలే ఇవి. అయితే అన్నీ ఒక్కలాగ ఉండకపొవచ్చును. ఆ భాషలో, మాటలలో మొత్తం ఈ సృష్టీంతా యథార్థంగా ఉందనేటటువంటి భావంతో జీవుల యొక్క రాకపోకలను గురించి చెప్పుతుంది అది.
30. మరొక ఋషి పిప్పలాదుని, “దేవా! శరీరాన్ని భరించేదెవరు?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు పిప్పలాదుడు, “శరీరాన్ని భరించేది, ప్రకాశింపచేసేది ప్రాణమే! ప్రకాశింపచెయ్యటము అంటే, ఈ చైతన్యాన్ని ఇచ్చి పనిచేయించేదికూడా ప్రాణమే” అని చెప్పాడూ.
31. అలాగే మరొక ఋషి, “ప్రాణం అనేది ఎట్లా పుడుతుంది? శరీరంలోకి ప్రాణం ఎట్లా ప్రవేశిస్తుంది?” అని అడిగాదు. దానికి పిప్పలాదుడు, “మొదట ఆత్మ నుంచే ఆత్మ పుడుతుంది. తరువాత దానినుండి ప్రాణం పుడుతుంది.
32. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మవస్తువు పంచభూతములలో ప్రవేశించగానే ప్రాణం అందులోంచి బహిర్గతమవుతుంది అని వేద శాస్త్రం చెబుతున్నది. ప్రాణం ఎక్కడినుంచో రాదు. ఆత్మయందే ఉన్నది” అని చెప్పాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
05.Sep.2020
No comments:
Post a Comment