26-JANUARY-2021 EVENING

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 134🌹  
13) 🌹. శివ మహా పురాణము - 334🌹 
14) 🌹 Light On The Path - 87🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 219🌹 
16) 🌹 Seeds Of Consciousness - 283 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 158🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 14 / Lalitha Sahasra Namavali - 14🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasranama - 14🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -134 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 19

*🍀. 17. సమభావము - సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది. ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు. మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. 🍀*

ఇహైవ ఆర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ధృహ్మణి తే స్థితా|| 19

సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది. 

ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు. 

మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. వెండితెరపై రంగులు, శబ్దములతో కూడిన సినిమా కథ నడచుచుండగ రసవత్తరముగ నుండును.

కాని దాని కాధారమైన తెరకు సినిమా సన్నివేశము లన్నియు పట్టవు. తెరమీద కథను గమనించువారు కథలో లీనమగుదురు. తెరను కూడ గమనించు వారు సమస్తమగు సన్నివేశములు వచ్చిపోవునవిగ గమనింతురు. జీవితమందలి సంఘటనలు అనేకానేకములు వచ్చిపోవుచున్నను, తాను తెరవలె యున్నాడు అని తెలిసినవాడు, వచ్చిపోవు సన్నివేశములకు ప్రభావితుడు కాడు. 

అట్లు ప్రకృతి విలాసములను గమనించుచు వాని కాధారమైన బ్రహ్మమునందు స్థితి గొన్నచో ఈ శరీరమునందే బ్రహ్మత్వము పొందవచ్చునని భగవంతుడు తెలుపుచున్నాడు.

మనసున బ్రహ్మమును గూర్చిన భావనము స్థిరపడుచున్న కొలది మనసునకు స్థిరత్వము, సామ్యము కుదురును. అట్టి మనసుతో సర్గమును (చైతన్య విలాసమును) జయించ వచ్చును. అపుడిచ్చటే బ్రహ్మమునందు స్థితిగొని యుండ వచ్చును. అదియే సామ్యము. సర్గమున కతీతమగు స్థితి. సర్గము ప్రకృతి యధీనము.

సామ్యమున ప్రకృతికూడ యధీనమై యుండును. అదియే బ్రహ్మము నందు స్థితిగొనుట యందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 334 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
84. అధ్యాయము - 39

*🌻. విష్ణుదధీచి యుద్ధము - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు తన చక్రము మొక్క బోవుటను గాంచి, ఆతని మాటలను విని కోపించి ఆతనిపై అస్త్రములనన్నింటినీ క్రమముగా (20) ప్రయోగించెను. అపుడు దేవతలు ఆదరముతో విష్ణువునకు సహాయపడిరి (21). ఒక్క బ్రాహ్మణునితో యుద్ధమునకు తలపడిన మూర్ఖులగు ఇంద్రాది దేవతలు విష్ణువు పక్షమున నిలబడి దధీచునిపై వేగముతో తత తమ శస్త్రములను, అస్త్రములను శీఘ్రమే ప్రయోగించిరి (22). అపుడు వజ్రము వంటి ఎముకలు గలవాడు, సర్వము తన వశమునందున్న వాడు అగు దధీచుడు శివుని స్మరించుచూ గుప్పెడు దర్భలను తీసుకుని (23) దేవతలందరిపై ప్రయోగించెను.

శంకరుని మహిమచే మహర్షి ప్రయోగించిన ఆ దర్భల కట్ట (24) కాలాగ్నివంటి దివ్య త్రిశూలమాయెను. ఓ మహర్షీ! మూడు అగ్రములు గల ఆ త్రిశూలము దేవతలను వారి ఆయుధములను దహించుటకు నిశ్చయించుకొనెను (25). శివుని ఆ శూలము ప్రలయకాలాగ్ని కంటె అధికమగు కాంతులను అంతటా విరజిమ్ముచూ మండెను. నారాయణుడు, ఇంద్రుడు మొదలగు దేతలను ప్రయోగించిన (26) ఆయుధములన్నియూ ఆ త్రిశూలము ముందు మోకరిల్లెనవి, నష్టమైన పరాక్రమముగల దేవతలందరు పారిపోయిరి (27). మాయావులలో శ్రేష్ఠుడవగు హరి ఒక్కడు మాత్రమే అచట నిలిచియుండెను. పురుషోత్తముడగు ఆ విష్ణుభగవానుడు తన దేహము నుండి (28) తనతో సమానమగు కోట్లాది దివ్య గణములను సృష్టించెను (29).

