శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 190 / Sri Lalitha Chaitanya Vijnanam - 190


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 190 / Sri Lalitha Chaitanya Vijnanam - 190 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖



🌻 190. 'దుర్గా' 🌻


తొమ్మిది దుర్గములు కలది అని అర్థము. దుర్గ నవదుర్గయై యున్నది. అనగా తొమ్మిది కోటలు కలిగి యున్నది. అవియే నవావరణములు. సంవత్సరముల వయసుకల కన్యలను దుర్గ అని పిలుతురు. సృష్టికి నవావరణములు కలవు. తత్కారణముగనే సృష్టి గోచరించుచున్నది. 'మూలప్రకృతి, అష్టప్రకృతులు కలిపి తొమ్మిది ప్రకృతు లున్నవి.

అష్ట ప్రకృతులు తొమ్మిదివది యగు మూలప్రకృతి నుండి దిగి వచ్చినవే. దిగి వచ్చినప్పుడు, సూక్ష్మము నుండి స్థూల సుగుట జరుగును. ఆవిరి నీరగుట, నీరు మంచుగడ్డగుటగా ఎనిమిది లోకములు మూల ప్రకృతినుండి ఏర్పడును. మూల ప్రకృతి తత్త్వము నుండి ఉద్భవించును.

ఈ మొత్తము తొమ్మిది ప్రకృతులు, తొమ్మిది చైతన్య స్థితులుగా, తొమ్మిది అవస్థలుగా తెలియసగుసు. ఈ తొమ్మిది అవస్థలూ మాయచే ఏర్పరచబడినవే. వీని నధిరోహించుటకు దుర్గ నారాధించుట సంప్రదాయము.

“దుం దుర్గాయై నమః” అనునది ఈ సందర్భమున ఋషులందించిన మంత్రము. ఈ తొమ్మిది ఆవరణములలో, ఎనిమిది ఆవరణములు ఇంద్రాది దేవతలకు కూడ భయము కలిగించును. ఆవరణలకు మరియొక నామము వృత్రము. వృత్రాసురుడు అను రాక్షసుడు, ఇంద్రునకు అమితమైన భీతి కలిగించెను. ఆ భీతినుండి తరించుటకు ఇంద్రుడు నారాయణుని ప్రార్థించెనట.

నారాయణుడన్ననూ, నారాయణి యన్ననూ ఒక్కటియే. విష్ణువు యన్ననూ, వైష్ణవి యన్ననూ ఒక్కటియే. భయభీతులు కలవారికి దుర్గారాధనము అంజనము వంటిది.

మానవునికి వెలుపల గల సృష్టియందు, అతని శరీరము లోపల యందూ ఈ తొమ్మిది ఆవరణలు ఉన్నవి. మానప్పుడు మూల ప్రకృతి చేత, త్రిగుణముల చేత, పంచభూతముల చేత ఆవరింపబడి యున్నాడు. అట్లే సృష్టియందు కూడ ఆవరింపబడి యున్నాడు.

ఈ ఆవరణములు దాటి 'తాను' ముక్తుడై యుండుటకు అన్ని ఆవరణములను శ్రీమాతగ దర్శించుట ప్రధానము. అట్లు దర్శించుటయే నిజమగు నవావరణ పూజ. ఎవరైనను అహంకరించినపుడు అది అంతయూ అమ్మ విలాసముగ చూడగలిగినపుడే నవావరణ పూజ జరిగినట్లు.

అజ్ఞానమునుండి పూర్ణజ్ఞానమునకు సోపానముగ తొమ్మిది మెట్లున్నవి. జీవులందు వారి పరిణామమును బట్టి ఈ తొమ్మిది స్థితులలో నుందురు. వారి ప్రవర్తనలందు మంచి చెడులను చూడక, వారున్న ఆవరణలను దర్శించుట సార్థక్యము కలిగించు సాధన.

దీనినే వైష్ణవ సంప్రదాయమున 'వాసుదేవోపాసన' యందురు. విద్య అవిద్యలుగ శ్రీమాతయే జీవుల నావరించి యున్నపుడు, వానిని జీవుల చేష్టలుగ చూచుట ఒక ఎత్తు. శ్రీమాత మాయావరణగ చూచుట మరియొక ఎత్తు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 190 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Durgā दुर्गा (190)🌻

There is a reference to Durgā in Mahānārāyaṇa Upaniṣad (Durgā sūktaṃ). Durgā means dispeller of difficulties. Her Durgā form is described as fiery and radiant in nature. Those who take refuge in Her are saved by Her from their difficulties.

Reciting Durgā sūktaṃ regularly eradicates miseries. The first verse of sūktaṃ, ṃrityuñjaya mantra (tryambakaṁ yajāmahe) and Gāyatrī mantra (leaving vyākṛti-s) together make 100 bīja-s (sadākṣari) and when this is recited, it is supposed to ward off all miseries.

Durgā refers to Her act of protection, both physical and mental. A strong mental and physical balance is required to realize Her through inner search.


Sadākṣari mantra:

tryambakaṁ yajāmahe sugandhiṁ puṣṭivardhanam|
urvārukamiva bandhanān mrityormukṣiya māṁrutāt||
tat savitr vareṇyam|bhargo devasya dhīmahi|
dhiyo yo naḥ pracodayāt||
jātavedase sunavāma-soma-marātīyato nidahāti vedaḥ|
sa naḥ parṣadati durgāṇi viśva nāveva sindhuṁ duritātyagniḥ||


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021

No comments:

Post a Comment