నిర్భయమే ప్రగతికి సోపానం


🌹. నిర్భయమే ప్రగతికి సోపానం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

కొంచెం సేపట్లో మరణించబోతున్న ఒక జెన్ సన్యాసి నా చెప్పులెక్కడ అన్నాడు. మీకేమైనా మతి పోయందా మీరు కొంచెం సేపట్లో మరణించబోతున్నారు అన్నాడు వైద్యుడు.

మరణించబోయే మీకు ఇప్పుడు చెప్పులెందుకు?’’ అన్నాడు వైద్యుడు. ‘‘ఇంతవరకు నేను ఎవరిపైనా ఆధారపడలేదు. అందువల్ల నన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొంచెం సమయముంది కాబట్టి, అది ముగిసేలోగా నేను అక్కడికి చేరుకోవాలి. అందుకే చెప్పులడిగాను’’ అన్నాడు.

వెంటనే శిష్యుడు చెప్పులు తెచ్చాడు. వాటిని ధరించిన ఆ సన్యాసి నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళి, ఇంకా సమయం ఉండడంతో తన సమాధిని తానే తవ్వుకుని, అందులో పడుకుని మరణించాడు.

అలా తెలియని దానిని అంగీకరిస్తూ, స్వయంగా మీరే అలౌకిక ఆవలి తీరాలను ఆహ్వానించడమే అసలైన ధైర్యం. మృత్యువు రూపాంతరం చెందడమంటే అదే. అలాంటి మరణం ఒక మరణమే కాదు. అలాంటి ధైర్యమున్న వ్యక్తి ఎప్పటికీ మరణించడు. ఎందుకంటే, మృత్యువు అతని ముందు ఓడిపోయింది.

అందుకే అతడు దానిని దాటి ముందుకెళ్ళి, అలౌకిక ఆవలి తీరాలలోకి స్వయంగా అడుగుపెడతాడు. అలాంటి వ్యక్తులకే అవి స్వాగతం పలుకుతాయి. అలా మీరు వాటికి స్వాగతం పలికితే అవి మీకు స్వాగతం పలుకుతాయి. అందుకే అవి మీలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంతేకానీ, అవి ఎప్పుడూ మృత్యువులా ఉండవు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021

No comments:

Post a Comment