వీరులగు ఆ విష్ణు గణములు కూడా శివస్వరూపుడు ఏకాకియగు దధీచ మహర్షితో అచట యుద్ధమును చేసిరి. ఓ దేవర్షీ! (30) అపుడు శివభక్తశేఖరుడగు దధీచుడు ఆ విష్ణుగణములతో పరిపరి విధముల యుద్ధమును చేసి, ఆ తరువాత క్షణములో వారి నందరినీ దహించివేసెను (31). అపుడు మహామాయా పండితుడగు విష్ణువు దధీచుని ఆశ్చర్యచకితుని చేయుట కొరకై విశ్వరూపమును పొందెను (32). ద్విజశ్రేష్ఠుడగు దధీచి ఆ విష్ణువు యొక్క దేహములో అసంఖ్యాకులగు దేవతలను, ఇతర జీవులను ప్రత్యక్షముగా చూచెను (33).

ఆ విశ్వమూర్తి యొక్క దేహములో కోట్లాది భూతములు, కోట్లాది గణములు, మరియు కోట్లాది బ్రహ్మాండములు కానవచ్చెను (34). అపుడు ఆ విశ్వరూపమును చూచిన చ్యవననందనుడు, జగన్నాథుడు జగద్రక్షకుడు, పుట్టుక లేనివాడు, సర్వ వ్యాపియగు విష్ణువుతో నిట్లనెను (35).

దధీచుడిట్లు పలికెను -

హే మహాబాహో! మాధవా! మాయను వీడుము. విచారమును చేసినచో ఇది ఆ భాసయని తేలుసు. తెలియుట మిక్కిలి కష్టమైన వేలాది విషయములను నేను ఎరింగితిని (36). నీవు నాయందు శ్రద్ధగా చూడుము. నీకు దివ్య దృష్టినిచ్చుచున్నాను. నీవు, బ్రహ్మ, రుద్రులతో సహా జగత్తంతయు నీకు కనబడును (37).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి చ్యవన పుత్రుడగు ఆ ముని శంభుని తేజస్సుచే పూర్ణ విరాడ్దేహమును స్వీకరించినవాడై తన దేహమునందు నిఖిల బ్రహ్మాండములను ప్రదర్శించెను (38). శివభక్తాగ్రగణ్యుడు, భయము లేనివాడు, విద్వాంసుడు అగు దధీచి మనస్సులో శంకరుని స్మరిస్తూ చిరునవ్వుతో దేవేశుడు విష్ణువునుద్దేశించి ఇట్లు పలికెను (39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 87 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 5 🌻*

344. In all matters of principle we must take a firm stand. For example, strict vegetarianism is with us a principle, because we believe it to be best in every way, not only for ourselves but for all the world around us. 

It is a little inconvenient when we go out to dinner or when we are travelling, but we let such trifling inconveniences pass, and keep to our own point of view. But in a vast number of other things, which really do not matter, it saves trouble to yield to the ordinary customs of the time. 

As regards our dress – to take another instance. The dress of modern man is peculiarly ugly, uncomfortable and unhealthy, but it saves trouble to adopt it. If we set ourselves against it, however much more rational, aesthetic and beautiful our costume might be, we should attract unwelcome attention, and should probably be regarded as more or less insane. 

It is not worth while. It is better not to make ourselves unduly conspicuous by opposing things which do not matter. But when a principle is involved we must hold steadily to what we think is right.

345. If we could get into an absolutely impersonal attitude about all work it would help us very much. Ruskin speaks of that with regard to art; he says that while self-praise and conceit are vulgar beyond words, undue self-depreciation is only another form of vulgarity. 

We should aim at the condition of mind in which we are able to view the work from the outside, and to say: “Be it mine or yours, or whose else it may, this also is well.” 

We must be able to praise a good piece of work when we see it, not because it is ours or our friends ‘, or because it bears a great name, but just because it is good, putting aside absolutely the question of who did it. I am afraid we do not always do this. Our reason for quoting something is not always because it is fine and beautiful, but because Madame Blavatsky said it or Dr. Besant wrote it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 219 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జైమినిమహర్షి - 4 🌻*

19. ఒకసారి సుబాహుడు అనే రాజు, దానం చేయటం వలన వచ్చే లాభం ఏమిటి? చెప్పమని అడిగాడు.

