శివగీత - 42 / ᴛʜᴇ ꜱɪᴠᴀ-ɢɪᴛᴀ - 42


🌹. శివగీత - 42 / ᴛʜᴇ ꜱɪᴠᴀ-ɢɪᴛᴀ - 42 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

షష్ట మాధ్యాయము

🌻. విభూతి యోగము - 6 🌻

గర్భజన్మ జరామృత్యు - సంసార భయ సాగరాత్
తార యామి యతో భక్తం - తస్మాత్తారో హ మీరితః 36

చతుర్విధే షు దే హేషు - జీవత్వేన వ సామ్యసామ్,
సూక్ష్మో భూత్వాథ హృద్దేశే - యత త్సూక్ష్మః ప్రకీర్తతః 37

మహత మసి మగ్నే భ్యో - భక్తే భ్యో యత్ప్ర కాశయే,
విద్యుద్వ దతులం రూపం - తస్మ ద్వై ద్యుత మస్మ్యహమ్ 38

ఏక ఏవం యతో లోకా - న్వి సృజామి సృజామి చ ,
నివాసయామి గృహ్ణామి - తస్మాదేకో హమీశ్వరః 39

న ద్వీతి యో యత స్త స్థే - తురీయం బ్రహ్మయత్స్వయమ్
భూతాన్యాత్మని సంహృత్య చైకో - రుద్రో వసామ్య హమ్ 40

నా భక్తులను గర్భ - జన్మ - జరా – మృత్యుమయమగు నీ సంసార సాగరము నుండి దరింపజేయువాడిని కావున నన్ను తారకుదని యందురు.

నాలుగు రకాల దేహములందును జీవత్వరూపమున సూక్ష్ముండనై యుండుట వలన సూక్ష్మరూపుడను, ఘోరాందఃకారము (అజ్ఞానము) న మునిగియున్న భక్తులకు విద్యుత్తువలె భాసుర రూపమును జూపుట చేత వైద్యుతాభిఖ్యుడను వాడను నేనే.

ఏ కారణము వలన నేనొక్కడి నే సర్వలోకములను సృష్టించెదనో, వదలెదనో, జీవింపచేసెదనో మరల గ్రహించెదనో ఆ కారణముచేత నేనొక్కడినే ఈశ్వరుడిని.

త్రిమూర్తుల నధికమించి నాకు సమానమైన వాడు వేరొకడు లేకపోవుట వలన సమస్త ప్రాణులను నా హృదంతరాళము నందే సంహరింతును, కనుక నేనొక్కడినే రుద్రుండనై యున్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 42 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 06 :
🌻 Vibhooti Yoga - 6
🌻

Because I ferry my devotees from the birth, aging, death, and liberate them from the ocean of samsaara altogether; therefore I am called as Taraka.

In the four types of bodies (Jarayujam [womb born], Andajam [egg born], Svedajam [sweat born], Udbheedam [earth born]), Because I remain in a atomic size as Jiva,

hence I'm called as Sookshmarupa, To the ones who are immersed in the darkness of ignorance I show them the desire for knowledge and liberation like an electric spark hence I am called as Vaidyuta (lightning).

Because I alone create universes, I alone sustain them, and again I alone take them back into myself; hence I only am called as the Eswara (Lord).

There is none who is second to me because I am the Parabrahman beyond Turiya; I alone dissolve all creatures within my heart hence I am called as Rudra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

25.Aug.2020

No comments:

Post a Comment