🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జైమినిమహర్షి - 4 🌻
19. ఒకసారి సుబాహుడు అనే రాజు, దానం చేయటం వలన వచ్చే లాభం ఏమిటి? చెప్పమని అడిగాడు.
జైమినిమహర్షి: దానం వలన స్వర్గము, సుఖము కలుగుతాయి.
రాజు: స్వర్గం వస్తే ఏమిటి లాభం?
జైమినిమహర్షి: ఈ సుఖాలే అపరిమితంగా ఉంటాయి స్వర్గంలో.
రాజు: తరువాత ఏమవుతుంది?
జైమినిమహర్షి: తిరిగి ఇక్కడికే మరో జన్మరూపంలో వస్తారు.
రాజు: అలాంటప్పుడు ఎందుకు దానం చెయ్యాలి? పునర్హన్మ బంధనహేతువు కదా! జ్ఞాని అనేవాడు దానం చేయకూడదు కదా! యజ్ఞాలు చేసాను. వేదం చెప్పిన కర్మలు చేసాను. దానం చేయమమే ఎందుకు చేయాలి? నాకర్థంకాలేదు.
20. జైమినిమహర్షి: రాజా! స్వర్గానికి వెళతావు అని చెప్పాను. స్వర్గం నీకు వద్దంటావు. కానీ నువ్వు మోక్షాన్వేషివి కాదు కదా! మోక్షమార్గంలో బంధనం వద్దనేట్లయితే, స్వర్గంమీద వైరాగ్యంచేత నువ్వుదానం చేయలేదంటే బాగుంది. ఇన్ని కర్మలు చేసినప్పటికీ, ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు కదా ఎవరయినా! దానం చేయని వాడు అదానదోషం వలన వచ్చినటువంటి క్షుబ్బాధతో తీవ్రమైన వ్యధలకు గురవుతాడు. అందువలన దానం చేయటం నీ కర్తవ్యం.
21. ఈ జీవుడు ఏ జ్ఞానము, ఏ తపస్సు కొరకై జీవుస్తున్నాడో, మోక్షాన్వేషిగా జీవుస్తున్నాడో; ఆ జ్ఞానాన్ని-ఆ జ్ఞానాపేక్షను-కూడా మరిపింపచేయగలిగే వేదన, దానంచేయకపోతే జీవుడికి కలుగుతుంది. కాబట్టి నియత కర్మ. అది చేసితీరాలి. క్షేమంకోసమని దానంచేసితీరాలి. చాలామంది, దనం చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నావని అంటూవుంటారు. దానంచేసినవాడు తన కొసమే దానంచేసు కుంటున్నాడనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
22. ఎవరికోసమూ ఎవరూ దానంచేయరు. “ఒకరూపాయి ఎవరికో దానంచేసానంటే నాకోసమే చేస్తున్నాను, నా మంచికోసమే చేస్తున్నాను” అనుకోవాలి. ఒకరికిచ్చిన రూపాయి ఖర్చైపోతోంది, అతడివద్ద ఉండనే ఉండదు. పదిరూపాయలు ఉంటేకదా ఒక రూపాయి దానంచేసాం. దాంట్లో గొప్పఏముంది! అందుకని దానం నా కోసమే చేసాననుకోవాలి.
23. అంటే నీకోసమే నువ్వు, నీ క్షేమాన్ని కోరే దానంచేయాలి. దానంచేయకపోతే ఆ జీవుడికి ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత తీవ్రమైన దాహం, ఆకలి, వేదన ఉంటాయి. అతడి ధ్యేయం మరచిపోతాడు. తనదైన ధనం ఏదైతే ఉన్నదో అందులోంచి దానం చెయ్యాలి. అది కర్తవ్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Jan 2021
No comments:
Post a Comment