గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 12. ఆత్మ - ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య.



🌹 12. ఆత్మ - ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 23, 24, 25, 📚

ఆత్మతత్వము నెరిగిన వారికే ఆత్మను గూర్చి పూర్ణమైన అవగాహన యుండును. ఎరుగుట యనగా అనుభవ పూర్వకముగా నెరుగుట. బోధనా పూర్వకముగ కాదు. బోధనా పూర్వకముగ ఆత్మను గూర్చి తెలుపుట కేవలము సమాచారము నందించుటయే.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతó || 23

అచ్ఛేద్యో-య మదాహ్యోయ మక్లేద్యో-శోష్య ఏవ చ |
నిత్య స్సర్వగత స్థా ్సణు రచలో-యం సనాతనó || 24

అవ్యక్తో-య మచింత్యో-య మవికార్యో-య ముచ్యతే |
తస్మా దేవం విదిత్వైనం నానుశోచితు మర›సి || 25

ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. అట్టి యోగవిద్యను ప్రతిపాదించు ప్రపంచ గ్రంథంము భగవద్గీత యొక్కియే!

ఆత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడు రెండవ అధ్యాయమున ఆత్మతత్త్వమును ప్రతిపాదించినాడు. అటుపైన

ఆత్మదర్శనము జరుగుటకు వలసిన సోపానము లేర్పరచినాడు.

ఆచరణ పూర్వకముగా భగవద్గీతను అందించటం జరిగింది.

అనుసరించుటయే సజ్జనుని కర్తవ్యము.

''ఆత్మ'' ఆయుధముచే ఛేదింపబడనిది. అగ్నిచే దహించబడనిది. నీటిచే తడప బడనిది. గాలిచే ఎండిప బడజాలదు. ఆత్మ నిత్యము. అంతా వ్యాపించి యున్నది. స్థిరమైనది. చలనము లేనిది. తుది, మొదలు లేనిది.

''ఆత్మ'' ఇంద్రియములకు గోచరము కాదు. మనస్సుచే చింతింప శక్యము కాదు. ఇట్లు ఆత్మను గూర్చి వివరించినపుడు పాఠకునకు అది సమాచారమే గాని, అనుభవపూర్వకము కాదు.

దానిని అనుభూతి చెందుటకే ''భగవద్గీత'' యను యోగ శాస్త్రమును భగవానుడే జాతి కందించినాడు. ఆచరణమే దీనికి ప్రధాన సూత్రము.

No comments:

Post a Comment