జైమినిమహర్షి: దానం వలన స్వర్గము, సుఖము కలుగుతాయి.
రాజు: స్వర్గం వస్తే ఏమిటి లాభం?
జైమినిమహర్షి: ఈ సుఖాలే అపరిమితంగా ఉంటాయి స్వర్గంలో.
రాజు: తరువాత ఏమవుతుంది?
జైమినిమహర్షి: తిరిగి ఇక్కడికే మరో జన్మరూపంలో వస్తారు.
రాజు: అలాంటప్పుడు ఎందుకు దానం చెయ్యాలి? పునర్హన్మ బంధనహేతువు కదా! జ్ఞాని అనేవాడు దానం చేయకూడదు కదా! యజ్ఞాలు చేసాను. వేదం చెప్పిన కర్మలు చేసాను. దానం చేయమమే ఎందుకు చేయాలి? నాకర్థంకాలేదు.

20. జైమినిమహర్షి: రాజా! స్వర్గానికి వెళతావు అని చెప్పాను. స్వర్గం నీకు వద్దంటావు. కానీ నువ్వు మోక్షాన్వేషివి కాదు కదా! మోక్షమార్గంలో బంధనం వద్దనేట్లయితే, స్వర్గంమీద వైరాగ్యంచేత నువ్వుదానం చేయలేదంటే బాగుంది. ఇన్ని కర్మలు చేసినప్పటికీ, ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు కదా ఎవరయినా! దానం చేయని వాడు అదానదోషం వలన వచ్చినటువంటి క్షుబ్బాధతో తీవ్రమైన వ్యధలకు గురవుతాడు. అందువలన దానం చేయటం నీ కర్తవ్యం.

21. ఈ జీవుడు ఏ జ్ఞానము, ఏ తపస్సు కొరకై జీవుస్తున్నాడో, మోక్షాన్వేషిగా జీవుస్తున్నాడో; ఆ జ్ఞానాన్ని-ఆ జ్ఞానాపేక్షను-కూడా మరిపింపచేయగలిగే వేదన, దానంచేయకపోతే జీవుడికి కలుగుతుంది. కాబట్టి నియత కర్మ. అది చేసితీరాలి. క్షేమంకోసమని దానంచేసితీరాలి. చాలామంది, దనం చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నావని అంటూవుంటారు. దానంచేసినవాడు తన కొసమే దానంచేసు కుంటున్నాడనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. 

22. ఎవరికోసమూ ఎవరూ దానంచేయరు. “ఒకరూపాయి ఎవరికో దానంచేసానంటే నాకోసమే చేస్తున్నాను, నా మంచికోసమే చేస్తున్నాను” అనుకోవాలి. ఒకరికిచ్చిన రూపాయి ఖర్చైపోతోంది, అతడివద్ద ఉండనే ఉండదు. పదిరూపాయలు ఉంటేకదా ఒక రూపాయి దానంచేసాం. దాంట్లో గొప్పఏముంది! అందుకని దానం నా కోసమే చేసాననుకోవాలి.

23. అంటే నీకోసమే నువ్వు, నీ క్షేమాన్ని కోరే దానంచేయాలి. దానంచేయకపోతే ఆ జీవుడికి ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత తీవ్రమైన దాహం, ఆకలి, వేదన ఉంటాయి. అతడి ధ్యేయం మరచిపోతాడు. తనదైన ధనం ఏదైతే ఉన్నదో అందులోంచి దానం చెయ్యాలి. అది కర్తవ్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 283 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 132. The greatest miracle is that you got the news 'I am'. It's self-evident. Prior to knowing that 'you are' what knowledge did you have? 🌻*

Remember that moment when you first came to know that 'you are' or 'I am'. Almost instantly space also came along with it and soon you had the feeling 'I am in this world'. 

Just observe the power of this news 'I am' that you got, is it not a miracle that it created the world, which you believe you are living in? Before the arrival of the 'I am' did you know anything? 

Or rather, before the news 'I am' came did you need to know anything? Knowledge was not required because you were, and even now, you are knowledge itself!

