రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 1 🌻
బ్రహ్మోవాచ |
తతస్తే మునయస్సర్వే తదభిప్రాయ వేదినః | చక్రుస్తదుచితం నామ మరీచి ప్రముఖాస్సుతాః || 1
ముఖావలోకనాదేవ జ్ఞాత్వా వృత్తాంతమన్యతః | దక్షాదయశ్చ స్రష్టార స్థ్సానం పత్నీం చ తే దదుః || 2
తతో నిశ్చిత్య నామాని మరీచి ప్రముఖా ద్విజాః | ఊచుస్సంగతమేతసై#్మ పురుషాయ మమాత్మజాః || 3
బ్రహ్మ ఇట్లు పలికెను -
మరీచి మొదలగు ఆ మునులందరు, మరియు కుమారులు బ్రహ్మయొక్క అభిప్రాయము నెరింగి ఆ పురుషునకు యోగ్యమగు పేర్లనిడిరు (1).
బ్రహ్మ గారు వారి ముఖములోనికి చూడగా ఆయన అభిప్రాయమును గ్రహించి దక్షాది ప్రజాపతులు ఆ పురుషునకు స్థానమును, భార్యను కల్పించిరి (2).
అపుడు నా కుమారులైన మరీచి మొదలగు మహర్షులు ఆతని పేర్లను నిశ్చియించి ఈ యుక్తియుక్తమగు మాటను ఆపురుషునితో పలికిరి (3).
ఋషయ ఊచుః |
యస్మాత్ర్ప మథసే తత్త్వం జాతోsస్మాకం యథా విధేః | తస్మాన్మన్మథ నామా త్వం లోకే ఖ్యాతో భవిష్యసి || 4
జగత్సు కామరూపస్త్వం త్వత్సమో న హి విద్యతే | అతస్త్వం కామనామాపి ఖ్యాతో భవ మనోభవ || 5
మదనాన్మదనాఖ్యస్త్వం జాతో దర్పాత్స దర్పకః | తస్మాత్కం దర్పనామాపి లోకే ఖ్యాతో భవిష్యసి || 6
త్వత్సమం సర్వ దేవానాం యద్వీర్యం న భవిష్యతి |తతస్థ్సా నాని సర్వాణి సర్వవ్యాపీ భవాంస్తతః || 7
దక్షోయం భవతే పత్నీం స్యయం దాస్యతి కామినీమ్ | ఆద్యః ప్రజాపతిర్యో హి యథేష్టం పురుషోత్తమః || 8
నీవు పుట్టగనే మాయొక్క బ్రహ్మ యొక్క మనస్సులను మథించినాడవు గనుక, నీకు లోకములో మన్మథుడను పేరు ప్రసిద్ధి గాంచ గలదు (4).
మనస్సులో పుట్టే ఓ మన్మథా! యధేఛ్ఛగా వివిధ రూపములను ధరించుటలో నీతో సమమైన వాడు జగత్తులలో లేడు గనుక, నీవు 'కాముడు' అను పేర ప్రఖ్యాతిని బడయుము (5).
నీవు జనులను మదాన్వితులను చేయుదువు గాన నీకు మదనుడని పేరు. నీవు దర్పము గలవాడవు. దర్పము నుండి పుట్టినవాడవు. కాన నీకు లోకములో కందర్పుడు అనే పేరు గూడ ప్రసిద్ధిని గాంచగలదు (6).
నీతో సమానమైన బలము గలవాడు దేవతలలో మరియొకరు ఉండబోరు. కావున స్థానములన్నియు నీవియే. నీవు సర్వవ్యాపివి (7).
పురుషశ్రేష్ఠుడు, మొదటి ప్రజాపతియగు ఈ దక్షుడు తనకు నచ్చిన విధముగా నీకు నిన్ను ప్రేమించు భార్యను స్వయముగా ఈయగలడు (8).
ఏషా చ కన్యకా చారురూపా బ్రహ్మమనోభవ | సంధ్యా నామ్నేతి విఖ్యాతా సర్వలోకే భవిష్యతి || 9
బ్రహ్మణో ధ్యాయతో యస్మాత్సమ్యగ్జాతా వరాంగనా | అతస్సంధ్యేతి. విఖ్యాతా క్రాంతాభా తుల్య మల్లికా || 10
బ్రహ్మయొక్క మనస్సు నుండి పుట్టిన ఈ సుందర రూపము గల కన్య లోకములన్నింటియందు సంధ్య యను పేరుతో ప్రసిద్ధిని గాంచెను (9).
ధ్యానము చేయుచున్న బ్రహ్మ నండి ఈ సుందరి చక్కగా జన్మించినది గాన, ఈమె సంధ్యయని ప్రసిద్ధిని బడసినది. ఈ సుందరి మల్లె తీగవలె విశేషంచి ప్రకాశించుచున్నది (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
05.Sep.2020
No comments:
Post a Comment