దేవాపి మహర్షి బోధనలు - 13


🌹. దేవాపి మహర్షి బోధనలు - 13 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 4. అశ్వవిద్య - 5 🌻


సమస్త జ్ఞాన ప్రదమగు యోగ విద్యయే అశ్వ విద్య. దీనికి మూలకారకమైన ఖగోళ భాగము ధనస్సు అనబడు రాశి.

ఇది అశ్వని నుండి 240° లలో ఆరంభించి 270 డిగ్రీలలో అంతమగును. వింటిని ధరించి అశ్వము వంటి ఉత్తర శరీరము గల నరుడు దీని రూపము. అనగా విజ్ఞాన కేంద్రమునకు గురి పెట్టుచున్న జ్ఞానాగ్నియగు వేగవంతమైన జీవమని దీని అర్థము.

ధనస్సు పురుషునకు సర్వశుభకర మనబడు నవమస్థానము. ప్రతి సంవత్సరము సూర్యుడీ భాగలలో ప్రవేశించినపుడు ధనుర్మాస మారంభమగును.

నిష్కామమైన విజ్ఞాన కాండను ఉపాసించు ధనుర్మాస వ్రతమిందులకే. యోగదండమునకు రెండు పాములు మెలికలు చుట్టుకొని యుండుట అశ్వరాశి చిహ్నము. బైబిలు గ్రంథమున కూడ ఈ రాశికి సంకేతము కలదు. దీనినే Aron's Rod అని ఉపదేశ రహస్యముగ చిత్రించిరి.

ఈ ఉపదేశమందిన వారికి దేవుని సృష్టి రహస్యములు వ్యక్తమగును. ఈ సంకేతమునే మనవారు కుండలినీ యోగ సాధనగ దర్శించిరి. ఈ అశ్వరాశిలో సూర్యుడు ప్రవేశించిన దినము నుండి యోగ సాధన వ్రతము లారంభించుట శాస్త్ర రహస్యము.

ఈ విధముగ జ్యోతిర్మయమైన శాశ్వత జ్ఞానాశ్వమునకు అశ్వనీ నక్షత్రము ముఖము. మూలా నక్షత్రము తోక. సూర్యుడు అశ్వనిలో ప్రవేశించుట, మూలలో ప్రవేశించుట రెండు విధముల విజ్ఞాన యజ్ఞములకు మూలకారణమై అనంతమగు జ్ఞాన రాశికి చిహ్నమై ఒప్పుచున్నవి.

ఇందలి రహస్యార్థము గమనింపదగినది. అశ్వని శిరస్సగు ఉషస్సు, మేషము యొక్క శిరస్సుగ ఉండును. మూల, అశ్వము యొక్క జఘనము. అది మూలాధారమున (ధనస్సున) నుండును.

ఈ రెండశ్వముల దేవతలే నాసత్యదులు. ఈ రెండు గుఱ్ఱములను కట్టిన రథమే జీవాత్మ శరీరము. ఈ రథముల రెక్కలే అక్షరముల లెక్కలుగ ఆదిపర్వము మొదట అక్షౌహిణి కథనముగ చెప్పబడినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021

No comments:

Post a Comment