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 158 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 3 🌻*

618. సర్వసాధారణంగా ఫనా-బకా స్థితులన్నియు ఒకే మాదిరిగా నున్నను, ఒక భూమికలోని 'ఫనా-బకా'
కును మరియొక భూమికలోని 'ఫనా-బకా'కును వాటి వాటి సంస్కారముల ననుసరించి అనుభవములో భేదముండును.
____________________________________

Notes:-ఫనా=నిర్వాణస్థితి (సుషుప్తి అవస్థ)
బకా=ఆత్మ ప్రతిష్టాపనము (జాగ్రదవస్థ)

ఉదాహరణము:- అమెరికా నివాసియు, ఆసియా నివాసియు ఓకే భూమిమీద నివసించున్నను ఎవరి సంస్కారములు వారివి. ఆ సంస్కారములకు తగిన తమ వ్యష్టి జీవితము యొక్క సంబంధ అనుభవములు, తాము నివసించు ఖండములకు సంబంధించి యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 14 / Sri Lalita Sahasranamavali - Meaning - 14 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 14. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|*
*నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ‖ 14 ‖ 🍀*

33) కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - 
కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.

34) నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - 
బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 14 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 14. kāmeśvara-premaratna-maṇi-pratipaṇa-stanī |
nābhyālavāla-romāli-latā-phala-kucadvayī || 14 ||🌻*

33) Kameswara prema rathna mani prathi pana sthani -   
She who has Chest which are like the pot made of Rathna(precious stones) and has obtained the love of Kameshwara

34) Nabhyala vala Romali latha phala kucha dwayi -   
She who has Chest that are like fruits borne on the creeper of tiny hairs raising from her belly.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 14 / Sri Vishnu Sahasra Namavali - 14 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - రోహిణి నక్షత్ర 2వ పాద శ్లోకం*

*🍀 14. సర్వగ స్సర్వవిద్భానుః విశ్వక్షేనో జనార్దనః|*
*వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః|| 🍀*

🍀 123) సర్వగః - 
అన్నిచోట్లా ప్రవేశించువాడు, ఎక్కడికైనా వెళ్లగలిగేవాడు. 

🍀 124) సర్వవిద్భానుః - 
సర్వము తెలిసిన జ్ఞానముతో ప్రకాశించేవాడు.

🍀 125) విష్వక్సేనః - 
విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు. 

🍀 126) జనార్దనః - 
దుష్టశక్తుల నుండీ సజ్జనులను రక్షించువాడు. 

🍀 127) వేదః - 
సమస్త జ్ఞానముకలిగినవాడు, వేదమూర్తి.

🍀 128) వేదవిత్ - 
వేదములను సంపూర్ణముగా నెరిగినవాడు.

🍀 129) అవ్యఞ్గః - 
గుణ, జ్ఞానములందు ఎట్టి లోపములు లేనివాడు.

🍀 130) వేదాఞ్గః - 
వేదములే శరీర అంగములుగా గలవాడు, వేదమూర్తి.

🍀 131) వేదవిత్ - 
వేదసారమైన ధర్మమునెరిగినవాడు.

🍀 132) కవిః - 
సూక్ష్మ దృష్టి కలిగినవాడు,అన్నింటినీ చూచువాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 14 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka Rohini 2nd Padam* 

*🌻 14. sarvagaḥ sarva vidbhānur viṣvaksenō janārdanaḥ |*
*vedō vedavidavyaṅgō vedāṅgō vedavit kaviḥ || 14 || 🌻*

🌻 123) Sarvagaḥ: 
One who pervades everything, being of the nature of their material cause.

🌻 124) Sarvavid-bhānuḥ: 
One who is omniscient and illumines everything.

🌻 125) Viṣvakśenaḥ: 
He before whom all Asura armies get scattered.

🌻 126) Janārdanaḥ: 
One who inflicts suffering on evil men.

🌻 127) Vedaḥ: 
He who is of the form of the Veda.

🌻 128) Vedavid: 
One who knows the Veda and its meaning.

🌻 129) Avyaṅgaḥ: 
One who is self-fulfilled by knowledge and other great attributes and is free from every defect.

🌻 130) Vedāṅgaḥ: 
He to whom the Vedas stand as organs.
Vedavit: One who knows all the Vedas.

🌻 132) Kaviḥ: 
One who sees everything.

Contnues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share 
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/     

Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

Join and Share 
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ 

Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  
www.facebook.com/groups/vishnusahasranam/

Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita 
www.facebook.com/groups/bhagavadgeetha/

Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA 
www.facebook.com/groups/yogavasishta/

Join and Share వివేక చూడామణి viveka chudamani 
www.facebook.com/groups/vivekachudamani/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment